GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates3fee8515-1f41-4ac2-badb-5115f9ebc5e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates3fee8515-1f41-4ac2-badb-5115f9ebc5e8-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు బంగారం కొనాలని భావించిన పసిడి ప్రియులకు ఇప్పుడు ధరలు షాక్ ఇస్తున్నాయి. గత మూడు రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వస్తున్న ధరలు ఈరోజు ఇంకాస్త పైకి కదిలాయి. కొనుగోలు దారులకు ఇది చేదువార్తే అని చెప్పాలి. ఈరోజు భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడమే ఇందుకు కారణం అంటున్నారు. కరోనా ప్రభావం కూడా బంగారం ధరల పై ఉన్నది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అదే విధంగా కొనుగోళ్లు కూడా ఒకేసారి పడిపోయాయి.. gold rates;hyderabad;gold;vegetable market;silver;international;paruguపరుగులు పెడుతున్న పసిడి ధరలు.. వామ్మో ఒకేసారి అంతనా..!!పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. వామ్మో ఒకేసారి అంతనా..!!gold rates;hyderabad;gold;vegetable market;silver;international;paruguThu, 17 Dec 2020 14:00:00 GMTపసిడి ప్రియులకు ఇప్పుడు ధరలు షాక్ ఇస్తున్నాయి. గత మూడు రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వస్తున్న ధరలు ఈరోజు ఇంకాస్త పైకి కదిలాయి. కొనుగోలు దారులకు ఇది చేదువార్తే అని చెప్పాలి. ఈరోజు భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడమే ఇందుకు కారణం అంటున్నారు. కరోనా ప్రభావం కూడా బంగారం ధరల పై ఉన్నది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అదే విధంగా కొనుగోళ్లు కూడా ఒకేసారి పడిపోయాయి..



ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి రూ.46,200కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 పెరిగి రూ.50,400కి చేరింది. ఇక నిన్నటి రోజున భారీగా పెరిగిన వెండి ధరలు ఈరోజు కూడా పెరిగాయి. ఇక ఈరోజు కూడా అదే విధంగా వెండి ధరలు పైకి కదిలాయి. ఏకంగా కిలో వెండి ధర రూ.1000 పెరిగింది. దీంతో కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో 68,900కి చేరింది.



వెండి తో తయారు చేసే వస్తువుల పై డిమాండ్ పెరగడంతో ఈరోజు భారీగా పెరిగింది. ఇక పోతే బంగారం, వెండి వస్తువుల వినియోగం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ వెండి, బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ రోజు ధరలను చూస్తే..కూడా బంగారం ధర జిగేల్ మంది. బంగారం ధర ఔన్స్‌కు 0.23 శాతం పెరుగుదలతో 1845 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.32 శాతం పెరుగుదలతో 24.21 డాలర్లకు చేరింది.. వీటి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు..




సోషల్ మీడియాలో జగన్ కి షాకిచ్చి ఒపీనియన్ పోల్ పెట్టిన నారా లోకేష్....

"జనభేరి" సభకు భయపడుతున్న "జగన్ సర్కార్'.. !!

అనుపమ వెంట 8 మిలియన్ ఫాలోవర్స్.. అమ్మడు ఏం చేసిందో తెలుసా..?

టి కాంగ్రెస్ రాజకీయం: రేవంత్ రెడ్డి మరో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానున్నాడా...?

తెలంగాణ పై బీజేపీ ఫోకస్

120 దేశాలు.. మూడు భాషలు.. మొదటి టెస్ట్ అరుదైన రికార్డ్..?

జనాలను భయపెడుతున్న ఆటోలు.. అసలు కారణం ఇదే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>