MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-shetty29adc9a7-0e93-4b20-a5bc-a0692df23560-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-shetty29adc9a7-0e93-4b20-a5bc-a0692df23560-415x250-IndiaHerald.jpgప్రముఖ రైటర్ కోన వెంకట్ ప్రొడ్యూసర్ గా అవతారమెత్తారు గానీ రైటర్ గా అందుకున్నంత సక్సెస్ ప్రొడ్యూసర్ గా అందుకోవడం లేదనే చెప్పుకోవాలి. స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదగలేకపోయాడు. రీసెంట్ గా కూడా "నిశబ్దం" సినిమాతో చేతులు కాల్చుకోవడం జరిగిందని అంటున్నారు ఫిలిం నగర్లో. కరోనా పాండెమిక్ వలన థియేటర్లు మూతపడటంతో "అనుష్క" ప్రధాన పాత్రలో నటించిన "నిశబ్దం" ఓటీటీలో విడుదలవడం జరిగింది. మిశ్రమ స్పందన తెచ్చుకుంది ఈ సినిమా.anushka shetty;anoushka;kona venkat;neha shetty;sandeep;sundeep kishan;venkat;venkat producer;cinema;producer;producer1;letter;heroine;success;mehbooba;kathanamఅనుష్క షాక్ నుంచి ఆ ప్రొడ్యూసర్ త్వరగా తేరుకోగలడాఅనుష్క షాక్ నుంచి ఆ ప్రొడ్యూసర్ త్వరగా తేరుకోగలడాanushka shetty;anoushka;kona venkat;neha shetty;sandeep;sundeep kishan;venkat;venkat producer;cinema;producer;producer1;letter;heroine;success;mehbooba;kathanamFri, 18 Dec 2020 09:00:00 GMTఇండస్ట్రీలో కేవలం ఒకే విభాగానికి పరిమితం కాకుండా చాలా మంది ఇతర విభాగాలపై కూడా దృష్టిపెట్టడం జరుగుతుంది. కొంతమందికి అదృష్టవశాత్తు ఆశించిన ఫలితం దక్కుతుంది. అన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయి. మరికొందరికి మాత్రం ఫలితం బెడిసి కొడుతోంది. 


ప్రముఖ రైటర్ కోన వెంకట్ ప్రొడ్యూసర్ గా అవతారమెత్తారు గానీ రైటర్ గా అందుకున్నంత సక్సెస్ ప్రొడ్యూసర్ గా అందుకోవడం లేదనే చెప్పుకోవాలి. స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదగలేకపోయాడు. రీసెంట్ గా కూడా "నిశబ్దం" సినిమాతో చేతులు కాల్చుకోవడం జరిగిందని అంటున్నారు ఫిలిం నగర్లో. కరోనా పాండెమిక్ వలన థియేటర్లు మూతపడటంతో "అనుష్క" ప్రధాన పాత్రలో నటించిన "నిశబ్దం" ఓటీటీలో విడుదలవడం జరిగింది. మిశ్రమ స్పందన తెచ్చుకుంది ఈ సినిమా.


అనుష్క క్రేజ్ తో ఈ సినిమా భారీ విజయం నమోదు చేస్తుందని కోన పెట్టుకున్న ఆశలు గాల్లో కలిసిపోయాయి.  ఒకవేళ ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి ఉంటే మంచి ఫలితం లభించేదేమో. కానీ, పరిస్థితుల ప్రభావంతో ఈ సినిమా రిలీజ్ ఓటీటీకే పరిమితమవ్వాల్సి వచ్చింది. 


మొత్తానికి అనుష్క క్రేజ్ కూడా కాపాడలేకపోవడంతో కోన వెంకట్ మరో సినిమా నిర్మాణంపై దృష్టిపెట్టాడు. ఆ సినిమా పేరు "రౌడీ బేబీ". ఇందులో "వేంకటాద్రి ఎక్స్ప్రెస్" ఫేమ్ సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. "మెహబూబా" ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను జి. నాగేశ్వరరెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. "రౌడీబేబీ" గనక ప్రేక్షకులను ఆకట్టుకుంటే కోన వెంకట్ కు ప్రొడ్యూసర్ గా మంచి బ్రేక్ లభిస్తుందని ఇండస్ట్రీలో టాక్. 


స్టార్ స్టేటస్ ను నమ్ముకోకుండా కేవలం కథ కథనంపై దృష్టిపెడితే సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుందన్న విషయం కూడా ప్రూవ్ అవుతుంది మరోసారి. సందీప్ కిషన్ కు కూడా ఈ సమయంలో హిట్టవసరం. "రౌడీబేబీ" వీళ్ళిద్దరికీ కలిసి వస్తుందో లేదో చూడాలి మరి. 




వారి విజయం కే‌సి‌ఆర్ కు నచ్చడంలేదట..ఎందుకో..??

రెఫరెండం అంటే ఏంటి..? చంద్రబాబే ఎందుకు గెలుస్తారు..?

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>