MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-b-gopal9ae66c18-8ba7-49e2-bfce-7cdca3ce645b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-b-gopal9ae66c18-8ba7-49e2-bfce-7cdca3ce645b-415x250-IndiaHerald.jpgనటసింహం నందమూరి బాలకృష్ణ, సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ ల కాంబినేషన్ లో చాలా వరకు మంచి హిట్ సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో బాగా సక్సెస్ సాధించి అటు గోపాల్ కు అలానే ఇటు బాలయ్యకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమాలు చెప్పాలంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాల గురించి చెప్పుకోవాలి. 1999లో వచ్చిన సమరసింహారెడ్డి సినిమా అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకుంది. అంజలా ఝవేరి, సిమ్రాన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకు మణిశర్మ అదిరిపోయే సాంగ్స్ అందించారు. balakrishna;b gopal;balakrishna;simran bagga;b gopal;boyapati srinu;kranthi;kranti;mani sharma;makar sakranti;cinema;sankranthi;cinema theater;nandamuri balakrishna;media;blockbuster hit;director;heroine;success;nandamuri taraka rama rao;house;samarasimhareddyఏంటీ ... బాలయ్య తో 'నరసింహనాయుడు - 2' తీయనున్నారా ..... ??ఏంటీ ... బాలయ్య తో 'నరసింహనాయుడు - 2' తీయనున్నారా ..... ??balakrishna;b gopal;balakrishna;simran bagga;b gopal;boyapati srinu;kranthi;kranti;mani sharma;makar sakranti;cinema;sankranthi;cinema theater;nandamuri balakrishna;media;blockbuster hit;director;heroine;success;nandamuri taraka rama rao;house;samarasimhareddyFri, 18 Dec 2020 05:00:00 GMTనందమూరి బాలకృష్ణ, సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ ల కాంబినేషన్ లో చాలా వరకు మంచి హిట్ సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో బాగా సక్సెస్ సాధించి అటు గోపాల్ కు అలానే ఇటు బాలయ్యకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమాలు చెప్పాలంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాల గురించి చెప్పుకోవాలి. 1999లో వచ్చిన సమరసింహారెడ్డి సినిమా అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకుంది. అంజలా ఝవేరి, సిమ్రాన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకు మణిశర్మ అదిరిపోయే సాంగ్స్ అందించారు.

ఇక ఆ తరువాత 2001 సంక్రాంతి కానుకగా బాలయ్య, బి గోపాల్ ల కలయికలో వచ్చిన సినిమా నరసింహనాయుడు. అప్పట్లో అతి పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా గుంటూరు లోని కృష్ణమహల్ థియేటర్ లో ఏకంగా 100 రోజులు ఆల్ షోస్ హౌస్ ఫుల్ సాధించి అతి పెద్ద సంచలన రికార్డు ని నమోదు చేసింది. నిజానికి ఈ రెండు సినిమాలని బాలయ్య ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎప్పటికీ మరిచిపోలేరు. ఇకపోతే ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్సకత్వంలో బాలయ్య ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ఇక దాని అనంతరం అతి త్వరలో బాలయ్య, బి గోపాల్ తో చాలా ఏళ్ళ గ్యాప్ అనంతరం మరొక్కసారి సినిమా చేయనున్నట్లు ఇప్పటికీ కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.

ఇక ఇటీవల ఒకానొక ఇంటర్వ్యూ లో భాగంగా దర్శకుడు గోపాల్ మాట్లాడుతూ, తన తదుపరి సినిమా బాలయ్యతో ప్లాన్ చేస్తున్నానని, అది తామిద్దరి క్రేజీ కాంబినేషన్ కి మరింత గొప్పగా పేరు తెచ్చేలా ఉంటుందని, అలానే దానికి సంబందించిన పూర్తి వివరాలు మరికొన్ని నెలల్లో బయటకు రానున్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి కాంబో సినిమా విషయమై లేటెస్ట్ గా అందుతున్న సమాచారాన్ని బట్టి ఇది గతంలో వచ్చిన నరసింహనాయుడు కి సీక్వెల్ గా తెరకెక్కనున్న సినిమా అని, ఇక ఇందులో బాలయ్య పాత్ర అత్యద్భుతంగా ఉంటుందని టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం మరొక్కసారి బాలయ్య, బి గోపాల్ ల కలయికలో మంచి బ్లాక్ బస్టర్ మూవీ ని చూడవచ్చన్నమాట .....!!


హెరాల్డ్ ఎడిటోరియల్ : ఇంతకాలమైనా వదలకుండా వెంటాడుతోందా ?

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>