PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rayalaseema-project25209567-325b-4b88-8064-cadad3cdf048-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rayalaseema-project25209567-325b-4b88-8064-cadad3cdf048-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర జలవనరుల శాఖ షాకిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన జగన్ సర్కార్ ఇచ్చిన డీపీఆర్ ను తిరిగి పంపించింది. ఇంత ఘోరంగా ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు డీపీఆర్ను ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదంటూ జలసంఘం మండిపడింది. డీపీఆర్ ఎలా ఇవ్వాలో కూడా మీ అధికారులకు తెలియదా? అంటూ ఏపీ సర్కార్ కేంద్ర జల సంఘం చివాట్లు పెట్టింది. rayalaseema project;vidya;krishna river;jagan;andhra pradesh;telangana;telugu;rayalaseema;aqua;letter;ranga reddy;srisailam;central government;nagariఏపీ సర్కార్ కు కేంద్రం చివాట్లు! ఇంత ఘోరమైన డీపీఆర్ ఎప్పుడూ చూడలే!ఏపీ సర్కార్ కు కేంద్రం చివాట్లు! ఇంత ఘోరమైన డీపీఆర్ ఎప్పుడూ చూడలే!rayalaseema project;vidya;krishna river;jagan;andhra pradesh;telangana;telugu;rayalaseema;aqua;letter;ranga reddy;srisailam;central government;nagariFri, 18 Dec 2020 07:57:28 GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర జలవనరుల శాఖ షాకిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన జగన్ సర్కార్ ఇచ్చిన  డీపీఆర్ ను తిరిగి పంపించింది. ఇంత ఘోరంగా ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు డీపీఆర్ను ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదంటూ జలసంఘం మండిపడింది. డీపీఆర్ ఎలా ఇవ్వాలో కూడా మీ అధికారులకు తెలియదా? అంటూ ఏపీ సర్కార్ కేంద్ర జల సంఘం చివాట్లు పెట్టింది. 46 పేజీల డీపీఆర్లో కనీస సమాచారాన్ని కూడా దాచి పెట్టారని, హైడ్రాలజీ, ఇంటర్ స్టేట్ అంశాలు, ఇరిగేషన్ ప్లానింగ్, డిజైన్లు, వ్యయ అంచనాలు లేవని అసహనం వ్యక్తం చేసింది. తెలియకపోతే సీడబ్ల్యూసీ వెబ్సైట్లో నమూనాలు ఉంటాయని, వాటి ప్రకారం అయినా ఇవ్వాలని సూచించింది. ఎలాంటి వివరాలు కూడా లేకుండా డీపీఆర్ ఎలా ఇచ్చారంటూ కేంద్ర జల సంఘం సభ్యుడు ముఖర్జీ గురువారం ఏపీ జల వనరుల శాఖకు లేఖ రాశారు.

              రాయలసీమ ఎత్తిపోతల ద్వారా సంగమేశ్వరం దగ్గర రోజుకు మూడు టీఎంసీను ఎత్తిపోసే ప్రాజెక్టుకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది.  దీనిపై తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేయడంతో
అపెక్స్ కౌన్సిల్లో చర్చ జరిగింది. కొత్త ప్రాజెక్టు కావడంతో డీపీఆర్లు ఇచ్చాకే పనులు ప్రారంభించాలని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం సోమవారం కృష్ణా బోర్డుకు డీపీఆర్ పంపించింది. ఇందులో చాలా మేరకు తప్పులు ఉండటం, వివరాలు లేకపోవడంతో బోర్డు దాన్ని సీడబ్ల్యూసీకి పంపించింది. చాలా వివరాలను దాచి పెట్టాల్సి రావడంతో కేంద్రానికి పంపిన డీపీఆర్లో తప్పులు వచ్చాయని చెబుతున్నారు.

              ఏపీ ప్రభుత్వం డీపీఆర్ లో తెలంగాణను తప్పు పట్టింది. విభజన చట్టాన్ని తుంగలో తొక్కి కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తీసుకోకుండానే తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఆరోపించింది. శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించేలా 2015లోనే పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టిందని పేర్కొంది. సాగర్‌లో సరిపడా నీటి నిల్వలు ఉన్నప్పటికీ, దిగువన సాగునీటి అవసరాలు లేకపోయినా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 796 అడుగుల నుంచే రోజుకు నాలుగు టీఎంసీలను తరలిస్తోందని, మొత్తంగా ఏడు టీఎంసీలను తరలిస్తుండటంతో ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోతోందని వివరించింది. తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌కు కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు ఉన్నా శ్రీశైలంలో నీటిమట్టం తగ్గిపోవడంతో దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు, చెన్నైలకు తాగునీటిని కూడా సరఫరా చేయలేని దుస్థితి నెలకొంటుందని డీపీఆర్లో ఏపీ సర్కార్ పేర్కొంది. 


టర్కీ పై అమెరికా ఆంక్షలు.. భారత్ అనుమానాలు..?

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>