Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/stiti-irani68ed96b9-c86a-4897-9b5d-123dea440357-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/stiti-irani68ed96b9-c86a-4897-9b5d-123dea440357-415x250-IndiaHerald.jpgరైతు చట్టాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులకోసమే ఈ చట్టాలు తెచ్చారని అన్నారు. ఎంఎస్‌పీ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో...stiti irani;soniagandhi;rahul new;rahul;k l rahul;narendra modi;mohandas karamchand gandhi;sonia gandhi;smriti irani;congress;government;prime minister;minister;fire;rahul sipligunj;central government;lucknow;narendraఎంఎస్‌పీకి రూ.8 లక్షల కోట్లు.. కాంగ్రెస్ రూ.3.5 కోట్లే..!ఎంఎస్‌పీకి రూ.8 లక్షల కోట్లు.. కాంగ్రెస్ రూ.3.5 కోట్లే..!stiti irani;soniagandhi;rahul new;rahul;k l rahul;narendra modi;mohandas karamchand gandhi;sonia gandhi;smriti irani;congress;government;prime minister;minister;fire;rahul sipligunj;central government;lucknow;narendraFri, 18 Dec 2020 18:13:00 GMTకేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులకోసమే ఈ చట్టాలు తెచ్చారని అన్నారు. ఎంఎస్‌పీ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో స్మృతీ ప్రసంగించారు. ఆరేళ్ల పాలనలో ప్రధాని కనీస మద్దతు ధర కింద రైతులకు 8 లక్షల కోట్ల రూపాయలు అందించారని, కానీ 10ఏళ్ల యూపీఏ కాలంలో కేవలం 3.5 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.


కేంద్రం తీసుకొచ్చిన బిల్లులపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని, బిల్లులు తయారు చేసింది రైతులు కాదని, కార్పోరేట్ల కోసమే ఈ చట్టాలు చేశామని ఆరోపిస్తున్నారని, తమ ప్రభుత్వంలో రైతులు బాగుపడడం ఇష్టం లేకనే వారు ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతలు 40 అంగుళాల ఆలూ గురించి మాట్లాడుతున్నారని, అలాంటి వారు రైతులెలా అవుతారని ప్రశ్నించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. వీళ్లు కూడా రైతులు కాదన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. రైతుల కోసం పాటుపడుతున్న ప్రభుత్వం తమదేనని స్మృతి అన్నారు.

కేంద్రం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాల వ్యతిరేకంగా అనేక రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. వందల సంఖ్యలో రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. కొత్త బిల్లుల్లో ఎంఎస్‌పీ ప్రస్తావన లేదని, ఇది రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని చెబుతున్నారు. కొత్త చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అనేకసార్లు రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది.

ఎంస్‌పీకి సంబంధించి తాము పూర్తిగా సానుకూలంగా ఉన్నామని కేంద్రం ఎప్పటికపుడు చెబుతున్నా రైతులు వినిపించుకోవడం లేదు. కొత్త చట్టాలు పూర్తిగా రద్దు చేసేవరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, అవసరమైతే మరింత ఉధృతం చేస్తామని చెబుతున్నారు.


రజినికాంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. 2018 కేసులో..

వైష్ణవ్ తేజ్ తేజ్ సినిమా OTT కే ఖాయం..?

సినీ ఇండస్ట్రీకి బ్లాక్ మార్క్ రాసిన ఇయర్ ?

కాంగ్రెస్ వైపు ఫుల్ ఫోకస్...రేపు ఏం జరగనుంది...?

నిమ్మగడ్డ, సుజనాకు రాజకీయాలే కావాలి: ఏపీ మంత్రి

సర్కార్ వారి పాటలు ఓరేంజ్ లో బాదేస్తాడట..?

ఏజ్ బార్ హీరోల మీద హాట్ కామెంట్స్...తట్టుకోలేరూ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>