BeautyNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/makeup-removal0563cad1-62bc-46cb-bab2-862970c82c0f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/makeup-removal0563cad1-62bc-46cb-bab2-862970c82c0f-415x250-IndiaHerald.jpgచాలాసార్లు, మేకప్ ను తొలగించడానికి కూడా అటెన్షన్ అవసరం అవుతుందన్న విషయాన్ని మరచిపోతూ ఉంటారు చాలామంది. మేకప్ ని అలాగే ఉంచి నిద్రపోతే అనేక స్కిన్ ప్రాబ్లెమ్స్ వస్తాయి. ముఖంపై మచ్చలు అలాగే యాక్నే సమస్య రావచ్చు. మార్కెట్ లో మేకప్ రిమూవర్స్ కూడా బోలెడన్ని అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో కెమికల్స్ ఉంటాయి. వాటిని ముఖంపై రెగ్యులర్ గా అప్లై చేసుకోవడం అంత మంచిది కాదు. కాబట్టి, మేకప్ ను సులభంగా తొలగించుకునేందుకు మనందరికీ అందుబాటులో ఉండే కొన్ని నేచురల్ ప్రోడక్ట్స్ కూడా హెల్ప్ అవుతాయి. అవేమిటో, ఇప్పుడు తెలుసmakeup removal;beauty;rasam;oil;vegetable market;makeup;aaviri;manamఈ ఐదు చిట్కాలతో మేకప్ ను నేచురల్ వే లో రిమూవ్ చేసుకోవచ్చు.ఈ ఐదు చిట్కాలతో మేకప్ ను నేచురల్ వే లో రిమూవ్ చేసుకోవచ్చు.makeup removal;beauty;rasam;oil;vegetable market;makeup;aaviri;manamFri, 18 Dec 2020 16:00:00 GMTమేకప్ ను సరైన విధంగా అప్లై చేసుకోవడం ద్వారా మంచి లుక్ ను పొందవచ్చు. మరి మేకప్ వేసుకోవడంపై ఎంతటి శ్రద్ధ కనబరుస్తామో, మేకప్ రిమూవల్ పై కూడా అంతే ఇంటరెస్ట్ చూపించాలి.

చాలాసార్లు, మేకప్ ను తొలగించడానికి కూడా అటెన్షన్ అవసరం అవుతుందన్న విషయాన్ని మరచిపోతూ ఉంటారు చాలామంది. మేకప్ ని అలాగే ఉంచి నిద్రపోతే అనేక స్కిన్ ప్రాబ్లెమ్స్ వస్తాయి. ముఖంపై మచ్చలు అలాగే యాక్నే సమస్య రావచ్చు. మార్కెట్ లో మేకప్ రిమూవర్స్ కూడా బోలెడన్ని అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో కెమికల్స్ ఉంటాయి. వాటిని ముఖంపై రెగ్యులర్ గా అప్లై చేసుకోవడం అంత మంచిది కాదు. కాబట్టి, మేకప్ ను సులభంగా తొలగించుకునేందుకు మనందరికీ అందుబాటులో ఉండే కొన్ని నేచురల్ ప్రోడక్ట్స్ కూడా హెల్ప్ అవుతాయి. అవేమిటో, ఇప్పుడు తెలుసుకుందాం.

1.బేకింగ్ సోడాతో తేనె:
ఈ రెమెడీ ఏ స్కిన్ టైప్ కైనా బాగా పనిచేస్తుంది. తేనెను శుభ్రమైన క్లాత్ లోకి లేదా దూదిలోకి తీసుకుని దానిపై కొంత బేకింగ్ సోడాను చల్లండి. దీంతో, ముఖంపై సున్నితంగా రబ్ చేయండి. ఇది మంచి క్లీన్సర్ లా పనిచేస్తుంది. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోండి.
 
2. కొబ్బరి నూనె:
కొబ్బరినూనె చర్మంపై మ్యాజిక్ లా పనిచేస్తుంది. ఇది స్కిన్ ను రిపేర్ చేసేందుకు హెల్ప్  చేస్తుంది. ఇంట్లో కొబ్బరి నూనె ఉంటే చాలు వేరే ఏ మేకప్ రిమూవర్ అవసరం లేదు. హెవీ మేకప్ ఉన్నప్పుడు అలాగే వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకున్నప్పుడు కూడా మేకప్ ను తొలగించడానికి కొబ్బరి నూనె బాగా హెల్ప్ చేస్తుంది.

3. పాలు:
చిన్నగిన్నెలోకి పాలు తీసుకుని అందులోకి చిన్న చిన్న ఉండలుగా చేసిన దూదిని ముంచండి. వాటితో మేకప్ ను రిమూవ్ చేసుకోండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ బాదాం నూనెను కూడా యాడ్ చేయవచ్చు. ఈ రెమెడీ అనేది ముఖాన్ని తాజాగా ఉంచుతుంది అదే సమయంలో హైడ్రేటెడ్ గా కూడా ఉంచుతుంది.

4. దోసకాయ రసం:
మార్కెట్ లో అందుబాటులో ఉన్న చాలా బ్యూటీ ప్రోడక్ట్స్ లో దోసకాయ రసం మెయిన్ ఇంగ్రిడియెంట్ గా ఉంటుంది. దోసకాయ రసంతో మేకప్ ను రిమూవ్ చేయడం చాలా సులభం.

5. ఆవిరి పట్టడం:
ఆవిరిపట్టడం ద్వారా కూడా మేకప్ ను తొలగించవచ్చు. ఇది నిజానికి సూతింగ్ క్లీన్సర్ అని చెప్పుకోవచ్చు. చర్మాన్ని లోలోపల నుంచి శుభ్రపరుస్తుంది. హెవీ అలాగే వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకున్నవారికి ఈ చిట్కా భలే హెల్ప్ అవుతుంది. a


సినీ పరిశ్రమకు జగన్ గుడ్ న్యూస్ చెప్తారా...?

కైలాస దేశానికి ఫ్రీ ఛార్టెడ్ ఫ్లయిట్..

బ్రేకింగ్: ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు

నేను రాజీనామా చేసేస్తా: గద్దె రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు

దూసుకొస్తున్న మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ప్రజలు అప్రమత్తంగా కండి..?

చిరంజీవితో నటించనన్న రాములమ్మ.. కారణం ఏంటంటే!

చిరంజీవి నటించిన ఆ సినిమా హాలీవుడ్ లో కాపీ కొట్టారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>