PoliticsP Subhadra devieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/who-becomes-king-in-tamil-politics62447623-2f46-46e1-bf9a-032a363cdacd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/who-becomes-king-in-tamil-politics62447623-2f46-46e1-bf9a-032a363cdacd-415x250-IndiaHerald.jpgతమిళనాట ఎన్నికల హడావుడి ఇప్పటినుంచే మొదలయ్యింది. పోటీకి సై అనే ఆశావహులు, కొత్త పార్టీలను పెట్టి అధికార అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునేవారు వ్యూహ ప్రతి వ్యూహాలను విరచించే పనిలో తలమునకలవుతున్నారు. కొత్త పొత్తులు కూడా రాబోతున్నాయి. 2021 మే లో షెద్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. డీఎంకే, అన్నాడీఎంకే లు ఇంతకాలం రాజకీయ ఆధిపత్యాన్ని చూపిస్తూ వస్తున్నా నేపథ్యంలో...తాజాగా సమీకరణాలు మారుతున్నాయి. kamal haasan;view;kamal hassan;bhavana;rajani;vijay;hyderabad;bharatiya janata party;rajani kanth;tamil;december;assembly;vijay kanth;letter;joseph vijay;partyతమిళ్ రాజకీయ తారలెవ్వరో?తమిళ్ రాజకీయ తారలెవ్వరో?kamal haasan;view;kamal hassan;bhavana;rajani;vijay;hyderabad;bharatiya janata party;rajani kanth;tamil;december;assembly;vijay kanth;letter;joseph vijay;partyThu, 17 Dec 2020 15:00:00 GMTతమిళనాట ఎన్నికల హడావుడి ఇప్పటినుంచే మొదలయ్యింది. పోటీకి సై అనే ఆశావహులు, కొత్త పార్టీలను పెట్టి అధికార అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునేవారు వ్యూహ ప్రతి వ్యూహాలను విరచించే పనిలో తలమునకలవుతున్నారు. కొత్త పొత్తులు కూడా రాబోతున్నాయి. 2021  మే లో షెద్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. డీఎంకే, అన్నాడీఎంకే లు ఇంతకాలం రాజకీయ ఆధిపత్యాన్ని చూపిస్తూ వస్తున్నా నేపథ్యంలో...తాజాగా సమీకరణాలు మారుతున్నాయి.రెండు దశాబ్దాలుగా రాజకీయ అరంగేట్రం విషయమై ఊరిస్తూ ఉడికిస్తూ ఉన్న తమిళ్ సూపర్ స్టార్ రజిని ఎట్టకేలకు తాను కొత్తపార్టీ పెట్టె పాలిటిక్స్ లోకి వస్తున్నానంటూ ప్రకటించేశారు. పార్టీ పేరు, విధివిధానాలు, లక్ష్యాల గురించి డిసెంబర్ 31  న సవివరంగా తెలియచేస్తానంటూ మళ్ళీ కాస్త సస్పెన్స్ లో పెట్టారు.
అంతకుముందే మక్కల్ నీది మయ్యం పార్టీ పెట్టి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి 4  శాతం ఓట్లను మరో స్టార్ కమల్ హాసన్ సాధించుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటినుంచే ప్రచారం ప్రారంభించారు. అంతే కాకుండా...తమిళ ప్రజల కోసం రజిని పార్టీతో కలిసేందుకు కూడా సిద్ధమేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఆపై ఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తో పొత్తును కూడా తెరపైకి తెచ్చారు. ఈ సరికొత్త పొత్తు ఇరుపక్షాలకు మేలు చేసేదిగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే తమిళ్ రాజకీయాల్లోకి ఒవైసి ఎంట్రీ తో అన్నా డీఎంకే కి కూడా లాభం చేకూరుస్తుందని మరో వాదన కూడా తెరపైకి వస్తోంది. కారణం...ఈ కూటమిలో కమలం పార్టీ ఉండడమే. ఇదే సమయంలో హైదరాబాద్ మోడల్ పాలిటిక్స్ ని మరింత విస్తరించేందుకు ఒవైసి పధకం రచిస్తున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో రజిని పార్టీ తమిళ్ రాజకీయాలని విశేషంగా ప్రభావితం చేస్తుందనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కమల్ తో పోలిస్తే రజిని కాస్త పెద్ద స్టార్. విజయ్ కాంత్, కమల్ హాసన్లాంటి వాళ్ళు అన్నా డీఎంకే ని కాస్తంత కూడా కదల్చలేకపోయారనే భావన ప్రజల్లో నెలకొని ఉంది. మార్పు కోరుకునే తమిళ్ ఓటర్లకు రజిని కచ్చితంగా ప్రత్యామ్నాయం అవుతారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ద్రవిడియన్ పార్టీల రాజ్యం నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో కొత్త పార్టీకి అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ అవకాశాన్ని రజిని సద్వినియోగపరచుకుంటాడా? లేదా? అన్నది 2021  ఎన్నికలు చెబుతాయి. అంతవరకూ ఎన్ని ఊహాగానాలైనా చక్కర్లు కొట్టొచ్చు.




హైకోర్టులో జగన్ సర్కార్ పిటీషన్ పై ఎస్ఈసీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు!

"జనభేరి" సభకు భయపడుతున్న "జగన్ సర్కార్'.. !!

అనుపమ వెంట 8 మిలియన్ ఫాలోవర్స్.. అమ్మడు ఏం చేసిందో తెలుసా..?

టి కాంగ్రెస్ రాజకీయం: రేవంత్ రెడ్డి మరో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానున్నాడా...?

తెలంగాణ పై బీజేపీ ఫోకస్

120 దేశాలు.. మూడు భాషలు.. మొదటి టెస్ట్ అరుదైన రికార్డ్..?

జనాలను భయపెడుతున్న ఆటోలు.. అసలు కారణం ఇదే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P Subhadra devi]]>