MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/premi-vishwanathac141096-1345-4bb3-84f4-2ad4e6462309-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/premi-vishwanathac141096-1345-4bb3-84f4-2ad4e6462309-415x250-IndiaHerald.jpgమొహమాటం లేకుండా చెప్పుకోవాలంటే తెలుగులో సీరియల్స్ కి మార్కెట్ రోజురోజుకి తగ్గిపోతోంది. ఒక చిన్న పాయింట్ ని పట్టుకుని సంవత్సరాలు తరబడి లాగుతూ ఉంటే ఇలానే ఫలితం ఉంటుంది. ఇదే సమయంలో ఎంటర్టైన్మెంట్ షోలు సత్తా చాటుతూ ఉండటంతో ప్రేక్షకులు అటు వైపు పరుగులు తీస్తున్నారుpremi vishwanath;yajamanya;telugu;car;episode;vegetable market;success;parugu;premi viswanathవంటలక్క రేంజ్ మాములుగా లేదు..ఒక్కో ఎపిసోడ్ కి ఇంతా పెంచిందా..?వంటలక్క రేంజ్ మాములుగా లేదు..ఒక్కో ఎపిసోడ్ కి ఇంతా పెంచిందా..?premi vishwanath;yajamanya;telugu;car;episode;vegetable market;success;parugu;premi viswanathThu, 17 Dec 2020 12:00:00 GMTమార్కెట్ రోజురోజుకి తగ్గిపోతోంది. ఒక చిన్న పాయింట్ ని పట్టుకుని సంవత్సరాలు తరబడి లాగుతూ ఉంటే ఇలానే ఫలితం ఉంటుంది. ఇదే సమయంలో ఎంటర్టైన్మెంట్ షోలు సత్తా చాటుతూ ఉండటంతో ప్రేక్షకులు అటు వైపు పరుగులు తీస్తున్నారు. కానీ.., ఇలాంటి సమయంలో కూడా టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతున్న సీరియల్ ఏదైనా ఉందా అంటే అది 'కార్తీకదీపం' అని చెప్పుకోవచ్చు. కేవలం మహిళా ప్రేక్షకులు మాత్రమే కాదు.., మగవారు కూడా ఈ సీరియల్ ని చూస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే.., ఈ సీరియల్ కి ఇంతలా పేరు రావడానికి కారణం మాత్రం వంటలక్క కేరక్టర్. అలాంటి కేరక్టర్ లో ఒదిగిపోయిన ప్రేమి విశ్వనాథ్ పెద్దగా గ్లామరస్ కాకపోయినప్పటికీ..,  ఆమెకు భారీ మొత్తంలో పారితోషికం అందుతోందట. నిజానికి 'కార్తీకదీపం' సీరియల్ ముందుగా మలయాళంలో  'కారుముత్తు' పేరుతో   7 సంవత్సరాల పాటు ప్రసారం అయ్యింది.  అక్కడ కూడా లీడ్ రోల్  పోషించింది ప్రేమి విశ్వనాథ్‌. అక్కడ ఒక్కో ఎపిసోడ్ కి ఈమె అందుకున్నపారితోషికం రూ.15 వేల మాత్రమే. కానీ..,  తెలుగులో మాత్రం ప్రేమీ ఒక్కో ఎపిసోడ్ కి ఒక లక్ష వరకు ఛార్జ్ చేస్తూ వస్తోంది. ఎంత సక్సెస్ ఫుల్ ఆర్టిస్ట్ అయినా.., సీరియల్ స్థాయికి ఇది చాలా పెద్ద అమౌంట్. కానీ.., లాక్ డౌన్ సమయంలో ఆర్టిస్ట్ పే మెంట్స్ చాలా వరకు తగ్గిపోయాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తోంది. కానీ.., ప్రేమీ మాత్రం ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో కొండెక్కి కుర్చున్నట్టు తెలుస్తోంది. ఈమె ఒక్కో ఎపిసోడ్ కి ఇప్పుడు రూ.3 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తన పేరు మీద సీరియల్ మార్కెట్ అంతా జరుగుతున్నప్పుడు తాను ఎందుకు తక్కువ మొత్తం తీసుకోవాలి అన్నది ఆమె ప్రశ్న. నిజానికి వంటలక్క ఈ ప్రస్తావన గతంలోనే తెచ్చిందట. అయితే.., అప్పుడే ఆమెని సీరియల్ నుండి తొలగించాలని నిర్వాహకులు భావించారు. కానీ.., ప్రేక్షకుల నుండి పెద్ద ఎత్తున నిరసన రావడంతో  వెనక్కి తగ్గారు. ఇక ఇప్పుడు కూడా చేసేది లేక.., వంటలక్కకి ఒక్కో ఎపిసోడ్ కి రూ.3 లక్షల వరకు ఇవ్వడానికి యాజమాన్యం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అదీ మరి వంటలక్క రేంజ్.


కరోనా వైరస్ మూలాలపై పరిశోధన.. వైరస్ పుట్టింది చైనాలో కాదా?

మ‌త్స్య‌కారుల మ‌ధ్య చిచ్చు... చ‌లిమంట‌లు కాచుకుంటోన్న ప్ర‌కాశం ఫ్యాక్ష‌నిస్టు..!

తెలుగులో బిజి అయిపోతున్న స‌ముద్ర‌ఖ‌ని... మ‌రో సినిమాకు ఒప్పేసుకున్నారుగా

ఒక కేసుకు రెండు కేసులు.. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తాం..?

అమరావతి ఉద్యమానికి ఏడాది

సలార్ కోసం మోహన్ లాల్ మరీ ఇంత బెట్టు చేయాలా..?

అమరావతి ఉద్యమం...అసలైన తీర్పు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>