PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pusapati-ashok-gajapathi-raju0d916268-dfce-4261-a051-1f4db98c2420-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pusapati-ashok-gajapathi-raju0d916268-dfce-4261-a051-1f4db98c2420-415x250-IndiaHerald.jpgఅసలే కష్టాల్లో ఉంది తెలుగుదేశం పార్టీ. ఈ కష్టాలు ఆ పార్టీ భవిష్యత్తుని ఎక్కడికి తీసుకువెళ్ళే అవకాశం ఉందో అని అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న ఆ పార్టీ నేడు అసలు సమర్ధ నాయకత్వం లేక ఇబ్బందులు పడుతుంది. ఆ పార్టీ భవిష్యత్తుపై పార్టీ అధిష్టానంలో కూడా ఒకరకమైన ఆందోళన ఉంది. ఈ తరుణంలో పార్టీలో వర్గ విభేదాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఎవరో ఒక నేత ఇప్పుడు వర్గ విభేదాలతో రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఆ పార్టీలో ఉంది అనే మాట వాస్తవం. పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కూడా ఈ గొడవpusapati ashok gajapathi raju;ashok;geetha;telugu desam party;atchannaidu kinjarapu;amaravati;andhra pradesh;telugu;panchayati;bengaluru 1;history;tdp;central government;partyపాపం టీడీపీలో అశోక్ పరిస్థితి ఏంటీ...?పాపం టీడీపీలో అశోక్ పరిస్థితి ఏంటీ...?pusapati ashok gajapathi raju;ashok;geetha;telugu desam party;atchannaidu kinjarapu;amaravati;andhra pradesh;telugu;panchayati;bengaluru 1;history;tdp;central government;partyThu, 17 Dec 2020 09:22:17 GMTపార్టీ భవిష్యత్తుని ఎక్కడికి తీసుకువెళ్ళే అవకాశం ఉందో అని అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న ఆ పార్టీ నేడు అసలు సమర్ధ నాయకత్వం లేక ఇబ్బందులు పడుతుంది. ఆ పార్టీ భవిష్యత్తుపై పార్టీ అధిష్టానంలో కూడా ఒకరకమైన ఆందోళన ఉంది. ఈ తరుణంలో పార్టీలో వర్గ విభేదాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఎవరో ఒక నేత ఇప్పుడు వర్గ విభేదాలతో రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఆ పార్టీలో ఉంది అనే మాట వాస్తవం.

పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కూడా ఈ గొడవలతో బాగా ఇబ్బంది పడుతున్నారు. అగ్ర నేతలు కూడా ఇప్పుడు అధిష్టానం ఈ గొడవలకు పరిష్కారం చూపాలని కోరుతూ అమరావతి బాట పడుతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయనగరం పంచాయతీ జరిగింది. ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడుతో అశోక్ గజపతిరాజు వర్గీయులు భేటీ అయ్యారు. పార్టీ నియమావళికి విరుద్ధంగా మీసాల గీత పోటీగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని అశోక్ గజపతిరాజు వర్గీయులు ఆరోపణలు చేసారు.

సాయంత్రం మీసాల గీతతో ఫోన్లో మాట్లాడిన అచ్చెన్నాయుడు... ఈ గొడవకు పరిష్కారం చూడాలని, దూకుడు వద్దని స్పష్టం చేసారు. తాను బెంగళూర్ లో ఉన్నానని మీసాల గీత చెప్పగా... పోటీగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని వెంటనే క్లోజ్ చేయాలని సూచనలు చేసారు అచ్చెన్న. కార్యకర్తలతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని మీసాల గీత చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని గీత  స్పష్టం చేసారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి విజయనగరం నుంచి వచ్చిన 50 మంది అశోక్ గజపతిరాజు వర్గీయులు... తమ సమస్యలను వివరించారు. సుదీర్ఘంగా వారితో అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఎవరూ అనవసరంగా ఆవేశ పడవద్దు అని స్పష్టం చేసారు.


బిగ్ బాస్ దివి వెంట పడుతున్న దర్శక నిర్మాతలు..!

కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న బుట్ట బొమ్మ.. ఫొటో చూస్తే మంటలే..

కమల్ హాసన్‌కు షాకిచ్చిన ఈసీ.. ఊరుకోమంటున్న విశ్వనటుడు

ఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులు

నిర్భయ తల్లి సంచలన ప్రతిజ్ఞ

రకుల్‌కు ఇల్లు కొనిచ్చిన రాజకీయ నేత? దీనిపై రకుల్ స్పందన ఇదీ!

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>