PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jamili9f6b1757-b172-4495-a4db-72774b7987bc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jamili9f6b1757-b172-4495-a4db-72774b7987bc-415x250-IndiaHerald.jpgచాలా కాలం నుంచి జమిలి ఎన్నికల ప్రస్తావన దేశవ్యాప్తంగా మారుమోగుతూనే వస్తోంది. ఒకే దేశం, ఒకే ఎన్నిక నినాదంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో కేంద్రం ఉంది. దీనిపై ఎప్పటి నుంచో కథనాలు వస్తున్నా, అదంతా ఉత్తిదే అని, జమిలి ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని, కేంద్రం అంత సాహసం చేయదు అనే అంతా అభిప్రాయపడ్డారు . ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ప్రతిపక్షంలో కూర్చున్న దగ్గర నుంచి జమిలి ఎన్నికల జపం చేస్తూనే వస్తున్నారు. పార్టీ శ్రేణులకు సైతం త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్jamili elections bjp tdp ysrcp trs;auto;telangana rashtra samithi trs;korcha;jagan;telangana;narendra modi;prime minister;letter;tdp;central government;ycp;nijam;party;narendraజమీలి ఎన్నికలు వస్తే ..? వీళ్ల రాజకీయం ముగిసినట్లే ?జమీలి ఎన్నికలు వస్తే ..? వీళ్ల రాజకీయం ముగిసినట్లే ?jamili elections bjp tdp ysrcp trs;auto;telangana rashtra samithi trs;korcha;jagan;telangana;narendra modi;prime minister;letter;tdp;central government;ycp;nijam;party;narendraThu, 17 Dec 2020 02:00:00 GMTచాలా కాలం నుంచి జమిలి ఎన్నికల ప్రస్తావన దేశవ్యాప్తంగా మారుమోగుతూనే వస్తోంది. ఒకే దేశం, ఒకే ఎన్నిక నినాదంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో కేంద్రం ఉంది. దీనిపై ఎప్పటి నుంచో కథనాలు వస్తున్నా, అదంతా ఉత్తిదే అని, జమిలి ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని, కేంద్రం అంత సాహసం చేయదు అనే అంతా అభిప్రాయపడ్డారు . ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ప్రతిపక్షంలో కూర్చున్న దగ్గర నుంచి జమిలి ఎన్నికల జపం చేస్తూనే వస్తున్నారు. పార్టీ శ్రేణులకు సైతం త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని , అంతా సిద్దం గా ఉండాలని పిలుపు ఇస్తున్నారు. అయితే చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే పార్టీ నాయకులను అరెస్టు చేసేందుకు ఈ జపం చేస్తున్నారు అని అంత అభిప్రాయపడ్డారు. 




ప్రధాని నరేంద్ర మోదీ జమిలి ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి . వాస్తవంగా 2024లో లోక్ సభ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కాకపోతే జమిలి ఎన్నికలు వస్తే ,2022 లోనే వాటిని నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగానే జమిలి ఎన్నికలు వస్తే ఎవరికి లాభం ? ఎవరికి నష్టం చేకూరుతుంది అనే విషయం పైన చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం విషయానికొస్తే ,జగన్ హవా నడుస్తోంది. సంక్షేమ పథకాలు జనాల్లోకి వెళ్తున్నాయి. జగన్ పరిపాలన పై ప్రజల్లో అసంతృప్తి బాగా కనిపిస్తోంది . 2022 లో ఎన్నికలు వచ్చినా, జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. టిడిపి విషయానికి వస్తే పూర్తిగా నిరాశ నిస్పృహల్లో పార్టీ కేడర్ ఉంది. వయసు రీత్యా చంద్రబాబు సైతం ఇప్పుడు యాక్టివ్ గా తిరగలేని పరిస్థితి. గతంలో ఉన్న పరిస్థితి కూడా ఇప్పుడు కనిపించడం లేదు. 




ఈ పరిస్థితుల్లో జమిలి ఎన్నికలకు వెళ్తే టిడిపికి మరోసారి చేదు ఫలితాలు వస్తాయి అనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇక తెలంగాణ విషయానికొస్తే ఇక్కడా టిఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ విషయం గ్రేటర్ ఎన్నికలు అర్థం అయింది. 2022 లో జమిలి ఎన్నికలు వస్తే ఖచ్చితంగా టీఆర్ఎస్  ఇబ్బందికరంగా బిజెపికి అనుకూలంగా ఫలితం ఉంటుంది అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.



ప్రపంచంలోనే శక్తివంతమైన ఆయుధం.. సిద్ధం చేస్తున్న భారత్..?

కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న బుట్ట బొమ్మ.. ఫొటో చూస్తే మంటలే..

కమల్ హాసన్‌కు షాకిచ్చిన ఈసీ.. ఊరుకోమంటున్న విశ్వనటుడు

ఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులు

నిర్భయ తల్లి సంచలన ప్రతిజ్ఞ

రకుల్‌కు ఇల్లు కొనిచ్చిన రాజకీయ నేత? దీనిపై రకుల్ స్పందన ఇదీ!

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>