TVVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-season-4-telugu-updates4b12ee42-800a-4f6d-a550-a6e2fe5209bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-season-4-telugu-updates4b12ee42-800a-4f6d-a550-a6e2fe5209bd-415x250-IndiaHerald.jpg దేత్తడి హారిక ఫుల్ ఎమోషన్ అయింది. ఈ వీడియో చూశాక హారిక ఏమందంటే...రేపటి దినాన ఈ దునియా లో నేను ఉన్నా లేకున్నా బిగ్ బాస్ జర్నీ నాకు మధురమైన, అరుదైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. నేనంటే ఏంటో ప్రపంచానికి తెలియ చేసింది బిగ్ బాస్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నన్ను ఫలానా అంటూ గుర్తించగలరు... ఆ స్థాయికి నన్ను తీసుకు వచ్చింది బిగ్ బాస్ షో.. అంటూ ఎమోషనల్ అయింది హారిక..!bigg boss season 4 telugu updates;chiranjeevi;ntr;venkatesh;nani;nagarjuna akkineni;shiva;abhijith;akhil akkineni;jr ntr;madhura sridhar reddy;nageshwara rao akkineni;haryana - chandigarh;bigboss;sri venkateswara swamy;december;episode;lord siva;winner;shield;winner1;nandamuri taraka rama rao;dhoom;v;journeyబి బి 4: ఆ వీడియో చూసిన తర్వాత ఎమోషనల్ అయిన హారిక...!బి బి 4: ఆ వీడియో చూసిన తర్వాత ఎమోషనల్ అయిన హారిక...!bigg boss season 4 telugu updates;chiranjeevi;ntr;venkatesh;nani;nagarjuna akkineni;shiva;abhijith;akhil akkineni;jr ntr;madhura sridhar reddy;nageshwara rao akkineni;haryana - chandigarh;bigboss;sri venkateswara swamy;december;episode;lord siva;winner;shield;winner1;nandamuri taraka rama rao;dhoom;v;journeyFri, 18 Dec 2020 09:00:00 GMTబిగ్ బాస్ నాలుగో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇంకో నాలుగు రోజుల్లో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ గ్రాండ్ గా జరగనుంది. టాప్-5లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్ లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ ఫోర్ ట్రోఫీ గెలుచుకునే అదృష్టవంతులు నేనే కావాలంటూ ఎవరికి వారు ఆకాంక్షిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో అనగా డిసెంబర్ 20 ఈ ఆదివారం జరగబోయే బిగ్ బాస్ సీజన్ ఫోర్ గ్రాండ్ ఫినాలే లో బిబి4 విజేత ఎవరన్నది తేలిపోనుంది. కాగా గురువారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.... ఎప్పటిలాగే వేకప్ సాంగ్ తో సందడిగా మొదలైంది బిగ్ బాస్ షో.

ఈ సీజన్లో మొదటి నుండి ఇంటి సభ్యుల మధ్య జరిగిన మధుర జ్ఞాపకాలన్నింటినీ ఐదుగురు కంటెస్టెంట్స్ కు తెరపై చూపారు బిగ్ బాస్. దాంతో ఇంటి సభ్యుల కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి... వాళ్ల ఆనందానికి అవధులు లేవు... హారిక , అభిజిత్, హర్యానా, సోహైల్ మరియు అఖిల్ లు ఆ వీడియోలను చూసి తమ తమ అనుభూతులను పంచుకున్నారు. బిగ్ బాస్ షో లో తమకు ఛాన్స్ దొరకడం చాలా అదృష్టం అంటూ షో ని కొనియాడారు. దేత్తడి హారిక ఫుల్ ఎమోషన్ అయింది. ఈ వీడియో చూశాక హారిక ఏమందంటే...రేపటి దినాన ఈ దునియా లో నేను ఉన్నా లేకున్నా బిగ్ బాస్ జర్నీ నాకు మధురమైన, అరుదైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

నేనంటే ఏంటో ప్రపంచానికి తెలియ చేసింది బిగ్ బాస్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నన్ను ఫలానా అంటూ గుర్తించగలరు... ఆ స్థాయికి నన్ను తీసుకు వచ్చింది బిగ్ బాస్ షో.. అంటూ ఎమోషనల్ అయింది హారిక..!
ఇక గ్రాండ్ ఫినాలే ఎలా జరుగుతుందంటే...గ్రాండ్ ఫినాలే ధూమ్ దాం గా చేయడం కోసం ప్రణాళికలు రచిస్తోంది బిగ్ బాస్ యూనిట్. ఈ సీజన్ కు గెస్ట్ గా ఓ బిగ్ సెలబ్రిటీ ని ప్లాన్ చేస్తోంది బిగ్ బాస్ బృందం.జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్‌ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి ప్రత్యేకించి గెస్ట్ ఎవరు రాలేదు.. యంగ్ టైగర్ చేతుల మీదుగానే బిబి 1 విన్నర్ శివ బాలాజీ కి ట్రోఫీ అందించారు. ఇక  నాని హోస్ట్ చేసిన రెండో సీజన్‌కు మాత్రం విక్టరీ వెంకటేష్ వచ్చి కౌశల్‌కు షీల్డ్ బహూకరించారు. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన మూడో సీజన్‌కు మెగాస్టార్ చిరంజీవి విచ్చేసి విజేత రాహుల్‌కు ట్రోఫీ అందజేశారు.

 ఇక ఇప్పుడు నాలుగో సీజన్ గెస్ట్ ఎవరన్న అంశంపై ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం.. గత సీజన్ గ్రాండ్ ఫినాలేకు గెస్టుగా వచ్చి ప్రేక్షకులకు కనువిందు చేసిన మెగాస్టార్ చిరంజీవే.. ఈ సారి కూడా గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై మెరిసి అలరించినున్నట్లు సమాచారం.  ఇప్పటికే ఆయనతో బిగ్ బాస్ యూనిట్ సంప్రదింపులు జరిపి బాస్ ను ఒప్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఆచార్య' షూటింగ్‌తో బిజీగా ఉన్న చిరు.. ఆదివారం జరిగే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కోసం డేట్ ఇచ్చినట్లు సమాచారం.


అనుష్క షాక్ నుంచి ఆ ప్రొడ్యూసర్ త్వరగా తేరుకోగలడా

వారి విజయం కే‌సి‌ఆర్ కు నచ్చడంలేదట..ఎందుకో..??

రెఫరెండం అంటే ఏంటి..? చంద్రబాబే ఎందుకు గెలుస్తారు..?

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>