MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/kagasorefysy-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/kagasorefysy-415x250-IndiaHerald.jpgనిన్నమొన్నటి వరకు తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా సాగాయి. గ్రేటర్ ఎన్నికలు ముగియడంతో కాస్త వాతావరణం చల్లబడింది అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది విమర్శలు ప్రతి విమర్శలతో అధికార ప్రతిపక్షాలు అలాగే కొత్తగా పార్టీ పెట్టిన కమల్ హాసన్ కూడా బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఈ క్రమంలో లో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కమల్ హాసన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ రియాల్టీ షోకి హోస్ట్ గా ఉండి కమల్ హాసన్ రాజకీయాల్లోకి ఎలా వస్తారు అంటూ ఆయన telangana;kamal hassan;tiru;telangana;bigboss;rajani kanth;tamil;chief minister;assembly;partyకమల్ హాసన్ కుటుంబాలను నాశనం చేస్తున్నాడు..సీఎం సంచలన వ్యాఖ్యలుకమల్ హాసన్ కుటుంబాలను నాశనం చేస్తున్నాడు..సీఎం సంచలన వ్యాఖ్యలుtelangana;kamal hassan;tiru;telangana;bigboss;rajani kanth;tamil;chief minister;assembly;partyFri, 18 Dec 2020 13:00:00 GMTనిన్నమొన్నటి వరకు తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా సాగాయి. గ్రేటర్ ఎన్నికలు ముగియడంతో కాస్త వాతావరణం చల్లబడింది అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది విమర్శలు ప్రతి విమర్శలతో అధికార ప్రతిపక్షాలు అలాగే కొత్తగా పార్టీ పెట్టిన కమల్ హాసన్ కూడా బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఈ క్రమంలో లో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కమల్ హాసన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ రియాల్టీ షోకి హోస్ట్ గా ఉండి కమల్ హాసన్ రాజకీయాల్లోకి ఎలా వస్తారు అంటూ ఆయన ప్రశ్నించారు. 


నిన్న తిరుచ్చిలో జరిగిన ఒక బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ 70 ఏళ్ళ వయసులో ఉన్న వ్యక్తి బిగ్ బాస్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు అని అలాంటి వ్యక్తి రాజకీయాలకు ఎలా వస్తారు అని ఆయన ప్రశ్నించారు. ఆయన హోస్ట్ చేస్తున్న ఆ చండాలపు షో వల్ల అనేక మంచి కుటుంబాలు నాశనం అయ్యాయనీ, ఆ షో పిల్లలు చూస్తే చెడిపోతారని మంచిగా ఉన్న కుటుంబాలు కూడా నాశనం అవుతాయని ఆయన ఆరోపణలు చేశారు.


 అయితే ప్రస్తుతం పళనిస్వామి నేతృత్వంలో నడుస్తున్న తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన ఎంజీఆర్ గురించి కమలహాసన్ కొన్ని కామెంట్స్ చేశారని దానికి కౌంటర్ గా నీ ముఖ్యమంత్రి ఇంతగా విమర్శలు గుప్పించారనీ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఫోర్ హోస్ట్ గా ఉన్న కమల్ హాసన్ రాజకీయాల్లో కూడా బిజీ అయ్యారు మక్కల్ నీది మయ్యం పేరుతో పార్టీ స్థాపించిన ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇప్పటికే మధురై నుంచి ప్రచారం కూడా ప్రారంభించారు. ఇక రాజకీయాల్లోకి వస్తానంటూ రజినీకాంత్ చేసిన ప్రకటన కూడా తమిళ రాజకీయాల్లో సంచలనం గా మారింది. ఆయన ఎప్పుడూ తెరంగ్రేటం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.




చిరంజీవి నటించిన ఆ సినిమా హాలీవుడ్ లో కాపీ కొట్టారా..?

సొంత పార్టీ కార్యకర్తల భూములనే కబ్జా చేసిన వైసీపీ నేత..

మన స్టార్ హీరోస్ ఎంత మంది ముసలి పాత్రలు చేసారో తెలుసా..?

వరుస మల్టీస్టారర్ లో మెగా పవర్ స్టార్

దిల్ రాజు పార్టీ లో మెరిసిన టాలీవుడ్ ప్రముఖులు

అవేంజర్స్ దర్శకుల సినిమాలో ధనుష్!

కరెన్సీ నోట్లతో కరోనా.. అసలు నిజం ఇదీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>