PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/intelligence on cabinet-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/intelligence on cabinet-415x250-IndiaHerald.jpgకేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. రైతు భరోసా 3 విడత అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ విడత 2 వేల రూపాయల ఆర్థిక సాయం అందుతుంది అని ఆయన అన్నారు. ఇప్పటికే ఈ ఏడాది 12 వేలు చెల్లించాం అని చెప్పారు. 54 లక్షల 47 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. డిసెంబర్ 29 తేదీన రైతుల ఖాతాలో 1009 కోట్లను జమ చేస్తాము అని వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ని ఒక్క మాసం లొనే చెల్లించేలా కొత్త విధానానికి కేబినెట్ ఆమోదం తెలcabinet, ap;education;nani;amala akkineni;rekha;aksha;anand malayalam actor;prakruti;tiru;andhra pradesh;tirupati;december;perni nani;cabinet;survey;minister;husband;central government;pulivendula;anand deverakondaబ్రేకింగ్: ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలుబ్రేకింగ్: ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలుcabinet, ap;education;nani;amala akkineni;rekha;aksha;anand malayalam actor;prakruti;tiru;andhra pradesh;tirupati;december;perni nani;cabinet;survey;minister;husband;central government;pulivendula;anand deverakondaFri, 18 Dec 2020 15:26:31 GMTకేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. రైతు భరోసా 3 విడత అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ విడత 2 వేల రూపాయల ఆర్థిక సాయం అందుతుంది అని ఆయన అన్నారు. ఇప్పటికే ఈ ఏడాది 12 వేలు చెల్లించాం అని చెప్పారు. 54 లక్షల 47 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. డిసెంబర్ 29 తేదీన రైతుల ఖాతాలో 1009 కోట్లను జమ చేస్తాము అని వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ని ఒక్క మాసం లొనే చెల్లించేలా కొత్త విధానానికి కేబినెట్ ఆమోదం  తెలిపింది అని ఆయన పేర్కొన్నారు.

8 లక్షల 6 వేల మంది రైతులు, 12 లక్షల ఎకరాల్లో నివర్ తుపాను కారణంగా పంట నష్టపోయారు అని ఆయన తెలిపారు. వీరికి 719 కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీ చెల్లింపు కు ఆమోదం తెలిపామని మంత్రి పేర్కొన్నారు. పశు సంవర్ధక శాఖ లో 147 ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపామని చెప్పారు. పులివెందుల లో ఏపీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రురల్ మేనేజ్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపామని ఆయన వెల్లడించారు. 83 కోట్లతో ఆనంద్ లోని ఇర్మా సంస్థ సహకారంతో ఏర్పాటు చేస్తామని అన్నారు.

ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటు కు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు చెప్పారు. 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం 16 వేల కోట్ల నిధుల సమీకరణ ఈ సంస్థ ద్వారా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే కు కేబినెట్ ఆమోదం తెలిపింది అని చెప్పారు. ల్యాండ్ సర్వే, బౌండరీ చట్టం లో 5 సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన అన్నారు. సబ్ డివిజన్ ప్రకారం మ్యాప్ తయారీ ఉంటుంది అన్నారు. అక్షంశాలు, రేఖా అంశాల ఆధారంగా భూ సర్వే చేస్తారని ఆయన వెల్లడించారు. 3 ఏళ్లలొ భూ సర్వే పూర్తి చేసి భుహక్కు పత్రాల జారీ, ల్యాండ్ రికార్డుల తయారీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది అన్నారు. తిరుపతి వద్ద 40 ఎకరాల్లో సర్వే అకాడెమీ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.


సినీ పరిశ్రమకు జగన్ గుడ్ న్యూస్ చెప్తారా...?

కైలాస దేశానికి ఫ్రీ ఛార్టెడ్ ఫ్లయిట్..

నేను రాజీనామా చేసేస్తా: గద్దె రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు

దూసుకొస్తున్న మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ప్రజలు అప్రమత్తంగా కండి..?

చిరంజీవితో నటించనన్న రాములమ్మ.. కారణం ఏంటంటే!

చిరంజీవి నటించిన ఆ సినిమా హాలీవుడ్ లో కాపీ కొట్టారా..?

సొంత పార్టీ కార్యకర్తల భూములనే కబ్జా చేసిన వైసీపీ నేత..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>