Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jeevitha-rajasekharcbd84a8c-c561-4c6d-8ef4-d23a1b96f83e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jeevitha-rajasekharcbd84a8c-c561-4c6d-8ef4-d23a1b96f83e-415x250-IndiaHerald.jpgమాకు ఆ హీరోయిన్ వద్దు.. ఈ హారోయిన్ వద్దు..’ అంటూ హీరోలు చెప్పడం.. అందుకు అనుగుణంగా డైరెక్టర్లు, నిర్మాతలు కూడా హీరోయిన్లను మార్చడం మనం చూస్తూనే ఉంటాం. ఈ విషయంపై అనేకమంది హీరోయిన్లు కూడా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలూ లేకపోలేదు. అయితే ఓ హీరోయిన్‌ను.. jeevitha rajasekhar;dr rajasekhar;jeevitha rajaseskhar;dr. rajasekhar;telugu;smart phone;tamil;marriage;hero;heroineహీరోయిన్‌ను వద్దన్నందుకు.. హీరోనే తీసేశారట!హీరోయిన్‌ను వద్దన్నందుకు.. హీరోనే తీసేశారట!jeevitha rajasekhar;dr rajasekhar;jeevitha rajaseskhar;dr. rajasekhar;telugu;smart phone;tamil;marriage;hero;heroineThu, 17 Dec 2020 12:53:15 GMTఇంటర్నెట్ డెస్క్: ‘మాకు ఆ హీరోయిన్ వద్దు.. ఈ హారోయిన్ వద్దు..’ అంటూ హీరోలు చెప్పడం..  అందుకు అనుగుణంగా డైరెక్టర్లు, నిర్మాతలు కూడా హీరోయిన్లను మార్చడం మనం చూస్తూనే ఉంటాం. ఈ విషయంపై అనేకమంది హీరోయిన్లు కూడా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలూ లేకపోలేదు. అయితే ఓ హీరోయిన్‌ను వద్దన్నందుకు ఏకంగా హీరోనే మార్చేసిన ఘటన ఎక్కడైనా చూశారా.. అవును అలాంటి సంఘటనే సీనియర్ హీరో రాజశేఖర్‌కు ఎదురైంది.
 
సినిమాలతో పాటు నిజ జీవితంలోనూ చక్కటి జంట.. జీవిత-రాజశేఖర్. వీరిద్దరూ తమిళనటులే అయినా.. తెలుగులో మంచి పేరు సంపాదించారు. తెలుగులో కొన్ని సినిమాల్లో కలిసి కూడా నటించారు. అవి సూపర్ హిట్ కూడా అయ్యాయి. అయితే రాజశేఖర్ సూపర్ ఫాంలో ఉన్న సమయంలో జీవిత హీరోయిన్‌గా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే రాజశేఖర్ నటించనున్న ఓ సినిమాలో జీవితను హీరోయిన్‌గా తీసుకోవాలని నిర్మాతలు అనుకున్నారట. అయితే అందుకు రాజశేఖర్ అంగీకరించలేదట. ఆమె వద్దని, వేరే ఎవరినైనా తీసుకోవాలని కోరారట. కట్ చేస్తే నిర్మాతలు ఏకంగా రాజశేఖర్‌నే హీరోగా తొలగించి వేరే హీరోను పెట్టుకున్నారట. దీంతో రాజశేఖర్ భారీ షాక్‌కు గురయ్యారట. ఇదంతా ఓ తమిళ సినిమాకు సంబంధించిన స్టోరీ.

ఆ సినిమాలో ఎంతో బబ్లీగా, గ్లామరస్‌గా ఉండే పాత్ర హీరోయిన్‌ది. అయితే హోమ్లీగా ఉండే జీవిత అటువంటి పాత్రలో చేయలేరేమోనని, ఆమె కాకుండా వేరే వారిని తీసుకోవాలని రాజశేఖర్‌ నిర్మాతలకు సూచించారట. హీరోయిన్‌ ఎలా ఉందని ఆ చిత్ర దర్శక, నిర్మాతలు రాజశేఖర్‌ను అడగ్గా తనకు నచ్చలేదని, వెంటనే మార్చేద్దామని చెప్పారట. దానికి దర్శక, నిర్మాతలు కూడా ఓకే చెప్పారట. నాలుగు రోజుల్లో షూటింగ్ మొదలు కావల్సి ఉండగా.. పది రోజులైనా అవతలి నుంచి ఎలాంటి సమాచారం రాలేదట. దీంతో రాజశేఖర్ వారికి ఫోన్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదట. దీంతో రాజశేఖర్‌కు షాక్ తగిలినంత పనైందట.

ఇదిలా ఉంటే ఈ చిత్రం తరువాత మరిన్ని చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ తరవాత ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు.


తెలంగాణ పై బీజేపీ ఫోకస్

120 దేశాలు.. మూడు భాషలు.. మొదటి టెస్ట్ అరుదైన రికార్డ్..?

జనాలను భయపెడుతున్న ఆటోలు.. అసలు కారణం ఇదే..?

మ‌త్స్య‌కారుల మ‌ధ్య చిచ్చు... చ‌లిమంట‌లు కాచుకుంటోన్న ప్ర‌కాశం ఫ్యాక్ష‌నిస్టు..!

తెలుగులో బిజి అయిపోతున్న స‌ముద్ర‌ఖ‌ని... మ‌రో సినిమాకు ఒప్పేసుకున్నారుగా

ఒక కేసుకు రెండు కేసులు.. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తాం..?

అమరావతి ఉద్యమానికి ఏడాది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>