HealthSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/plasma9a9e0a75-0ffd-488e-b838-c7e84e578bf0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/plasma9a9e0a75-0ffd-488e-b838-c7e84e578bf0-415x250-IndiaHerald.jpgఇక నావల్ కరోనా వైరస్ పురుషుల్లో టెస్టిస్ డ్యామేజ్ కి కారణం అవ్వచ్చని తెలుస్తోంది. పరిశోధకులు కొవిడ్ 19 వల్ల మరణించిన వారిలో ఆరుగురి వద్ద నుండీ, ఇతర కారణాల వల్ల మరణించిన వారిలో ముగ్గురి వద్ద నుండీ టెస్టిస్ టిష్యూ సేకరించి పరిశోధనలు జరిపారు. కొవిడ్ 19 వల్ల మరణించిన ఆరుగురిలో ముగ్గురికి టెస్టిస్ డ్యామేజ్ జరిగిందనీ, వారి సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బ తిని ఉండేదనీ పరిశోధకులు చెబుతున్నారు. plasma;american samoa;telugu;coronavirusకోవిడ్ కు చేసే ప్లాస్మా ట్రీట్మెంట్ వాల్ల సంతాన సామర్ద్యం తగ్గుతుందా?కోవిడ్ కు చేసే ప్లాస్మా ట్రీట్మెంట్ వాల్ల సంతాన సామర్ద్యం తగ్గుతుందా?plasma;american samoa;telugu;coronavirusFri, 18 Dec 2020 16:30:00 GMTప్రపంచాన్ని గత ఏడాది కాలంగా గడగడలాడిస్తున్న కొవిడ్ 19 మహమ్మారితో పోరాడి గెలిచిన వారి నుండి సేకరించిన బ్లడ్ ప్లాస్మా సివియర్ కొవిడ్ 19 న్యుమోనియాతో బాధపడుతున్న వారికి ఎలాంటి రిలీఫ్‌నీ కలుగచేయటం లేదని రీసెంట్‌గా జరిగిన పరిశోధనల్లో తెలిసింది. ప్లెసీబో లానే కరోనాతో పోరాడి కోలుకున్న వారి నుండి సేకరించిన కన్వలసెంట్ ప్లాస్మా కూడా కరోనా వ్యాధి తీవ్రంగా సోకిన వారి ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరచలేక పోతోంది. అలాగే వారు మరణించే రిస్క్ ని కూడా తగ్గించలేకపోతోంది. కొవిడ్ 19 సోకి హాస్పిటల్ లో ఎడ్మిట్ అయిన వారిలో 333 మందికి ప్లెసీబో కానీ, కన్వలసెంట్ ప్లాస్మా గానీ ర్యాండమ్ గా ఎసైన్ చేశారు. ముప్ఫై రోజుల తరువాత ఈ పేషెంట్స్ లక్షణాలలో కానీ, ఆరోగ్యం లో కానీ ఎలాంటి చెప్పుకోదగిన మార్పూ కనబడలేదు. మరణించిన వారి శాతం కూడా సుమారుగా ఒకేలా ఉంది. కవలసెంట్ ప్లాస్మా గ్రూప్ లో పదొకొండు శాతం మంది మరణించగా, ప్లెసీబో గ్రూప్ లో పదకొండూ పాయింట్ నాలుగు శాతం మరణాలు సంభవించాయి. అయితే ఇంత తీవ్రంగా వ్యాధి సోకని వారికి, వ్యాధి నిర్ధారణ జరిగిన వెంటనే కన్వలసెంట్ ప్లాస్మా ఇస్తే అది హెల్ప్ చేయవచ్చని పరిశోధకులు అంటున్నారు. వృద్ధులయిన కొవిడ్ 19 పేషెంట్స్ కి వారి లక్షణాలు కనబడడం మొదలైన డెబ్భై రెండు గంటల లోపే కన్వలసెంట్ ప్లాస్మా ఇస్తే వారికి వ్యాధి తీవ్రం అయ్యే అవకాశం తగ్గుతోందని మరొక స్టడీ ద్వారా తెలిసింది.




ఇక నావల్ కరోనా వైరస్ పురుషుల్లో టెస్టిస్ డ్యామేజ్ కి కారణం అవ్వచ్చని తెలుస్తోంది. పరిశోధకులు కొవిడ్ 19 వల్ల మరణించిన వారిలో ఆరుగురి వద్ద నుండీ, ఇతర కారణాల వల్ల మరణించిన వారిలో ముగ్గురి వద్ద నుండీ టెస్టిస్ టిష్యూ సేకరించి పరిశోధనలు జరిపారు. కొవిడ్ 19 వల్ల మరణించిన ఆరుగురిలో ముగ్గురికి టెస్టిస్ డ్యామేజ్ జరిగిందనీ, వారి సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బ తిని ఉండేదనీ పరిశోధకులు చెబుతున్నారు. అలాగే, కొన్ని కేసుల్లో కొవిడ్ 19 పేషెంట్ల యొక్క ఇమ్యూన్ సిస్టమ్ వారి టెస్టిస్ ని ఎటాక్ చేసి సివియర్ ఇన్‌ఫ్లమేషన్ కీ, ఆర్కైటిస్ కీ కారణం అవుతోందని తెలుస్తోంది. ఈ పరిశోధనల తరువాత కొవిడ్ 19 సోకిన వారికీ, సోకి కోలుకున్న వారికీ వారు సంతానం కావాలనుకుంటే ఈ విషయం లో కూడా పరీక్ష చేయించుకోవాలని తెలుస్తోంది. ప్రపంచాన్ని చుట్టేస్తున్న కరోనా జెనెటిక్ ఛేంజెస్ కి లోనవుతోంది. అయితే,ఈ మార్పుల వల్ల ఈ వైరస్ ఇంకా స్పీడ్ గా వ్యాపిస్తుందేమో అన్న సందేహం అవసరం లేదు అంటున్నారు పరిశోధకులు. అందు వల్ల ఇప్పుడు కొవిడ్ 19 వ్యాక్సిన్ల విషయం లో ఎలాంటి ప్రాబ్లం లేదని తెలుస్తోంది. అమెరికా లో కొవిడ్ 19 యాంటీ బాడీస్ ఎక్కువగా న్యూ యార్క్ లోనే ఉన్నాయని తెలుస్తోంది. న్యూ యార్క్ లో, ఆగస్ట్ మధ్యకి బ్లడ్ సాంపిల్స్ లో ఇరవై ఐదు శాతం కొవిడ్ పాజిటివ్ గా తేలినవే. అయితే, ఈ యాంటీ బాడీస్ వలన కొవిడ్ 19 సొకకుండా ఉంటుందా అనే విషయం మీద ఇంకా పరిశోధనలు జరగవలసి ఉంది.



గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం అని గమనించగలరు.




తల్లి ఎదుటే కొడుకు ఊపిరి ఆగింది..

బాసూ ఏంటిది.. బ్యాటింగ్ ఎలాగో రాదు.. క్యాచ్ పట్టడం కూడా రాదా..?

ఆశపడిన టెక్కీ.. నగ్నంగా వీడియో కాల్.. కానీ చివరి లో ఊహించని ట్విస్ట్..?

కైలాస దేశానికి ఫ్రీ ఛార్టెడ్ ఫ్లయిట్..

బ్రేకింగ్: ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు

నేను రాజీనామా చేసేస్తా: గద్దె రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు

దూసుకొస్తున్న మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ప్రజలు అప్రమత్తంగా కండి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>