MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijayalakshmi-actress5b985eff-ac79-4cb8-a0b5-1784f9bcd3db-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijayalakshmi-actress5b985eff-ac79-4cb8-a0b5-1784f9bcd3db-415x250-IndiaHerald.jpgహీరోయిన్ విజయలక్ష్మి ఒకప్పుడు కన్నడ సినీ పరిశ్రమలో గొప్ప నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి.. పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అందరి చేత ఔరా అనిపించుకున్న బ్యూటీ. తెలుగు వెండి తెరతోనూ సంబంధం ఉన్న ఈమె పరిస్థితి ఇప్పుడు కడు దయనీయంగా మారింది. vijayalakshmi actress;beauty;venu;vijayalakshmi;cinema;bengaluru 1;kannada;blockbuster hit;hero;silver;heroine;arjun 1;venu thottempudiఒకప్పటి టాప్ హీరోయిన్.. చికిత్స చేయించుకోవడానికి డబ్బులేక అవస్థలు పడుతోంది!ఒకప్పటి టాప్ హీరోయిన్.. చికిత్స చేయించుకోవడానికి డబ్బులేక అవస్థలు పడుతోంది!vijayalakshmi actress;beauty;venu;vijayalakshmi;cinema;bengaluru 1;kannada;blockbuster hit;hero;silver;heroine;arjun 1;venu thottempudiThu, 17 Dec 2020 19:00:00 GMTహీరోయిన్ విజయలక్ష్మి ఒకప్పుడు కన్నడ సినీ పరిశ్రమలో గొప్ప నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి.. పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అందరి చేత ఔరా అనిపించుకున్న బ్యూటీ. తెలుగు వెండి తెరతోనూ సంబంధం ఉన్న ఈమె పరిస్థితి ఇప్పుడు కడు దయనీయంగా మారింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమెకు కనీసం వైద్యం చేయించుకునే స్థోమత కూడా లేకపోవడం తో అప్పట్లో చాలా ఇబ్బంది పడింది.  

అనారోగ్యంతో ఆ మధ్య ఆమె బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందింది. ఆమె చికిత్సకు డబ్బులు లేకపోవడంతో ఆర్థిక సాయం చేసి తమ సిస్టర్ ను కాపాడాలని ఆమె సోదరి.. సినీ అభిమానులను కోరింది. ఇక  ఇప్పటికి ఆమె కోలుకోకపోవడం చికిత్సకు, బ్రతకడానికి డబ్బులు లేకపోవడం తో విజయలక్ష్మి పరిస్థితి దిగజారింది. ఆమె పరిస్థితిని తెలుసుకున్న పలువురు బాధపడుతున్నారు. తమకు తోచిన సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది.  

తెలుగు సినిమాల్లో..

కొన్నేళ్ల క్రితం దక్షిణాది సినీ పరిశ్రమలో విజయలక్ష్మి మంచి నటిగా పేరు సంపాదించారు. నాగమండల, సూర్యవంశ, నంబర్ వన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో కన్నడ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. జగపతి బాబు, అర్జున్ సార్జా నటించిన 'హనుమాన్ జంక్షన్' మూవీ లో మరో హీరో వేణుకి జోడీగా నటించింది. ఆ సినిమాతో తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపు పొందారు. ఆతర్వాత  సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టారు.

అయితే గత ఏడాదిగా విజయలక్ష్మి అధిక రక్తపోటుతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. అయితే కొంతకాలం క్రితమే తన తల్లికి ఆరోగ్యం బాగా లేక పోవడంతో ఆమెకు చికిత్స చేయించేంతుకు విజయలక్ష్మి తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసింది. దీంతో  ఆమె పూర్తి పేదరికం అనుభవిస్తున్నారు.




రెబెల్ నేతలతో సమావేశం కానున్న సోనియా

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?

వాళ్ళు ఒప్పుకుంటే.. నేను రాజీనామా చేస్తా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>