PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjayd0ba3277-103f-4d39-9e6e-89d7d918eb03-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjayd0ba3277-103f-4d39-9e6e-89d7d918eb03-415x250-IndiaHerald.jpgతెరాస ని టార్గెట్ గా చేసుకుని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. బీజేపీ కార్పోరేటర్లను కెలికితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ చేర్చుకోవటానికి వెనుకాడమన్న బండి సంజయ్... టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు అని వ్యాఖ్యానించారు. కార్పోరేటర్లు కొనుగోళ్ళకు టీఆర్ఎస్ ప్రయత్నాలూ ప్రారంభించింది అని ఆయన ఆరోపించారు. జీహెచ్ఎంసీ పాలకవర్గాన్ని నియమించకుండా ముఖ్యమంత్రి కావాలనే ఆలస్యం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారుbandi sanjay,trs,kcr,bjp,ts;kcr;dharma;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;chief minister;service;mim party;hindus;partyతెరాస ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలుతెరాస ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలుbandi sanjay,trs,kcr,bjp,ts;kcr;dharma;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;chief minister;service;mim party;hindus;partyFri, 18 Dec 2020 14:21:54 GMTతెరాస ని టార్గెట్ గా చేసుకుని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. బీజేపీ కార్పోరేటర్లను కెలికితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ చేర్చుకోవటానికి వెనుకాడమన్న బండి సంజయ్... టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు అని వ్యాఖ్యానించారు. కార్పోరేటర్లు కొనుగోళ్ళకు టీఆర్ఎస్  ప్రయత్నాలూ  ప్రారంభించింది అని ఆయన ఆరోపించారు. జీహెచ్ఎంసీ పాలకవర్గాన్ని నియమించకుండా ముఖ్యమంత్రి కావాలనే ఆలస్యం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.

వరద బాధితులకు సాయంపై బీజేపీ కార్పోరేటర్లు ఉద్యమానికి దిగబోతున్నారు అని ఆయన హెచ్చరించారు. మా కార్పోరేటర్లు పార్టీ ఫిరాయించమని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు అని ఆయన చెప్పుకొచ్చారు. పొర్లు దండాలు పెట్టినా.. కేసీఆర్ జైలుకు  పోవటం‌ ఖాయం అన్నారు. కాళీమాత దేవాలయం భూములపై ఎండోమెంట్ అధికారులు స్పందించ లేదు అంటూ మండిపడ్డారు. దేవస్థానాల‌ భూముల జోలికొస్తే ఎంతకైనా తెగిస్తాం అని ఆయన హెచ్చరించారు. పాతబస్తీ బీజేపీ అడ్డా... పాతబస్తీని అభివృద్ధి చేసి చూపుతాం అని ఆయన స్పష్టం చేసారు.

సీఎం మార్ఖత్వం, చేతకాని తనం వలన గెలిచిన కార్పోరేటర్లు ప్రజలకు సేవ చేయలేకపోతున్నారు అని మండిపడ్డారు. ఎంఐఎం, టీఆర్ఎస్ లు హైద్రాబాద్ ను విధ్వంసం చేస్తున్నాయి అని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్, ఎంఐఎం విముక్త్ హైదరాబాద్ ను ఏర్పాటు చేస్తాం అన్నారు. ఎల్ఆర్ఎస్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేసారు.  భాగ్యలక్ష్మీ దేవాలయం వలనే  భాగ్యనగరం అనే పేరొచ్చింది అన్నారు. అధికారం ఎవరి దగ్గరుంటే వాళ్ళతో పొత్తు పెట్టుకోవటం ఎంఐఎంకు అలవాటు అని మండిపడ్డారు. మెట్రో కావాలా? వద్దా? పాతబస్తీ  ప్రజలు తేల్చుకోవాలి అని సూచించారు. పాతబస్తీ ఉగ్రవాదులకు అడ్డగా మారింది అన్నారు. బీజేపీ ఏ మతానికి అడ్డు కాదు.. హిందువు ధర్మం జోలికొస్తే ఊరుకోం  అని హెచ్చరించారు.  శుక్రవారం రోజున భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవటం సంతోషం అన్నారు.


సర్కారు వారి పాటలు అంతకు మించి ఉండబోతున్నాయా ?

చిరంజీవితో నటించనన్న రాములమ్మ.. కారణం ఏంటంటే!

చిరంజీవి నటించిన ఆ సినిమా హాలీవుడ్ లో కాపీ కొట్టారా..?

సొంత పార్టీ కార్యకర్తల భూములనే కబ్జా చేసిన వైసీపీ నేత..

మన స్టార్ హీరోస్ ఎంత మంది ముసలి పాత్రలు చేసారో తెలుసా..?

వరుస మల్టీస్టారర్ లో మెగా పవర్ స్టార్

దిల్ రాజు పార్టీ లో మెరిసిన టాలీవుడ్ ప్రముఖులు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>