PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-politics8cc27358-938d-40e1-950e-05994d978bd4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-politics8cc27358-938d-40e1-950e-05994d978bd4-415x250-IndiaHerald.jpgప్రస్తుతానికి మేయర్ పీఠం విషయం పెద్దగా చర్చకు రావడం లేదు. అంతా తెరాస వైఫల్యం గురించే చర్చించుకుంటున్నారు. దీనితో సీఎం కేసీఆర్ కు మరియు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కంటి మీద కునుకు లేకుండా పోయింది... వచ్చే ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి తప్పకుండా వస్తుందని విశ్వాసంతో ఉన్నారు. telangana politics;view;kcr;ktr;nagarjuna akkineni;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;narendra modi;leaderబండి సంజయ్: కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం...!బండి సంజయ్: కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం...!telangana politics;view;kcr;ktr;nagarjuna akkineni;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;narendra modi;leaderFri, 18 Dec 2020 14:00:00 GMTతెలంగాణ రాష్ట్రమంతా గ్రేటర్ ఎన్నికలకు ముందు రాజకీయ జ్వాలలతో కాలిపోయింది. ఎన్నెన్నో ప్రతిజ్ఞలు, ఎన్నో సవాళ్లు మరెన్నో ప్రతి సవాళ్ల మధ్య గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఎంత సంచలనంగా మారాయన్నది మనము ప్రత్యక్షముగా చూశాము. తెరాస ఎంతో గట్టి నమ్మకంతో ఎట్టి పరిస్థితుల్లో గ్రేటర్ ఎన్నికలలో విజయం మాదే అంటూ ప్రగల్బాలు పలికారు....కానీ దానికి పూర్తి వ్యతిరేకముగా ప్రజలు తీర్పు ఇచ్చారు. దీనితో తెరాస ఆత్మరక్షణలో పడింది అనవచ్చు.

మరో వైపు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బండి సంజయ్ సారధ్యంలో తెలంగాణలో బీజేపీ ఎంతో గణనీయంగా ముందుకు వెళుతోంది. బండి సంజయ్ అధ్యక్ష పదవి చేపట్టి ఆరు నెలలు కూడా గడవక ముందే బీజేపీ కార్యకర్తల్లో, అటు తెలంగాణ ప్రజలలో ఎంతో నమ్మకం ఏర్పడింది. ఇదంతా ఇలా ఉండగా ఈరోజు బండి సంజయ్ పాత బస్తీలో అమ్మవారి పూజకు వెళ్లారు. ఈ సందర్భముగా అక్కడ మాట్లాడుతూ తెరాస ఇక దుకాణం సర్దుకోవాలి. బీజేపీ ముందు ఎవ్వరైనా దిగ దుడుపే అన్నారు...రానున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోనూ బీజేపీ విజయభేరి మోగిస్తుందని ఘంటాపధంగా చెప్పడం వారి నమ్మకానికి ప్రతి రూపం అని చెప్పవచ్చు.

ప్రస్తుతానికి మేయర్ పీఠం విషయం పెద్దగా చర్చకు రావడం లేదు. అంతా తెరాస వైఫల్యం గురించే చర్చించుకుంటున్నారు. దీనితో సీఎం కేసీఆర్ కు మరియు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కంటి మీద కునుకు లేకుండా పోయింది... వచ్చే ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి తప్పకుండా వస్తుందని విశ్వాసంతో ఉన్నారు. బండి సంజయ్ కేసీఆర్ ని ఉద్దేశించి మాట్లాడుతూ మీరు చేసింది ఇక చాలు...మిగతా పని జైలు కి వెళ్లి చేసుకోండి అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు... ఏదేమైనా కేసీఆర్ కు ఇది గడ్డు కాలమని చెప్పవచ్చు...అయితే మొన్ననే కేసీఆర్ ఢిల్లీ కి వెళ్లి మోదీ ని కలిసిన సంగతి తెలిసిందే...ఏమో కేసీఆర్ ఎటువంటి రాజకీయ వ్యూహంతో బరిలోకి దిగుతారో ఎవరికి తెలుసు అని రాజకీయ ప్రముఖులు అనుకుంటూ ఉన్నారు.


డేగ కన్నేసిన కేంద్ర ప్రభుత్వం..!

చిరంజీవి నటించిన ఆ సినిమా హాలీవుడ్ లో కాపీ కొట్టారా..?

సొంత పార్టీ కార్యకర్తల భూములనే కబ్జా చేసిన వైసీపీ నేత..

మన స్టార్ హీరోస్ ఎంత మంది ముసలి పాత్రలు చేసారో తెలుసా..?

వరుస మల్టీస్టారర్ లో మెగా పవర్ స్టార్

దిల్ రాజు పార్టీ లో మెరిసిన టాలీవుడ్ ప్రముఖులు

అవేంజర్స్ దర్శకుల సినిమాలో ధనుష్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>