Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/avengerse1114829-e696-472c-a47c-eff548d5133a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/avengerse1114829-e696-472c-a47c-eff548d5133a-415x250-IndiaHerald.jpgదక్షిణ భారత హీరోల్లో ధనుష్ కు ఉన్న క్రేజ్ వేరు. రజినీ కాంత్ అల్లుడిగా కంటే సొంతంగా తనకంటూ ఓ గుర్తింపు సాధించుకున్నాడు ధనుష్. అంతే కాదు ధనుష్ ఇప్పుడు మరో అద్భుత అవకాశాన్ని కొట్టేశాడు. హాలీవుడ్ సినిమాలో నయించే అవకాశాన్ని..avengers;dhanush;rajani;cinema;rajani kanth;tamil;hollywood;chris morris;net flix;journey;chitramఅవేంజర్స్ దర్శకుల సినిమాలో ధనుష్!అవేంజర్స్ దర్శకుల సినిమాలో ధనుష్!avengers;dhanush;rajani;cinema;rajani kanth;tamil;hollywood;chris morris;net flix;journey;chitramFri, 18 Dec 2020 11:29:00 GMTధనుష్ కు ఉన్న క్రేజ్ వేరు. రజినీ కాంత్ అల్లుడిగా కంటే సొంతంగా తనకంటూ ఓ గుర్తింపు సాధించుకున్నాడు ధనుష్. అంతే కాదు ధనుష్ ఇప్పుడు మరో అద్భుత అవకాశాన్ని కొట్టేశాడు. హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అది కూడా అలాంటి ఇలాంటి సినిమా కాదు అవేంజర్స్ దర్శకులు తెరకెక్కించబోతున్న సినిమాలో.

హాలీవుడ్ లో అవేంజర్స్ సినిమాల తరువాత రుస్సో బ్రదర్స్ పెరు మారు మోగి పోతోంది. వారు ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ఓ సినిమా తీయబోతున్నారు. 'ది గ్రే మ్యాన్' పేరుతో దీనిని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో ధనుష్ ను కూడా ఓ కీలక పాత్రలో నటించాలని కోరారట.

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రుస్సో బ్రదర్స్ దర్శకత్వంలో నటించేందుకు హాలీవుడ్ స్టార్స్ కూడా క్యూ కడుతుంటారు. అలాంటిది ఇప్పుడు మన ధనుష్ ను వెతుక్కుంటూ వారే వచ్చారు.

ది గ్రే మ్యాన్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేసేందుకు దర్శక నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్స్ క్రిస్ ఏవన్స్, ర్యాన్ గోస్లింగ్ వంటి వారు నటిస్తున్నారు. ఈ చిత్రంలో ధనుష్ పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉంటుందని తెలుస్తోంది. ధనుష్ మొత్తంగా 45 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం.

ధనుష్ ప్రస్తుతం తమిళంలో 2, 3 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో హాలీవుడ్ ఆఫర్ రావడంతో ధనుష్ మొదట కొద్దిగా ఆలోచనలో పడ్డాడట. అయితే చివరకు తన సినిమాల డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మరీ హాలీవుడ్ సినిమాకు ఓకే చెప్పారట. మరి హాలీవుడ్ ఆఫర్ అంటే మాటలా.

ఇదిలా ఉంటే గతంలో కూడా ధనుష్ హాలీవుడ్ సినిమా అయినా 'దీ ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ దీ ఫకీర్' అనే హాలీవుడ్ సినిమాలో నటించారు. ఇక ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను ఏ మాత్రం అలరిస్తారో వేచి చూడాలి.




వరుస మల్టీస్టారర్ లో మెగా పవర్ స్టార్

దిల్ రాజు పార్టీ లో మెరిసిన టాలీవుడ్ ప్రముఖులు

కరెన్సీ నోట్లతో కరోనా.. అసలు నిజం ఇదీ..!

చీరాల వివాదం జగన్ కు తలనొప్పిగా మారింది...!

అమరావతి కోసం బాబు రాజీనామా ?

3 పెళ్లిళ్లు, 4 ప్రేమలు, 5 వ సారి మల్లి ప్రేమలో పడ్డ హీరోయిన్ వనిత..?

వారి విజయం కే‌సి‌ఆర్ కు నచ్చడంలేదట..ఎందుకో..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>