PoliticsP Subhadra devieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/water-problemb913e1fe-c076-4699-be7b-edb497d8c4ad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/water-problemb913e1fe-c076-4699-be7b-edb497d8c4ad-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ లో అద్దెకున్నవాళ్ళకి ఇకపై నీటి కష్టాలున్నట్లేనా? తన్నీరు తన్నీరు అంటూ తన్నుకు చావాల్సిందేనా? అద్దెకున్న పాపానికి నీరు దొరక్క ఇక్కట్ల పాలవ్వసిందేనా? ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వస్తోంది. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా డిసెంబర్ నుంచి ప్రతి ఇంటికి 20వేల ఉచిత నల్లా నీరు పంపిణీ చేస్తామంటూ చేసిన వాగ్దానం మేరకు ఉచిత నీరు వృధా కాకుండా చూసేందుకు తగు జాగ్రత్త తీసుకుంటున్నారు. water problem;koti;amala akkineni;hyderabad;capital;december;aquaటెనెంట్స్ కి నీటి కష్టాలు తప్పవా?టెనెంట్స్ కి నీటి కష్టాలు తప్పవా?water problem;koti;amala akkineni;hyderabad;capital;december;aquaFri, 18 Dec 2020 15:00:00 GMTహైదరాబాద్ లో అద్దెకున్నవాళ్ళకి ఇకపై నీటి కష్టాలున్నట్లేనా? తన్నీరు తన్నీరు అంటూ తన్నుకు చావాల్సిందేనా? అద్దెకున్న పాపానికి నీరు దొరక్క ఇక్కట్ల పాలవ్వసిందేనా? ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వస్తోంది. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా  డిసెంబర్ నుంచి ప్రతి ఇంటికి 20వేల ఉచిత నల్లా నీరు పంపిణీ చేస్తామంటూ చేసిన వాగ్దానం మేరకు ఉచిత నీరు వృధా కాకుండా చూసేందుకు తగు జాగ్రత్త తీసుకుంటున్నారు.

అందుకనుగుణంగా నల్లా కనెక్షన్ ని ఆధార్ తో అనుసంధానం చేస్తున్నారు. ఈ పద్దతే కానీ అమలు జరిగితే అద్దెకున్నవారిలో చాలామందికి నల్లా నీరు అందని పరిస్థితి నెలకొంటుంది. ఒకరి పేరిట ఎన్ని కనెక్షన్లు ఉన్నా ఒకదానికి మాత్రమే నల్లా నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దాంతో, రాజధాని నగరంలో అద్దెకున్నవారికి నల్లా నీరు అందని పరిస్థితి నెలకొంటుంది. ఇంటి యజమాని తానున్న ఇంటికి మాత్రమే ఈ సౌలభ్యం అందేలా చూసుకుంటాడు.


ప్రస్తుతం గ్రేటర్ లో వాటర్ బోర్డు రోజు విడిచి రోజు కోటి మంది జనాభాకి నీటి సరఫరా చేస్తోంది. వాటర్ బోర్డులో నల్లా కనెక్షన్లు 10. 60 లక్షల దాకా ఉన్నాయి. వాటిలో వివిధ విభాగాల కింద ఈ కనెక్షన్లు ఉన్నాయి. గృహావసరాలకు, వాణిజ్య అవసరాలకు ఈ కనెక్షన్లున్నాయి.


అత్యధికంగా గృహావసరాలకు నీటిని అందిస్తున్నారు. 9 లక్షలకు పైగా గృహాలకు ఈ సౌకర్యం అందుతోందని ఓ అంచనా. కాగా కొందరి పేరిట ఒకటికి మించి పది దాకా కనెక్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది. నల్లా కలెక్షన్లకు ఆధార్ అనుసంధానం చేస్తే ఇలాంటి కేసులు ఇబ్బడి ముబ్బడిగా బయటపడతాయని తెలుస్తోంది. ఏది ఏమైనా గ్రేటర్ ఎన్నికల్లో ఉచిత నల్లా నీరు అంటూ ఊదరగొట్టి ఇప్పుడు ఆధార్ అంటూ ఆంక్షలు విధించడంతో అద్దెకున్నవారికి నీటి కష్టాలు వెంటాడేలా పరిస్థితి ఉందంటున్నారు పరిశీలకులు. సంక్షేమం పేరిట ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యల్ని పలువురు ఆక్షేపిస్తున్నారు.


ఏప్రిల్ లో ఎంట్రీ ఇవ్వనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్..!!

చిరంజీవితో నటించనన్న రాములమ్మ.. కారణం ఏంటంటే!

చిరంజీవి నటించిన ఆ సినిమా హాలీవుడ్ లో కాపీ కొట్టారా..?

సొంత పార్టీ కార్యకర్తల భూములనే కబ్జా చేసిన వైసీపీ నేత..

మన స్టార్ హీరోస్ ఎంత మంది ముసలి పాత్రలు చేసారో తెలుసా..?

వరుస మల్టీస్టారర్ లో మెగా పవర్ స్టార్

దిల్ రాజు పార్టీ లో మెరిసిన టాలీవుడ్ ప్రముఖులు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P Subhadra devi]]>