MoviesVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss41f1bf389-e319-4c9f-99c2-20d84eea9048-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss41f1bf389-e319-4c9f-99c2-20d84eea9048-415x250-IndiaHerald.jpgబిగ్‌బాస్‌ సీజన్‌-4 విజేత ఎవరన్నది తేలడానికి ఇంకా మూడు రోజులు మిగిలి ఉన్నాయి. విజేత ఎవరన్న ప్రశ్నబుల్లితెర ప్రేక్షకుల్లో అత్యంత ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌కు చెందినవారినే విజయం వరిస్తుందా లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది. బిగ్‌బాస్‌ షోలో ఈసారి 19 మంది పాల్గొనగా అందులో నలుగురు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందినవారే కావడంతో ఇది కాస్త కరీంనగర్‌ ’షో’గా మారింది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గంగవ్వ, ఆట, అభినయంతో అలరించిన అవినాష్‌, గ్రాండ్‌ ఫినాలేలో ప్రధాన పోటీదారులుగా ఉన్న సోహైల్‌, దేత్bigboss4;abinaya;jyothi;rani;vidya;rbi;district;huzur nagar;school;gold;job;winner;april;father;karimnagar;jagtial;peddapalliబిగ్‌బాస్‌ సీజన్‌-4 నలుగురు కరీంనగర్ వాళ్ళేబిగ్‌బాస్‌ సీజన్‌-4 నలుగురు కరీంనగర్ వాళ్ళేbigboss4;abinaya;jyothi;rani;vidya;rbi;district;huzur nagar;school;gold;job;winner;april;father;karimnagar;jagtial;peddapalliFri, 18 Dec 2020 07:58:17 GMTకరీంనగర్ వాళ్ళే  

