MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaru-vaari-paata-thamanfb6da82a-3c07-4a4b-b6e4-dfbfce48b7b2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaru-vaari-paata-thamanfb6da82a-3c07-4a4b-b6e4-dfbfce48b7b2-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. కాగా వాటిలో మొదట తెరకెక్కిన అతడు సినిమా సూపర్ హిట్ సాధించగా ఆ తరువాత కొంత గ్యాప్ అనంతరం తెరకెక్కిన ఖలేజా సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కానప్పటికీ ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు మ్యానరిజం, డైలాగ్స్, స్టైల్ వంటివి ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పటికీ కూడా ఈ సినిమా ఎప్పుడు బుల్లితెరపై ప్రదర్శితం అయsarkaaru vaari paata;khaleja;mahesh;suresh;keerthi suresh;kirti;parasuram;ram pothineni;srinivas;thaman s;trivikram srinivas;rbi;tollywood;cinema;rajani kanth;january;audience;heroine;success;mythri movie makers;gmb entertainments;josh;khalejaసర్కారు వారి పాట లో ఖలేజా మార్క్ ..... మ్యాటర్ ఏమిటంటే .....??సర్కారు వారి పాట లో ఖలేజా మార్క్ ..... మ్యాటర్ ఏమిటంటే .....??sarkaaru vaari paata;khaleja;mahesh;suresh;keerthi suresh;kirti;parasuram;ram pothineni;srinivas;thaman s;trivikram srinivas;rbi;tollywood;cinema;rajani kanth;january;audience;heroine;success;mythri movie makers;gmb entertainments;josh;khalejaFri, 18 Dec 2020 23:34:53 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. కాగా వాటిలో మొదట తెరకెక్కిన అతడు సినిమా సూపర్ హిట్ సాధించగా ఆ తరువాత కొంత గ్యాప్ అనంతరం తెరకెక్కిన ఖలేజా సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కానప్పటికీ ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు మ్యానరిజం, డైలాగ్స్, స్టైల్ వంటివి ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పటికీ కూడా ఈ సినిమా ఎప్పుడు బుల్లితెరపై ప్రదర్శితం అయినా మంచి రేటింగ్స్ ని దక్కించుకుంటూ ఉంటుంది.

ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమా సర్కారు వారి పాట లో నటించనున్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించనుండగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది. థమన్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాకి మది ఫోటోగ్రఫి అందించనున్నారు. ఇటీవల మన దేశ బ్యాంకులను కుదిపేసిన పలు బడా స్కాముల నేపథ్యంలో పలు కమర్షియల్ హంగుల కలబోతగా దర్శకుడు పరశురామ్సినిమా తీయనున్నట్లు టాక్.

ఇక ఈ సినిమా కోసం తన మేకోవర్ ని ఇప్పటికే పూర్తిగా మార్చేసిన సూపర్ స్టార్ మహేష్, ఈ సినిమాలోని తన పాత్ర ద్వారా మరొక్కసారి ఫ్యాన్స్ ని ఎంతో అలరించనున్నారని అంటున్నారు. ఇందులో ఆయన ఒక ఆర్ధిక నేరస్తుడిగా కనిపించనున్నారని, అలానే ఆయన క్యారెక్టర్ గతంలో వచ్చిన ఖలేజా మూవీ లో మాదిరిగా ఫుల్ జోష్ తో పాటు ఎంటర్టైన్మెంట్ తో సాగుతుందని అంటున్నారు. కాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ జనవరి మూడవ వారం ప్రారంభం కానుండగా ఈ సినిమాని వచ్చే ఏడాది మహేష్ జన్మదినం సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు టాక్......!!




నాని, శర్వానంద్ లతో అక్కడ దిల్ రాజు పార్టీ..!

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!

లెస్బియన్‌గా హీట్ పెంచిన తెలుగమ్మాయి.. దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>