PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dharani-portal298b0d57-b1c1-464e-8e13-61bf29863211-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dharani-portal298b0d57-b1c1-464e-8e13-61bf29863211-415x250-IndiaHerald.jpgధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్ తప్పనిసరి చేయొద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఆధార్ అడగొద్దని ఆదేశించింది. ధరణి పోర్టల్ ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్ తో పాటు కులం, ఆధార్ వివరాలు అడగడం పట్ల దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. dharani portal;amala akkineni;dharani;telangana;january;court;king;king 1;letter;software;aadharవ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కు ఆధార్ అడగొద్దు: తెలంగాణ హైకోర్టువ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కు ఆధార్ అడగొద్దు: తెలంగాణ హైకోర్టుdharani portal;amala akkineni;dharani;telangana;january;court;king;king 1;letter;software;aadharThu, 17 Dec 2020 19:40:06 GMTధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్ తప్పనిసరి చేయొద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఆధార్ అడగొద్దని ఆదేశించింది. సంబంధిత సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసి తమకు సమర్పించాలని పేర్కొంటూ తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది. ధరణి పోర్టల్ ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్ తో పాటు కులం, ఆధార్ వివరాలు అడగడం పట్ల దాఖలైన పిటిషన్లపై హైకోర్టు  విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 

 ధరణి రిజిస్ట్రేషన్ సాఫ్ట్ వేర్ లో ఆధార్ వివరాల కాలమ్ తొలగించేంత వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ ప్రక్రియలు నిలిపివేయాలని స్పష్టం చేసింది. కులం, కుటుంబ సభ్యుల వివరాలు తొలగించాలని పేర్కొంది. ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతపై ఆందోళన నెలకొని ఉన్నవేళ... తెలివితేటలతో ప్రజల సున్నితమైన సమాచారాన్ని సేకరించాలని ప్రయత్నించడం ఆమోదయోగ్యం కాదని న్యాయస్థానం
స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ లో ఆధార్ తప్ప ఇతర గుర్తింపు పత్రాలు అడిగితే తమకు అభ్యంతరం లేదని తెలిపింది.

ప్రభుత్వం గతంలో కోర్టుకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని విచారణ సందర్భంగా హైకోర్టు కామెంట్ చేసింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం స్లాట్ బుకింగ్ కానీ పీటీఐఎన్ నెంబర్ కు ఆధార్ అవసరం లేదని చెప్పింది. కానీ అది అమలు చేయడం లో సర్కార్ విఫలమైందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమ్మరీ ట్రాంజక్షన్ లో కూడా ఆధార్ కార్డ్ నెంబర్ అడగడాన్ని తప్పు బట్టింది హైకోర్టు.
ఆధార్ కార్డు వివరాలు ఎట్టి పరిస్థితుల్లో అడగొద్దన్ ప్రభుత్వానికి మరోసారి స్పష్టం చేసింది.  ఆధార్ కార్డ్ కాకుండా ఏదైనా ఆడగోవచ్చని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. ఆధార్ కార్డ్ అడిగే కాలమ్ ను
సాఫ్ట్వేర్ నుండి తొలగించాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేాశాలు జారీ చేసింది.


 


రెబెల్ నేతలతో సమావేశం కానున్న సోనియా

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?

వాళ్ళు ఒప్పుకుంటే.. నేను రాజీనామా చేస్తా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>