MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maheshbabu57dafda8-b7b7-451b-ad4f-ffe271b5f4c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maheshbabu57dafda8-b7b7-451b-ad4f-ffe271b5f4c0-415x250-IndiaHerald.jpg'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా ''సర్కారు వారి పాట''. ప్రముఖ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్‌ టైన్‌మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం కూడా తెలిసిందే.maheshbabu;mahesh;suresh;keerthi suresh;kirti;parasuram;ram pothineni;hyderabad;korcha;rbi;cinema;rajani kanth;huzur nagar;january;bank;blockbuster hit;director;february;posters;film nagar;mahanatiఆ విషయంలో మహేష్ బాబు లాస్ట్.. ప్రస్తుతం ఇదే టాక్!ఆ విషయంలో మహేష్ బాబు లాస్ట్.. ప్రస్తుతం ఇదే టాక్!maheshbabu;mahesh;suresh;keerthi suresh;kirti;parasuram;ram pothineni;hyderabad;korcha;rbi;cinema;rajani kanth;huzur nagar;january;bank;blockbuster hit;director;february;posters;film nagar;mahanatiFri, 18 Dec 2020 21:44:21 GMTబ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా ''సర్కారు వారి పాట''. ప్రముఖ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్‌ టైన్‌మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇందులో మహేష్ కి జోడీగా ‘మహానటి’ కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్ర బృందం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ ఈ సినిమాపై భారీ అంచనాలను కలిగిస్తోంది. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. దీనిపై ఫిలిం నగర్ వర్గాల్లో పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. కరోనా భయంతో ఇన్నాళ్లు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయలేదని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. దాదాపు అన్ని పెద్ద సినిమాలు షూటింగ్ స్టార్ట్ చేసేశాయి. మహేశ్ కి సరిసమానులైన హీరోలంతా ఇప్పుడు షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. కానీ మహేశ్ బాబు మాత్రం జనవరి, ఫిబ్రవరి అంటూ షూటింగ్ వాయిదా వేస్తూ వస్తున్నాడు.

'సర్కారు వారి పాట' ను వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ముందుగా విదేశాల్లో భారీ షెడ్యూల్ కి ప్లాన్ చేసుకున్నప్పటికీ కరోనా భయంతో ఆ షెడ్యూల్ ని వాయిదా వేసుకున్నారని, ఇప్పుడు హైదరాబాద్ లో చిత్రీకరణ ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోందని టాక్ వచ్చింది. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోవడానికి కారణం మహేశ్ అని, పక్కాగా స్క్రిప్ట్ రెడీగా ఉంటేనే షూటింగ్ ప్రారంభిద్దామని ఆయన భీష్మించుకొని కూర్చున్నారని తెలుస్తోంది. కథ పూర్తిగా రెడీగా లేకపోవడం వల్లనే షూటింగ్‌లో జాప్యం జరుగుతోందని అంటున్నారు. ఏదేమైనా సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్న స్టార్ హీరోల్లో మహేష్ లాస్ట్‌గా మిగిలిపోవడం వాస్తవం. కాగా, బ్యాంక్ స్కాములు, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని విదేశాలకు పారిపోతోన్న ఆర్థిక నేరగాళ్ల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని టాక్.


చిక్కుల్లో తృణమూల్ కాంగ్రెస్..!

రజినికాంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. 2018 కేసులో..

వైష్ణవ్ తేజ్ తేజ్ సినిమా OTT కే ఖాయం..?

సినీ ఇండస్ట్రీకి బ్లాక్ మార్క్ రాసిన ఇయర్ ?

కాంగ్రెస్ వైపు ఫుల్ ఫోకస్...రేపు ఏం జరగనుంది...?

నిమ్మగడ్డ, సుజనాకు రాజకీయాలే కావాలి: ఏపీ మంత్రి

సర్కార్ వారి పాటలు ఓరేంజ్ లో బాదేస్తాడట..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>