PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/the-curse-of-durgamma-for-chandrababu59690b89-93d3-454f-a9ce-32eeebe4adee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/the-curse-of-durgamma-for-chandrababu59690b89-93d3-454f-a9ce-32eeebe4adee-415x250-IndiaHerald.jpgఅమరావతి జనభేరి సభలో పాల్గొనేందుకు వెళ్తూ చంద్రబాబు దుర్గ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అయితే దుర్గమ్మ ఆలయంలో చంద్రబాబు పూజలు చేసినా ఆయనకు శాప విమోచనం కలగదని, దుర్గమ్మ శాపంతోనే టీడీపీ గతేడాది జరిగిన ఎన్నికల్లో దారుణ పరాజయానికి గురైందని అన్నారు మంత్రి కొడాలి నాని. అసలు చంద్రబాబుకి దుర్గమ్మ శాపం ఎందుకు తగిలింది. కొడాలి చెప్పిన వివరణ ఏంటి? chandra babu;cbn;ntr;nani;deva;kodali nani;amaravati;media;kuppam;perni nani;minister;fire;aqua;tdp;butter;nandamuri taraka rama rao;partyచంద్రబాబుకి దుర్గమ్మ శాపం.. అసలు కథ ఏంటంటే..?చంద్రబాబుకి దుర్గమ్మ శాపం.. అసలు కథ ఏంటంటే..?chandra babu;cbn;ntr;nani;deva;kodali nani;amaravati;media;kuppam;perni nani;minister;fire;aqua;tdp;butter;nandamuri taraka rama rao;partyThu, 17 Dec 2020 20:17:04 GMTఅమరావతి జనభేరి సభలో పాల్గొనేందుకు వెళ్తూ చంద్రబాబు దుర్గ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అయితే దుర్గమ్మ ఆలయంలో చంద్రబాబు పూజలు చేసినా ఆయనకు శాప విమోచనం కలగదని, దుర్గమ్మ శాపంతోనే టీడీపీ గతేడాది జరిగిన ఎన్నికల్లో దారుణ పరాజయానికి గురైందని అన్నారు మంత్రి కొడాలి నాని. అసలు చంద్రబాబుకి దుర్గమ్మ శాపం ఎందుకు తగిలింది. కొడాలి చెప్పిన వివరణ ఏంటి?

14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు బెజవాడ దుర్గమ్మకు ఎప్పుడూ పట్టు వస్త్రాలు సమర్పించలేదని అన్నారు మంత్రి కొడాలి నాని. పట్టు వస్త్రాలు సమర్పించకపోగా, చంద్రబాబు ఇంద్రకీలాద్రిపై క్షుద్రపూజలు చేయించారని, అందుకే బాబుకి, ఆయన పార్టీకి దుర్గమ్మ శాపం తగిలిందని అన్నారు. దుర్గమ్మ శాపంతోనే చంద్రబాబు 23 సీట్లకు పరిమితమయ్యారని అన్నారు. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోడానికి కూడా కారణం అదేనని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుని ప్రజలు ఓడిస్తారని జోస్యం చెప్పారు. "చంద్రబాబుకు సిగ్గు, శరం లేదు. హెరిటేజ్‌ కోసం సహకార వ్యవస్థను నాశనం చేశారు. హెరిటేజ్‌కు అన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?. చంద్రబాబు పందికొక్కులా గ్రామీణ పేద మహిళల డబ్బులు దోచేశార"ని అన్నారు మంత్రి నాని.

దుర్గమ్మ చల్లగా చూసింది కాబట్టే.. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యారని, అమరావతి పేరుతో గ్రాఫిక్స్‌ చూపించి రైతులను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబుది ఫేక్‌ జాతీయ పార్టీ అని, ఆయన ఫేక్‌ జాతీయ అధ్యక్షుడని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌లో ఓడిపోయి ఎన్టీఆర్ కాళ్ల దగ్గర చేరి ఆయనకే వెన్నుపోటు పొడిచారని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నాని.

కొడాలి నానితో పాటు మంత్రి పేర్ని నాని కూడా మీడియా సమావేశంలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. దేవుళ్లతో నాటకాలు ఆడితే తగిన శాస్తి జరుగుతుందని అన్నారు. ఎవరైనా భూదేవితో నాటకాలు ఆడితే మట్టిగొట్టుకు పోతారని, తాము పేదలకు సాయం చేస్తుంటే.. అడ్డుకునేవారు రైతులెలా అవుతారని పేర్ని నాని ప్రశ్నించారు. పేదలకు సాయం చేస్తుంటే అడ్డుపడుతోంది చంద్రబాబు చౌదరేనంటూ విమర్శించారు. చంద్రబాబుపై ఉన్న అన్ని స్టేలు ఎత్తివేసే రోజు త్వరలోనే వస్తుందని అన్నారు పేర్ని నాని.


రెబెల్ నేతలతో సమావేశం కానున్న సోనియా

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?

వాళ్ళు ఒప్పుకుంటే.. నేను రాజీనామా చేస్తా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>