MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/brahmaji-hungama-becomes-industry-hot-topic8e0cf588-c907-4847-8f03-feaa8fc6a870-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/brahmaji-hungama-becomes-industry-hot-topic8e0cf588-c907-4847-8f03-feaa8fc6a870-415x250-IndiaHerald.jpgవిలక్షణ నటుడు బ్రహ్మాజీ కి 55 సంవత్సరాలు. అయితే అంత వయస్సు ఉన్న వ్యక్తిగా అతడు కనిపించడు. అతడికి 45 సంవత్సరాలు అని చెప్పినా అందరు నమ్ముతారు. హీరోగా రాణించలేకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్టుగా బ్రహ్మాజీ అనేక సినిమాలలో నటిస్తున్నాడు.ఇలాంటి పరిస్థితులలో ఈ విలక్షణ నటుడు ప్రస్తుతం నటిస్తున్న ఒక మూవీ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం బ్రహ్మాజీ ‘హంగామా’ అనే మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ కథ అంతా అతడి చుట్టూ తిరుగుతూ ఒక రివెంజ్ డ్రామాగా ఈ మూవీ ఉంటుంది అని అంటున్నారు. brahmaji;chiranjeevi;rani;tara;tiru;cinema;industry;director;hero;fishఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన బ్రహ్మాజీ హంగామా !ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన బ్రహ్మాజీ హంగామా !brahmaji;chiranjeevi;rani;tara;tiru;cinema;industry;director;hero;fishFri, 18 Dec 2020 09:00:00 GMTవిలక్షణ నటుడు బ్రహ్మాజీ కి 55 సంవత్సరాలు. అయితే అంత వయస్సు ఉన్న వ్యక్తిగా అతడు కనిపించడు. అతడికి 45 సంవత్సరాలు అని చెప్పినా అందరు నమ్ముతారు. హీరోగా రాణించలేకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్టుగా బ్రహ్మాజీ అనేక సినిమాలలో నటిస్తున్నాడు.


ఇలాంటి పరిస్థితులలో ఈ విలక్షణ నటుడు ప్రస్తుతం నటిస్తున్న ఒక మూవీ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం బ్రహ్మాజీ ‘హంగామా’ అనే మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ కథ అంతా అతడి చుట్టూ తిరుగుతూ ఒక రివెంజ్ డ్రామాగా ఈ మూవీ ఉంటుంది అని అంటున్నారు.


యంగ్ డైరెక్టర్ విహాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఎటువంటి హడావిడి లేకుండా ఇప్పటికే ప్రారంభం అయి కొంతమేరకు షూటింగ్ జరుపుకోవడంతో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. యంగ్ హీరో సత్యదేవ్ ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తూ ఈ మూవీ ఒక విభిన్నమైన కథ అంటూ ఈ మూవీ పై అంచనాలు పెంచాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో బ్రహ్మాజీ తన కొడుకు సంజయ్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘ఓ పిట్ట కథ’ మూవీకి సంబంధించి అన్నీ తానై వ్యవహరించాడు.


మూవీ ప్రమోషన్ ను మెగా స్టార్ చిరంజీవి తో చేయించినా తెలుగు ప్రేక్షకులు అంతగా పట్టించుకోకపోవడంతో ఆ మూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారింది. దీనితో బ్రహ్మాజీ కలలు కరిగిపోయాయి. ఇక లాభం లేదనుకుని బ్రహ్మాజీ రంగంలోకి దిగి ఇప్పుడు తానే కీలక పాత్రలో నటిస్తున్న ‘హంగామా’ మూవీ మొదలు పెట్టాడు. ఈ మూవీలో ఇతడు ఒక వయసు మళ్ళిన పాత్రలో కనిపించ బోతున్నాడు. చేతిలో ఒక పెద్ద చేప ను పట్టుకుని నడుస్తున్న బ్రహ్మాజీ ఒకరకమైన రఫ్ గా కనిపిస్తున్నాడు. దీనితో ఈ మూవీలో బ్రహ్మాజీ పాత్ర ఏమిటి అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో అనేక ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి..




అనుష్క షాక్ నుంచి ఆ ప్రొడ్యూసర్ త్వరగా తేరుకోగలడా

వారి విజయం కే‌సి‌ఆర్ కు నచ్చడంలేదట..ఎందుకో..??

రెఫరెండం అంటే ఏంటి..? చంద్రబాబే ఎందుకు గెలుస్తారు..?

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>