PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/kcrce2c16fc-639c-4d02-ac0a-151caf7e053b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/kcrce2c16fc-639c-4d02-ac0a-151caf7e053b-415x250-IndiaHerald.jpgతెలంగాణ సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల రూ.3500కోట్ల రూపాయలు నష్టపరిహారం కట్టాల్సి వస్తోందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో రహదారుల నిర్మాణం కోసం ఎల్ అండ్ టి సంస్ధకు పనులు అప్పజెప్పామని, భూసేకరణ సకాలంలో జరక్కపోవడంతో ఆ సంస్థ నష్టపరిహారం అడుగుతోందని చెప్పారు. 2014లో ఎల్ ‌అండ్ ‌టి సంస్థకు తెలంగాణలో రహదాలు నిర్మాణ పనులు అప్పజెప్పినా, భూసేకరణ విషయంలో సీఎం కేసీఆర్‌ ఏడాది ఆలస్యం చేయడంతో ఇప్పుడు ఆ సంస్థ రూ.3,500 కోట్లు పరిహారం ఇవ్వాలని అడుగుతోందని అన్నారు కిషన్ రెడ్డkcr;kcr;vijayawada;telangana;g kishan reddy;ram madhav;suryapeta;chief minister;minister;letter;central government;research and analysis wing;reddyకేసీఆర్ వల్ల కేంద్రానికి రూ.3,500కోట్లు నష్టం.. ఎలాగంటే..?కేసీఆర్ వల్ల కేంద్రానికి రూ.3,500కోట్లు నష్టం.. ఎలాగంటే..?kcr;kcr;vijayawada;telangana;g kishan reddy;ram madhav;suryapeta;chief minister;minister;letter;central government;research and analysis wing;reddyFri, 18 Dec 2020 12:00:00 GMTతెలంగాణ సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల రూ.3500కోట్ల రూపాయలు నష్టపరిహారం కట్టాల్సి వస్తోందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో రహదారుల నిర్మాణం కోసం ఎల్ అండ్ టి సంస్ధకు పనులు అప్పజెప్పామని, భూసేకరణ సకాలంలో జరక్కపోవడంతో ఆ సంస్థ నష్టపరిహారం అడుగుతోందని చెప్పారు. 2014లో ఎల్ ‌అండ్ ‌టి సంస్థకు తెలంగాణలో రహదాలు నిర్మాణ పనులు అప్పజెప్పినా, భూసేకరణ విషయంలో సీఎం కేసీఆర్‌ ఏడాది ఆలస్యం చేయడంతో ఇప్పుడు ఆ సంస్థ రూ.3,500 కోట్లు పరిహారం ఇవ్వాలని అడుగుతోందని అన్నారు కిషన్ రెడ్డి.

రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేపట్టడంలో జాప్యం చేస్తుండడంతో జాతీయ రహదారుల పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు కిషన్‌రెడ్డి. హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-బెంగళూరు మార్గాలను ఎక్స్‌ ప్రెస్‌ వేలుగా మార్చబోతున్నట్టు ప్రకటించారాయన. గతంలో ఎన్ ‌హెచ్ ‌లుగా పలు రహదారులను ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణను ఆలస్యం చేస్తోందని విమర్శించారు.

ప్రస్తుతం ప్రకటించిన రహదారుల పనులు పూర్తయితే తప్ప కొత్తవి ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు కిషన్ రెడ్డి. పనులు పూర్తయిన యాదగిరిగుట్ట-వరంగల్‌, హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్, మెదక్‌ రహదారులతోపాటు మొత్తం ఆరు జాతీయ రహదారులను ఈ నెల 21న కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభిస్తారని చెప్పారు. నూతనంగా కంది-రాంసాన్‌ పల్లి, సూర్యాపేట-ఖమ్మం సహా రూ.7,745 కోట్ల అంచనా వ్యయంతో 397 కి.మీ. పొడవున నిర్మించే 8 ఎన్ ‌హెచ్ ‌ల పనులకు గడ్కరీ భూమి పూజ చేస్తారని వివరించారు. భూ సేకరణలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాస్తానని అన్నారు కిషన్ రెడ్డి. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నిధుల కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ పనులు వేగవంతం చేశామని చెప్పారు. రహదారుల నిర్మాణం కోసం జరిగే భూ సేకరణను కేసీఆర్ ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని ఆరోపించారు కిషన్ రెడ్డి. మెట్రో విస్తరణపై కూడా కేసీఆర్ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. పాత బస్తీలో ఫలక్ ‌నుమా వరకు మెట్రోను విస్తరించాల్సి ఉన్నా అఫ్జల్‌ గంజ్‌ వరకే పరిమితం చేసి అలైన్‌ మెంట్‌ మార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 


మహేష్ బాబు కి 104 డిగ్రీల జ్వరం అని తెలిసి కృష్ణవంశీ చేయించిన ఈ పని తెలిస్తే ..?

వరుస మల్టీస్టారర్ లో మెగా పవర్ స్టార్

దిల్ రాజు పార్టీ లో మెరిసిన టాలీవుడ్ ప్రముఖులు

అవేంజర్స్ దర్శకుల సినిమాలో ధనుష్!

కరెన్సీ నోట్లతో కరోనా.. అసలు నిజం ఇదీ..!

చీరాల వివాదం జగన్ కు తలనొప్పిగా మారింది...!

అమరావతి కోసం బాబు రాజీనామా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>