MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/anr-and-sumanth1a1f6fa0-a438-4081-985e-dece3e95c133-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/anr-and-sumanth1a1f6fa0-a438-4081-985e-dece3e95c133-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అక్కినేని ఫ్యామిలీ నుంచి ఏఎన్నార్ తర్వాత ఇప్పటికే పలువురు హీరోలు వెండి తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే.వారిలో ఇప్పుడు నాగ చైతన్య ఒక్కడే అగ్ర హీరోగా రాణిస్తున్నాడు. మిగతా వాళ్లు అగ్ర హీరో స్థానం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటె అక్కినేని ఫ్యామిలీ నుంచి అప్పట్లో వెండి తెరకు పరిచయం అయ్యాడు సుమంత్. కెరీర్లో కొన్ని హిట్ సినిమాల్లో నటించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ ఎక్కువ కాలం ఆ క్రేజ్‌ని కాపాడుకోలేకపోయారు. అక్కినేని నాగేశ్వరరావుకు సుమంత్ అంటే ఎంతో ప్రేమanr and sumanth;naga chaitanya;annapurna;naga;nageshwara rao akkineni;prema;ramu;suma;suma kanakala;sumanth;cinema;naga aswin;love;wife;hero;silver;father;akkineni nageswara rao;chaitanya 1;chitramసుమంత్ ని ఏఎన్నార్ గారు అసలు ఎందుకు దత్తత తీసుకున్నారో తెలుసా..??సుమంత్ ని ఏఎన్నార్ గారు అసలు ఎందుకు దత్తత తీసుకున్నారో తెలుసా..??anr and sumanth;naga chaitanya;annapurna;naga;nageshwara rao akkineni;prema;ramu;suma;suma kanakala;sumanth;cinema;naga aswin;love;wife;hero;silver;father;akkineni nageswara rao;chaitanya 1;chitramThu, 17 Dec 2020 21:30:00 GMTఅక్కినేని ఫ్యామిలీ నుంచి ఏఎన్నార్ తర్వాత ఇప్పటికే పలువురు హీరోలు వెండి తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే.వారిలో ఇప్పుడు నాగ చైతన్య ఒక్కడే అగ్ర హీరోగా రాణిస్తున్నాడు. మిగతా వాళ్లు అగ్ర హీరో స్థానం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటె అక్కినేని ఫ్యామిలీ నుంచి అప్పట్లో వెండి తెరకు పరిచయం అయ్యాడు సుమంత్. కెరీర్లో కొన్ని హిట్ సినిమాల్లో నటించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ ఎక్కువ కాలం ఆ క్రేజ్‌ని కాపాడుకోలేకపోయారు. అక్కినేని నాగేశ్వరరావుకు సుమంత్ అంటే ఎంతో ప్రేమ. తాత దత్తత తీసుకోవడంతో చిన్నప్పటి నుంచి ఏఎన్నార్ వద్దే సుమంత్ పెరిగారు. అయితే ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నప్పటికీ మనవడైన సుమంత్‌ను ఆయన ఎందుకు దత్తత తీసుకున్నారో చాలా మంది తెలియదు.

హీరోగా బిజీగా ఉన్న సమయంలో ఏఎన్నార్ ఏడాదికి ఆరేడు సినిమాలు చేసేవారు. ఔట్‌డోర్ షూటింగ్స్ వల్ల పిల్లలతో గడిపేందుకు సమయం కేటాయించలేకపోతున్నానే అని బాధపడేవారు. 'అందాల రాముడు' సినిమా షూటింగ్‌ సమయంలో నాగేశ్వరరావుకి హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది.దీంతో ఏడాది పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో సమంత్ జన్మించాడు. తాత వద్దే ఆడుకోవడం, ఇంట్లో సందడిగా పాకడంతో ఏఎన్నార్‌కు సుమంత్‌పై ప్రేమ పెరిగింది. ఎలాగూ సినిమాలు చేస్తూ తాను తండ్రి మమకారాన్ని పొందని కారణంగా సుమంత్‌ని పెంచుకుని ఆ విధంగానైనా ఆ అనుభూతి అందుకోవాలని భావించారు.

వెంటనే అమెరికాలో ఉన్న సుమంత్‌ తల్లిదండ్రులకు లెటర్‌ రాసారు. అందుకు సుమంత్ తల్లిదండ్రులు అంగీకరించడంతో అక్కినేని నాగేశ్వరరావు, ఆయన భార్య అన్నపూర్ణ సంప్రదాయం ప్రకారం మనవడిని దత్తత తీసుకున్నారు. దీంతో అప్పటి నుంచి సుమంత్ తాత, అమ్మమ్మ వద్దే పెరిగాడు. సుమంత్‌ చిన్నప్పుడు తాతతో కలిసి షూటింగ్‌లకు వెళ్లేవాడు.అవుట్‌డోర్‌ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు బాగా ఎంజాయ్‌ చేసేవారట.అంతేకాదు అప్పుడప్పుడు తన తాత గారి ముందే ఆయన్ని ఇమిటేట్ చేస్తూ నవ్వించేవాడట సుమంత్.. ఇక ప్రస్తుతం సుమంత్.. కపటధారి అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు...!!


చంద్ర బాబుపై కొడాలి నాని ఫైర్

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>