PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/congress-leader-vijayasanthi-political-silence62cf752f-3e35-4b71-85c7-5091ea600946-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/congress-leader-vijayasanthi-political-silence62cf752f-3e35-4b71-85c7-5091ea600946-415x250-IndiaHerald.jpgఎన్నో ట్విస్ట్ ల మధ్య తెలంగాణ ఫైర్ బ్రాండ్ రాములమ్మ బిజెపిలో చేరి పోయారు. అంతకుముందే ఆమె కాంగ్రెస్ లో ఉన్నారు. దానికంటే ముందు టిఆర్ఎస్ లో ఉన్నారు. అయితే ఏ పార్టీలో ఆమె ఉన్నా, ఆ పార్టీలో ఆమెకు ఎక్కడలేని ప్రాధాన్యం లభిస్తుంది. రాములమ్మ జనాల్లో బలం ఉందా ? అంత సీన్ ఉందా అంటే లేదనే చెప్పాలి. సినిమా నటిగా ఆమెకు ఎక్కువగా ఆదరణ ఉంది తప్ప రాజకీయంగా ఆమె సాధించిన ఘనత ఏమి లేదు. టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు మాత్రమే ఎంపీగా గెలిచింది. బిజెపి లో ఉన్నా, తల్లి తెలంగాణ పార్టీ పెట్టినా, కాంగ్రెస్ లో ఉన్నా, ఆమె ప్రజా క్vijayasanthi ramulamma bjp trs congress;auto;vijayashanti;ramu;bharatiya janata party;telangana;congress;cinema;letter;success;party'రాములమ్మ ' తో లాభం ఉందా లేదా ? ఎందుకో అంత ప్రయార్టి ?'రాములమ్మ ' తో లాభం ఉందా లేదా ? ఎందుకో అంత ప్రయార్టి ?vijayasanthi ramulamma bjp trs congress;auto;vijayashanti;ramu;bharatiya janata party;telangana;congress;cinema;letter;success;partyThu, 17 Dec 2020 07:38:57 GMTఎన్నో ట్విస్ట్ ల మధ్య తెలంగాణ ఫైర్ బ్రాండ్ రాములమ్మ బిజెపిలో చేరి పోయారు.
 అంతకుముందే ఆమె కాంగ్రెస్ లో ఉన్నారు. దానికంటే ముందు టిఆర్ఎస్ లో ఉన్నారు. అయితే ఏ పార్టీలో ఆమె ఉన్నా, ఆ పార్టీలో ఆమెకు ఎక్కడలేని ప్రాధాన్యం లభిస్తుంది. రాములమ్మ  జనాల్లో బలం  ఉందా ? అంత సీన్ ఉందా అంటే లేదనే చెప్పాలి. సినిమా నటిగా ఆమెకు ఎక్కువగా ఆదరణ ఉంది తప్ప రాజకీయంగా ఆమె సాధించిన ఘనత ఏమి లేదు. టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు మాత్రమే ఎంపీగా గెలిచింది. బిజెపి లో ఉన్నా, తల్లి తెలంగాణ పార్టీ పెట్టినా, కాంగ్రెస్ లో ఉన్నా, ఆమె ప్రజా క్షేత్రం లో సక్సెస్ కాలేకపోయారు. 





రాజకీయ నేతగా ఉన్నా సరే, ప్రజలలో తిరిగేందుకు పెద్దగా ఇష్టపడలేదు. ప్రజాక్షేత్రంలో ఆమెకు ఉన్న పట్టు అంతంతమాత్రమే. అయినా విజయశాంతి తాను అందరికంటే భిన్నం అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు.తనకు ప్రాధాన్యం ఎక్కువగా కావాలి అన్నట్లుగానే ప్రవర్తిస్తారు. ఆ ప్రాధాన్యత తగ్గితే అస్సలు ఒప్పుకోరు. కానీ ఎప్పుడు ప్రజాక్షేత్రంలో బలం పెంచుకునేందుకు ప్రయత్నించలేదు. పార్టీలో లీడర్లు తనకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారు. ఇక చిన్నాచితక లీడర్లను ఏ మాత్రం పట్టించుకోరు. తాను జాతీయ స్థాయి నాయకురాలిని, తనకు ఆ స్థాయిలోనే ప్రాధాన్యత కల్పించాలని ఆమె కోరుకుంటారు. ఇందులో ఏ మాత్రం రాజీ పడరు.



 ఇటీవల కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరే సమయంలో అదే తంతు. అదే దర్పం  ప్రదర్శించారు. బిజెపి ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పార్టీ కండువా కప్పేందుకు ప్రయత్నించినా, ఆమె ఇష్టపడలేదు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలోనే ఆమె చేరారు. దీంతో అప్పుడే ఆమెపై సెటైర్స్ పడ్డాయి. ఇప్పుడైనా ఆమె ప్రజాక్షేత్రంలో బలం  పెంచుకుని, పార్టీకి ఉపయోగపడతారా అంటే అది కూడా అనుమానంగానే కనిపిస్తోంది.



ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫ్రీ బస్సు పాస్.. ఆర్టీసీ కీలక నిర్ణయం..

కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న బుట్ట బొమ్మ.. ఫొటో చూస్తే మంటలే..

కమల్ హాసన్‌కు షాకిచ్చిన ఈసీ.. ఊరుకోమంటున్న విశ్వనటుడు

ఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులు

నిర్భయ తల్లి సంచలన ప్రతిజ్ఞ

రకుల్‌కు ఇల్లు కొనిచ్చిన రాజకీయ నేత? దీనిపై రకుల్ స్పందన ఇదీ!

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>