MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rajinikanths-son-in-law-in-the-role-of-a-playera0b20d37-adc0-45f5-9d40-702690761027-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rajinikanths-son-in-law-in-the-role-of-a-playera0b20d37-adc0-45f5-9d40-702690761027-415x250-IndiaHerald.jpgథియేటర్లు స్టేడియమ్స్‌గా మారిపోతున్నాయి. హైదరాబాద్‌ నుంచి మొదలుపెడితే ముంబయి వరకు సినిమా హాళ్లన్నింటిని ప్లే గ్రౌండ్స్‌గా మార్చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అంతర్జాతీయ వేదికల్లో భారత జెండాని రెపరెపలాడించిన క్రీడాకారుల కథాంశాలని తెరకెక్కిస్తున్నారు. వెండితెరపై బంగారు పతకాలు సాధించాలనుకుంటున్నారు. rajinikanths son in law in the role of a player;anand malayalam actor;dhanush;mumbai;pullela gopichand;bollywood;saina nehwal;cinema;rajani kanth;director;international;indian;anand deverakondaక్రీడాకారుని పాత్రలో రజినీకాంత్ అల్లుడు..!క్రీడాకారుని పాత్రలో రజినీకాంత్ అల్లుడు..!rajinikanths son in law in the role of a player;anand malayalam actor;dhanush;mumbai;pullela gopichand;bollywood;saina nehwal;cinema;rajani kanth;director;international;indian;anand deverakondaThu, 17 Dec 2020 23:15:00 GMTముంబయి వరకు సినిమా హాళ్లన్నింటిని ప్లే గ్రౌండ్స్‌గా మార్చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అంతర్జాతీయ వేదికల్లో భారత జెండాని రెపరెపలాడించిన క్రీడాకారుల కథాంశాలని తెరకెక్కిస్తున్నారు. వెండితెరపై బంగారు పతకాలు సాధించాలనుకుంటున్నారు.  

ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఇప్పుడు ఆటగాళ్ల బయోపిక్స్‌ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే సైనా నెహ్వాల్, పీవీ సింధు బయోపిక్స్‌ని ప్లాన్‌ చేస్తే ఇప్పుడు చెస్ చాంపియన్ విశ్వనాథ్ ఆనంద్‌ కథని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్‌ ఎల్.రాయ్ దర్శకత్వంలో విశ్వనాథ్‌ సినిమా రాబోతోంది. ఈ మూవీలో ధనుష్‌ లీడ్‌ రోల్‌ ప్లే చేస్తాడని సమాచారం.

ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ కోచ్ పుల్లెల గోపీచంద్‌ లైఫ్ హిస్టరీ కూడా సినిమాగా రాబోతోంది. పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌గా రాబోతోన్న ఈ సినిమాలో సుధీర్‌ బాబు, బ్యాడ్మింటన్‌ కోచ్‌గా నటించబోతున్నాడు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఈ బయోపిక్‌ తెరకెక్కుతోంది.

ఆల్రెడీ కపిల్‌ దేవ్ కథతో '83' అనే సినిమా వస్తోంది. ఇండియన్ క్రికెట్‌ టీమ్ మొదటిసారి వరల్డ్‌ కప్‌ నెగ్గిన విన్నింగ్‌ మూమెంట్స్‌తో ఈ సినిమాని డిజైన్ చేశారు. రణ్‌వీర్‌ సింగ్‌ కపిల్‌ దేవ్‌ క్యారెక్టర్ ప్లే చేశాడు. ఈ సినిమా 2020లోనే రిలీజ్‌ కావాల్సింది. కానీ కరోనా లాక్‌డౌన్‌తో ఈ సినిమా వాయిదా పడింది.

దక్షిణాదిన రజినీకాంత్ కు ఉండే ఫాలోయింగ్ ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పేరు ఎత్తితే చాలు ఆయన అభిమానులు పూనకం వచ్చిన వారిలా ప్రవర్తిస్తారు. తలైవా కోసం ఏం చేయమన్నా చేసేస్తారు. అయితే రజినీ అల్లుడు మాత్రం తన మామ పేరుతో కాకుండా తన సొంత టాలెంట్ తో పైకి వచ్చేశాడు. రజినీకాంత్ అల్లుడిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక పేరును సంపాదించుకున్నాడు. అయితే ఇపుడు రజినీకాంత్ అల్లుడు ధనుష్ ప్రముఖ క్రీడాకారుడి బయోపిక్ లో నటిస్తున్నాడట. మరి చెస్ క్రీడాకారుడు విశ్వనాథ్ ఆనంద్ పాత్రలో ధనుష్ ఎలా యాక్ట్ చేయబోతున్నాడనే ఉత్కంఠ సినీజనాల్లో నెలకొంది.










చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?

వాళ్ళు ఒప్పుకుంటే.. నేను రాజీనామా చేస్తా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>