PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/osmania-university370e3a45-7b64-41f2-9e3c-8a6da8608aa1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/osmania-university370e3a45-7b64-41f2-9e3c-8a6da8608aa1-415x250-IndiaHerald.jpgఉస్మానియా యూనివ‌ర్సిటీ లా స్టూడెంట్ సురేష్ యాద‌వ్‌‌పై దాడి జరిగిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులే సురేష్ పై దాడి చేశారని ఆరోపణలు వస్తుండటంతో సమస్య మరింత ముదురుతోంది. ఉస్మానిాయా యూనివర్శిటీలో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయిosmania university;kcr;ktr;suresh;suman;telangana rashtra samithi trs;balka suman;telangana;indira gandhi;congress;mla;arrest;partyటీఆర్ఎస్ గూండాల్లారా ఖ‌బ‌డ్దార్‌! కాంగ్రెస్ మహిళా నేత ఫైర్టీఆర్ఎస్ గూండాల్లారా ఖ‌బ‌డ్దార్‌! కాంగ్రెస్ మహిళా నేత ఫైర్osmania university;kcr;ktr;suresh;suman;telangana rashtra samithi trs;balka suman;telangana;indira gandhi;congress;mla;arrest;partyThu, 17 Dec 2020 20:25:40 GMTసురేష్ యాద‌వ్‌‌పై దాడి జరిగిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్  అనుచరులే సురేష్ పై దాడి చేశారని ఆరోపణలు వస్తుండటంతో సమస్య మరింత ముదురుతోంది. ఉస్మానిాయా యూనివర్శిటీలో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాడికి గురైన బాధితుడు సురేష్ యాదవ్ ను విపక్షాల నేతలు పోటాపోటీగా పరామర్శిస్తున్నారు. దాడిని తీవ్రంగా ఖండిస్తూ అధికార పార్టీ నేతలకు హెచ్చరికలు చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు.

                  ఉస్మానియా యూనివర్శిటిలో సురేష్ పై  జ‌రిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున‌ తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి ఇందిరా శోభ‌న్‌. అర్ధ‌రాత్రి వేళ టీఆర్ఎస్ గూండాలు త‌ప్ప‌తాగి సురేష్‌పై దాడికి పాల్ప‌డ‌టం తెలంగాణ ప్ర‌భుత్వానికే సిగ్గుచేట‌న్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నిస్తే చంపేస్తారా అంటూ ఆమె ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గాదరి కిషోర్ వ్యవహారం చూస్తుంటే.. అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగానే ఉంద‌న్నారు ఇందిరా శోభన్. ఉస్మానియా త‌ల్లి ఒడిలో చ‌దువుని.. ఆ ఉస్మానియా చ‌లువ‌తోనే నేడు ప్ర‌జాప్ర‌తినిధులుగా చెలామ‌ణి అవుతున్న వీళ్ళిద్దరూ.. అదే యూనివ‌ర్సిటీ విద్యార్థుల‌పై వీధి రౌడీల‌తో దాడి చేయించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సమో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.


           దాడికి పాల్ప‌డ్డ టీఆర్ఎస్ తొత్తుల‌ను త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేయాల‌ని ఇందిరా శోభన్ డిమాండ్ చేశారు. ప్ర‌శ్నించే గొంతుక‌ల‌ను నులిమివేయ‌డ‌మే ధ్యేయంగా ఈ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని ఆమె మండిప‌డ్డారు. తెలంగాణ ఉద్య‌మానికి ఇదే ఉస్మానియా వ‌ర్సిటీ విద్యార్థులు ఊపి‌రి పోశార‌ని.. వారి పుణ్యానే నేడు కేసీఆర్ ముఖ్య‌మంత్రి కుర్చీలో కులుకుతున్నార‌‌నే విష‌యం మ‌ర్చిపోవ‌ద్దన్నారు. విద్యార్థుల‌కు భ‌య‌ప‌డే కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ యూనివ‌ర్సిటీ వైపు క‌న్నెత్తి చూసేందుకు కూడా సాహ‌సించ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ గూండాల్లారా ఇక‌పై మీ ఆట‌లు చెల్ల‌వు ఖ‌బ‌డ్దార్ అని ఇందిరాశోభ‌న్ తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు.


ఆకట్టుకుంటున్న మాస్టర్ తెలుగు టీజర్....

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?

వాళ్ళు ఒప్పుకుంటే.. నేను రాజీనామా చేస్తా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>