MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-varun-tej-and-gopichandf5b2a235-baa5-42f0-9030-009db0f25f23-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-varun-tej-and-gopichandf5b2a235-baa5-42f0-9030-009db0f25f23-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది "F2" సినిమా.. విక్టరీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ‘ఫ‌న్ అండ్ ఫ్రస్టేష‌న్’ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. సంక్రాంతికి అల్లుళ్లుగా వచ్చిన వెంకీ, వరుణ్ భారీ వసూళ్లు సాధించి బాక్సాఫీసు కొల్లగొట్టారు. ఈ సినిమాకు సీక్వెల్‌గvenkatesh;beauty;venkatesh;mehreen pirzada;anil music;anil ravipudi;devi sri prasad;krishna;prasad;praveen;prince;sriram;tara;varun;varun sandesh;varun tej;india;cinema;f2;producer;blockbuster hit;director;producer1;hero;letter;march;darsakudu;dil;f3;narappaఆయన లేకుండానే F3 సినిమా షూటింగ్ స్టార్ట్....ఆయన లేకుండానే F3 సినిమా షూటింగ్ స్టార్ట్....venkatesh;beauty;venkatesh;mehreen pirzada;anil music;anil ravipudi;devi sri prasad;krishna;prasad;praveen;prince;sriram;tara;varun;varun sandesh;varun tej;india;cinema;f2;producer;blockbuster hit;director;producer1;hero;letter;march;darsakudu;dil;f3;narappaThu, 17 Dec 2020 16:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది "F2" సినిమా.. విక్టరీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ‘ఫ‌న్ అండ్ ఫ్రస్టేష‌న్’ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. సంక్రాంతికి అల్లుళ్లుగా వచ్చిన వెంకీ, వరుణ్ భారీ వసూళ్లు సాధించి బాక్సాఫీసు కొల్లగొట్టారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘F3’ను రూపొందిస్తామని అప్పుడే చిత్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ప్రకటించడం జరిగింది..

ఇటీవల విక్టరి వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ‘F3’ కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమాను హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సీక్వెల్‌కు కూడా అనిల్ రావిపూడే దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు స‌మ‌ర్పణ‌లో శిరీష్ నిర్మిస్తున్నారు. ‘F2’లో అలరించిన వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్‌, త‌మ‌న్నా, మెహ్రీన్ ఈ సీక్వెల్‌లోనూ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు వున్నాయి.అయితే, ఈ సినిమా  ప్రారంభోత్సవంలో వెంకటేష్ పాల్గొనలేదు. ప్రస్తుతం ఆయన ‘నారప్ప’ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో కుదరలేదు. అలాగే, మెహ్రీన్ కూడా హాజరవ్వలేదు.

 వరుణ్ తేజ్, తమన్నాలపై చిత్రీకరించిన ముహూర్తపు స‌న్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ క్లాప్ కొట్టగా, ఫైనాన్సియ‌ర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత దిల్‌ రాజు గౌర‌వ ద‌ర్శక‌త్వం వ‌హించారు.ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఎస్.కృష్ణ రచనా సహకారం అందించారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.ఎస్. ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్. తమ్మిరాజు ఎడిటర్. ఆదినారాయణ, నారా ప్రవీణ్ అడిషనల్ స్క్రీన్‌ప్లే అందించారు.

 అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘ఫ‌న్ అండ్ ఫ్రస్టేష‌న్ కాంబినేష‌న్‌ను వెంక‌టేష్-త‌మ‌న్నా, వ‌రుణ్‌ తేజ్‌-మెహ్రీన్ జోడీల కాంబినేష‌న్‌తో హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మార్చి తెరకెక్కించిన ‘F2’ బ్లాక్‌బ‌స్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మోర్ ఫ‌న్‌ను యాడ్ చేసి ‘F3’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అద్భుత‌మైన క‌థ కుదిరింది. మ‌రోసారి వెంకటేష్, వ‌రుణ్ తేజ్‌, త‌మ‌న్నా, మెహ్రీన్ మిమ్మల్ని న‌వ్వుల్లో ముంచెత్తుతారు. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో మ‌రోసారి వ‌ర్క్ చేయ‌డం ఎంతో హ్యాపీగా ఉంది’’ అని అన్నారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరిన్నో విషయాలు తెలుసుకోండి...


లోకేష్ కి ఫాలోయింగ్ పెరుగుతుందా..ఏంటీ స్పందన..?

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?

వాళ్ళు ఒప్పుకుంటే.. నేను రాజీనామా చేస్తా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..?

అంచనాలు పెంచేస్తోన్న విశాల్ ‘ఎనిమీ’ ఫస్ట్ లుక్

పెళ్లి పేరుతో అది చేయడం తప్పు కాదట.. హైకోర్టు సంచలన తీర్పుః

సలార్ తర్వాత ‘భగీరా’.. పోస్టర్ అదుర్స్!

మరో టాలీవుడ్ రీమేక్‌పై బాలీవుడ్ హీరో కన్ను!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>