బిగ్‌బాస్‌ సీజన్‌-4 విజేత ఎవరన్నది తేలడానికి ఇంకా మూడు రోజులు మిగిలి ఉన్నాయి.  విజేత ఎవరన్న ప్రశ్నబుల్లితెర  ప్రేక్షకుల్లో అత్యంత ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌కు చెందినవారినే విజయం వరిస్తుందా లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది. బిగ్‌బాస్‌ షోలో ఈసారి 19 మంది పాల్గొనగా అందులో నలుగురు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందినవారే కావడంతో ఇది కాస్త కరీంనగర్‌ ’షో’గా మారింది.  ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గంగవ్వ, ఆట, అభినయంతో అలరించిన అవినాష్‌, గ్రాండ్‌ ఫినాలేలో ప్రధాన పోటీదారులుగా ఉన్న సోహైల్‌, దేత్తడి హారిక ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందినవారే.  ప్రారంభంలో పెద్దగా ఆసక్తి చూపించనివారు సైతం ఈ నలుగురు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకే చెందినవారు అని తెలిసినప్పటి నుంచి బిగ్‌బాస్‌ షోను ఆసక్తికరంగా చూస్తున్నారు. ఆదివారం బిగ్‌బాస్‌ సీజన్‌-4 విజేత ఎవరన్నది తేలిపోనున్నది. ప్రస్తుతం ఫైనల్‌లో సోహైల్‌, హారిక, అరియనా, అభిజిత్‌, అఖిల్‌ ఉన్నారు. మిగిలిన ఐదుగురిలో ఉమ్మడి  జిల్లాకు చెందిన సోహైల్‌, హారిక ఉన్నారు. సయ్యద్‌ సోహైల్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని పెద్దపల్లి జిల్లా సెంటినరికాలనీకి చెందినవారు. ఇతని తండ్రి సయ్యద్‌ సలీం ఫహీం సింగరేణి ఆర్‌జీ-3 డివిజన్‌ పరిధిలోని ఓసీపీ-2లో ల్యాంప్‌రూం మజ్దూర్‌ కార్మికునిగా పనిచేస్తున్నాడు. అతని పెద్ద కుమారుడే సోహైల్‌. సోహైల్‌ 1991 ఏప్రిల్‌ 18న జన్మినించాడు.  ఇతను పాఠశాల విద్య కరీంనగర్‌లో, ఉన్నత విద్య హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. హైదరాబాద్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో మేనేజ్‌మెంట్‌ 
కోర్సు  చేసినా మొదటి నుంచి అతనికి, నటన, మోడలింగ్‌ మీద ఆసక్తి ఉండేది. కొత్త బంగారులోకం సినిమాతో అతను తన నట జీవితానికి శ్రీకారంచుట్టారు. ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌-4లో విజేత కావడానికి ప్రధాన పోటీదారుల్లో  నిలిచాడు. ఫైనల్‌ పోటీలో ఉన్న హారిక పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌కు చెందిన యువతి. సుల్తానాబాద్‌లో హారిక అమ్మమ్మ, తాతయ్య ఉండేవారు. తాతయ్య మోహన్‌రావు పంచాయతీరాజ్‌శాఖలో ఎల్‌డీసీగా ఉద్యోగంచేసి ఆ తర్వాత కరీంనగర్‌ జిల్లా పరిషత్‌లో సుల్తానాబాద్‌, పెద్దపల్లి కేంద్రాల్లో పనిచేసి డిప్యూటేషన్‌పై హైదరాబాద్‌కు వెళ్లి పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి వారు అక్కడే స్థిరపడ్డారు. హారిక తల్లి జ్యోతి హైదరాబాద్‌లో బ్యాంకులో పనిచేసేవారు. హారిక బీబీఏ పూర్తిచేసి అమెజాన్‌లో ఐటీ కన్సల్టెంట్‌గా పనిచేశారు.  ప్రస్తుతం ఆమె బిగ్‌బాస్‌ షోలో ఫైనల్లో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బిగ్‌బాస్‌ ప్రారంభమైన తొలిరోజుల్లో జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లెకు చెందిన మిల్కూరి గంగవ్వ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆరు పదుల వయసులో బిగ్‌బాస్‌లో సంచలనం సృష్టించారు. అప్పటికే యూట్యూబ్‌ షార్ట్‌ ఫిలింలో ఐకాన్‌గా నిలిచిన గంగవ్వ బిగ్‌బాస్‌ షోలో రాణించి సెలబ్రిటీగా మారారు. 70కి పైగా షార్ట్‌ ఫిల్మ్‌లలో నటించిన గంగవ్వ బిగ్‌బాస్‌-4లో కంటెస్టెంట్‌గా ఎంపికై అనారోగ్య కారణాలతో తనను షో నుంచి తప్పించాల్సిందిగా కోరి బయటకు వచ్చారు. అవినాష్‌ జబర్దస్త్‌ అవినాష్‌గా, ముక్కు అవినాష్‌గా అందరికీ చిరపరిచితులు. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం రాఘవపట్నానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో అవినాష్‌ జన్మించాడు. ఇతను 10వ తరగతి వరకు జగిత్యాలలో, ఇంటర్మీడియట్‌ కరీంనగర్‌లో చదివి, హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌, ఎంబీఏ పూర్తి చేశాడు. 2013లో కెవ్వుకేకతో మాటీవీలో ఎంట్రీ ఇచ్చి 2014 ఈటీవీలో తడాకా అనే ప్రోగ్రాం ద్వారా కమెడియన్‌, మిమిక్రీ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. జబర్దస్ట్‌ షోలో తన మిమిక్రీ, నటనతో ప్రేక్షకుల మన్ననలు పొంది బిగ్‌బిస్‌ సీజన్‌-4కు ఎంపికయ్యాడు. 14 వారాలపాటు ప్రేక్షకుల ఆదరణ పొంది చివరిలో అతడు ఎలిమినేటడ్‌ అయ్యారు. బిగ్‌బాస్‌లో ఈ సీజన్‌లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని నలుగురికి అవకాశం దక్కి అందులో ఇద్దరు ఫైనల్‌లో పోటీ వున్నారు. కళలకు నిలయమైన కరీంనగర్‌కే బిగ్‌బాస్‌ సీజన్‌-4 విజేత టైటిల్‌ దక్కుతుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.   


టర్కీ పై అమెరికా ఆంక్షలు.. భారత్ అనుమానాలు..?

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>