PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babubd3a98c5-678b-469f-9557-b98095130711-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babubd3a98c5-678b-469f-9557-b98095130711-415x250-IndiaHerald.jpgచంద్రబాబునాయుడు. రాజకీయాల్లోకి వస్తూనే మంత్రి అయిపోయిన అదృష్టజాతకుడు. అంతేనా కాంగ్రెస్ లో అలా ఓడిన వెంటనే అప్పటికే తన మామ ఎన్టీయార్ అధికారంలోకి వచ్చి రెడీగా ఉంచిన టీడీపీలో చాలా ఈజీగా దూకేసిన లక్కీ కూడా ఆయనదే. అంతేనా మామ పార్టీనే తన పార్టీగా చెప్పుకుని పాతికేళ్ళ పాటు టీడీపీకి ఎదురులేని నాయకత్వం వహిస్తున్న మొనగాడు. ఇలా ఇన్ని రకాలుగా అదృష్టం ఎడా పెడా కలసివచ్చిన బాబుకు ఎదురుగా ఉన్న వారికి కూడా అందులో కొద్దో గొప్పో లక్ కలసి వస్తుందిగా. babu;cbn;ntr;nani;kodali nani;hyderabad;jagan;congress;minister;tdp;ycp;lokesh kanagaraj;partyబాబుతోనే మళ్ళీ పోటీ...ఈసారి 170 సీట్లే ?బాబుతోనే మళ్ళీ పోటీ...ఈసారి 170 సీట్లే ?babu;cbn;ntr;nani;kodali nani;hyderabad;jagan;congress;minister;tdp;ycp;lokesh kanagaraj;partyFri, 18 Dec 2020 10:00:00 GMTమంత్రి అయిపోయిన అదృష్టజాతకుడు. అంతేనా కాంగ్రెస్ లో అలా  ఓడిన వెంటనే అప్పటికే తన మామ ఎన్టీయార్ అధికారంలోకి వచ్చి రెడీగా ఉంచిన టీడీపీలో చాలా ఈజీగా దూకేసిన లక్కీ కూడా ఆయనదే. అంతేనా మామ పార్టీనే తన పార్టీగా చెప్పుకుని పాతికేళ్ళ పాటు టీడీపీకి ఎదురులేని నాయకత్వం వహిస్తున్న మొనగాడు. ఇలా ఇన్ని రకాలుగా అదృష్టం ఎడా పెడా కలసివచ్చిన బాబుకు  ఎదురుగా ఉన్న వారికి కూడా అందులో కొద్దో గొప్పో లక్ కలసి వస్తుందిగా.

సరిగ్గా ఇదే లాజిక్ ని కనిపెట్టి బాబు మీద తనదైన  మ్యాజిక్ మాటలతో గట్టిగా తగులుకున్నారు వైసీపీ మంత్రి కొడాలి నాని. బాబూ నీవు రాజకీయాల్లో ఉండాల్సిందే. నీవు ఉంటే ఈసారి జగన్ కి 151 సీట్లు కాదు 170 పక్కా అంటూ వేసిన పంచులకు బాబు దిమ్మతిరిగి ఉంటుందేమో కదా. ఎందుకంటే టీడీపీకి బాబు నాయకత్వమే శరణ్యం. ఆయనది అవుట్ డేటెడ్ పాలిటిక్స్ అని జగన్ ఎపుడో డిసైడ్ చేశారు. ఇపుడు కొడాలి నాని కూడా అదే చెబుతున్నారు. ఇక  ఫేక్ అన్న మాట రాజకీయాల్లో జోరుగా వినిపిస్తోంది. జగన్ని ఇంతకాలం తుగ్లక్ సీఎం అంటూ వచ్చిన చంద్రబాబు ఈ మధ్య ఫేక్ సీఎం అంటున్నారు. దాంతో కొడాలి నాని రివర్స్ అటాక్ చేశారు.

అసలు టీడీపీయే ఒకఫేక్ పార్టీ అంటూ ఆయన గట్టి కౌంటరే ఇచ్చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగితే బాబు, లోకేష్ కనీసం ప్రచారం చేయలేదని, ఫేక్ పార్టీ కాకపొతే మరేంటి ఇది అంటూ సెటైర్లు వేశారు. అదే విధంగా టీడీపీ జాతీయ పార్టీయా, ఎన్నికల సంఘం వద్ద అలా రిజిష్టర్ చేశారా. టీడీపీ ఒక ఉప ప్రాంతీయా పార్టీ అని కూడా ఎకసెక్కం ఆడారు. ఇలా ఫేక్ మాటలు చెప్పుకుంటూ  తిరిగే బాబు టీడీపీని ఫేక్ చేశారని కూడా అన్నారు. జగన్ కష్టపడి జనంలో తిరిగి అధికారం సంపాదించుకున్నారని, ఆయనే మళ్ళీ సీఎం అవుతారని కూడా కొడాలి ఢంకా భజాయించేశారు. మొత్తానికి తమకు పోటీగా బాబు మాత్రమే ఉండాలి నాని అనడం కొసమెరుపే.




3 పెళ్లిళ్లు, 4 ప్రేమలు, 5 వ సారి మల్లి ప్రేమలో పడ్డ హీరోయిన్ వనిత..?

వారి విజయం కే‌సి‌ఆర్ కు నచ్చడంలేదట..ఎందుకో..??

రెఫరెండం అంటే ఏంటి..? చంద్రబాబే ఎందుకు గెలుస్తారు..?

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>