Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/death2716d22b-c48a-4fc6-8faa-6b149f097413-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/death2716d22b-c48a-4fc6-8faa-6b149f097413-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో మనుషుల మధ్య బంధాలు బంధుత్వాలు విలువ లేకుండా పోతుంది అన్న విషయం తెలిసిందే. కట్టుకున్న వారిని దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు కొన్ని తెర మీదికి వస్తే కన్నవారు ఏకంగా పిల్లలపై ఉన్న ప్రేమను మరచి దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకును కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి ఏకంగా దారుణంగా కసితీరా కొడుకును హత్య చేసిన ఘటన స్థానికంగా అందరినీ ఒక్క సారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మద్యానికmurder;balakrishna;manu;tiru;police;mandalam;husband;wife;murder.;local language;medak;father;pettaకొడుక్కి కరెంట్ షాక్ ఇచ్చిన తండ్రి.. కసి తీరకపోవడంతో దారుణంగా..?కొడుక్కి కరెంట్ షాక్ ఇచ్చిన తండ్రి.. కసి తీరకపోవడంతో దారుణంగా..?murder;balakrishna;manu;tiru;police;mandalam;husband;wife;murder.;local language;medak;father;pettaThu, 17 Dec 2020 14:00:00 GMTహత్య చేస్తున్న ఘటనలు కొన్ని తెర మీదికి వస్తే కన్నవారు ఏకంగా పిల్లలపై ఉన్న ప్రేమను మరచి దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకును కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి ఏకంగా దారుణంగా కసితీరా కొడుకును హత్య చేసిన ఘటన స్థానికంగా అందరినీ ఒక్క సారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.



 మద్యానికి బానిసగా మారిన కొడుకు వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతున్న  తరుణంలో విచక్షణ కోల్పోయిన తండ్రి ఏకంగా కొడుకు ను చంపేందుకు మొదట కరెంట్ షాక్ ఇచ్చాడు. అయినప్పటికీ కసి తీరక  దారుణంగా పొడిచి హత్య చేశాడు.  ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే నిజాంపేట మండలంనస్కల్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల కుమ్మరి స్వామి మద్యానికి బానిసై  పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. రోజు ఫుల్లుగా మద్యం తాగి కుటుంబసభ్యులను వేధింపులకు గురి చేసేవాడు. భర్త వేధింపులు తాళలేక స్వామి భార్య  పుట్టింటికి వెళ్లిపోయింది.



 ఇక అప్పటి నుంచి తల్లిదండ్రులు తరచూ వేధించడం మొదలుపెట్టాడు స్వామి. ఇక మద్యం మత్తులో తరచూ వచ్చి గొడవ పడుతూ ఉండేవాడు.  రోజురోజుకు కొడుకు వేధింపులు ఎక్కువ అవుతున్న తరుణంలో తల్లిదండ్రులు భరించలేకపోయారు చివరికి వేధింపులకు గురి చేస్తున్న కొడుకును హత్య చేయాలని భావించాడు తండ్రి బాలయ్య.  ఈ క్రమంలోనే స్నేహితుడు రమేష్ తో కలిసి పథకం వేసి కొడుకుకు  కరెంట్ షాక్ ఇచ్చాడు...  అయినా కొడుకు ప్రాణాలు పోకపోవడంతో గడ్డ పలుగుతో విచక్షణారహితంగా కసితీరా పొడిచాడు. చివరికి మళ్ళీ అనుమానం వచ్చి కరెంట్ షాక్ ఇచ్చారు. దీంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా తండ్రి నేరం అంగీకరించాడు.


ఈ ఇద్దరి సినిమా అనుబంధం గురించి ఎవరికి తెలియని ఆసక్తికరమైన విషయాలు

అనుపమ వెంట 8 మిలియన్ ఫాలోవర్స్.. అమ్మడు ఏం చేసిందో తెలుసా..?

టి కాంగ్రెస్ రాజకీయం: రేవంత్ రెడ్డి మరో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానున్నాడా...?

తెలంగాణ పై బీజేపీ ఫోకస్

120 దేశాలు.. మూడు భాషలు.. మొదటి టెస్ట్ అరుదైన రికార్డ్..?

జనాలను భయపెడుతున్న ఆటోలు.. అసలు కారణం ఇదే..?

మ‌త్స్య‌కారుల మ‌ధ్య చిచ్చు... చ‌లిమంట‌లు కాచుకుంటోన్న ప్ర‌కాశం ఫ్యాక్ష‌నిస్టు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>