PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajnath-singh6b38278c-fe33-4dc8-b221-910b0ce40f4d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajnath-singh6b38278c-fe33-4dc8-b221-910b0ce40f4d-415x250-IndiaHerald.jpgక్షిపణులు కూడా వెళ్లలేని చోటుకూ మొబైల్ ఫోన్ పరిధి విస్తరించిందని, ప్రస్తుత పరిస్థితుల్లో సరిహద్దులు దాటకుండానే శత్రువు ప్రజలను చేరే అవకాశం ఉన్నదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పౌరుడు సైనికుడి పాత్రను పోషించాలని కోరారుrajnath singh;raj;delhi;hyderabad;rajnath singh;smart phone;media;social media;minister;war;central government;shatru1హైదరాబాద్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్హైదరాబాద్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్rajnath singh;raj;delhi;hyderabad;rajnath singh;smart phone;media;social media;minister;war;central government;shatru1Fri, 18 Dec 2020 21:32:23 GMTమంత్రి రాజ్ నాథ్ సింగ్ హైదరాబాదు వచ్చారు.  ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన దుండిగల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ట్రైనీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రెండు రోజుల పాటు హైదరాబాదులోనే ఉండనున్నారు రాజ్ నాథ్ సింగ్. శనివారం జరగనున్న ట్రైనీ పైలట్ల పరేడ్ లో ఆయన పాల్గొననున్నారు. శనివారం సాయంత్రం పహాడీషరీఫ్ లోని ఆర్సీఐలో డీఆర్డీవో రక్షణ పరికరాలను పరీక్షిస్తారు రాజ్ నాథ్ సింగ్. అనంతరం ఆయన ఢిల్లీకి తిరిగి వెళతారు.  


  క్షిపణులు కూడా వెళ్లలేని చోటుకూ మొబైల్ ఫోన్ పరిధి విస్తరించిందని, ప్రస్తుత పరిస్థితుల్లో సరిహద్దులు దాటకుండానే శత్రువు ప్రజలను చేరే అవకాశం ఉన్నదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పౌరుడు సైనికుడి పాత్రను పోషించాలని కోరారు. చండీగఢ్‌లో నిర్వహించిన వార్షిక మిలిటరీ సాహిత్యోత్సవంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా సోషల్‌ మీడియా, మొబైల్ యాప్‌ల ప్రభావాన్ని ఉటంకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తప్పుడు, పక్కదారి పట్టించే సమాచారం పట్ల మనల్ని మనం కాపాడుకుంటూ ఇతరులను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు రాజ్ నాథ్ సింగ్.

    ప్రస్తుతం కాలంతో పాటు భద్రతా పరమైన ముప్పులు కూడా మారాయని చెప్పారు రక్షణ మంత్రి. యుద్ధరీతిలో కూడా మార్పులు వచ్చాయన్నారు. భవిష్యత్తులో మన ముందుకు విభిన్న రీతిలో భద్రతా ముప్పులు రావచ్చునని చెప్పారు. 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగి 50 ఏండ్లు పూర్తవుతున్నాయని, ఈ ఏడాది నిర్వహిస్తున్న స్నాతకోత్సవం ఎంతో ప్రత్యేకమైందన్నారు. ఈ యుద్ధంలో దేశం కోసం పోరాడి పదవీ విరమణ చేసిన సైనికుల నుంచి యువత నేర్చుకోవాలని రాజ్ నాథ్ సింగ్ సూచించారు. మొబైల్ ఫోన్లలో యుద్ధానికి సంబంధించిన ఆటలు ఆడవచ్చు కానీ, నిజమైన యుద్ధానికి దానికి ఎంతో తేడా ఉంటుందన్నారు.

  


దిల్ రాజు బర్త్ డే లో ఆ ఇద్దరు మిస్.. ఎందుకు..?

రజినికాంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. 2018 కేసులో..

వైష్ణవ్ తేజ్ తేజ్ సినిమా OTT కే ఖాయం..?

సినీ ఇండస్ట్రీకి బ్లాక్ మార్క్ రాసిన ఇయర్ ?

కాంగ్రెస్ వైపు ఫుల్ ఫోకస్...రేపు ఏం జరగనుంది...?

నిమ్మగడ్డ, సుజనాకు రాజకీయాలే కావాలి: ఏపీ మంత్రి

సర్కార్ వారి పాటలు ఓరేంజ్ లో బాదేస్తాడట..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>