PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news7b31de45-ac61-4ad5-b442-dfe49ad5b044-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news7b31de45-ac61-4ad5-b442-dfe49ad5b044-415x250-IndiaHerald.jpgకొత్తగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ఏమాత్రం అనుకూలంగా లేవంటూ రైతు సంఘాలు వాటిని రద్దు చేయాలని ఉద్యమం చేపట్టాయి.అయితే డిల్లీ అసెంబ్లీలో కేంద్రం తీసుకొచ్చిన ఈ వివాదస్పద వ్యవసాయ చట్టాల కాపీలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చించేశారు . అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా సభలో వ్యవసాయ చట్టాలపై చర్చ కార్యక్రమం జరిగింది. latest news;allu aravind;delhi;bharatiya janata party;arvind kejriwal;government;chief minister;assembly;army;central government;nijamకొత్త వ్యవసాయ చట్టాలను అసెంబ్లీలోనే చించేసిన కేజ్రీవాల్ ..!!కొత్త వ్యవసాయ చట్టాలను అసెంబ్లీలోనే చించేసిన కేజ్రీవాల్ ..!!latest news;allu aravind;delhi;bharatiya janata party;arvind kejriwal;government;chief minister;assembly;army;central government;nijamThu, 17 Dec 2020 20:00:00 GMTముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చించేశారు . అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా సభలో వ్యవసాయ చట్టాలపై చర్చ కార్యక్రమం జరిగింది.

అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఈ చట్టాలపై డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘‘భాజపా ప్రభుత్వం బ్రిటిషర్ల కంటే దారుణంగా తయారైయ్యింది’’ అంటూ మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన ప్రతులను చించేశారు.దీంతో సభలోని సభ్యులు గట్టిగా బల్లలు చరుస్తూ కేజ్రీవాల్‌కు సంఘీభావం పలికారు. అసెంబ్లీ సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో బి‌జే‌పి ప్రభుత్వంపై మండిపడ్డారు.ఆయన మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఈ నూతన చట్టాలను చించేస్తున్నాను అని అన్నారు.అంతే కాకుండా కేంద్రం ప్రవేశ పెట్టిన ఈ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీలుకోవలని హెచ్చరించారు.

బి‌జే‌పి ప్రభుత్వం బ్రిటిషర్ల కంటే కూడా దారుణంగా తయారైయ్యిందని విమర్శించారు.కొత్త రైతు చట్టాలు రైఃతుకు ఎంతో ఉపయోగకరం అని కేంద్రం చెబుతుందని, నిజంగా ఈ చట్టాల వల్ల అంతా ఉపయోగమే ఉంటే రైతులు ఎందుకు నిరసన చేస్తున్నారు అంటూ కేజ్రీవాల్ మండిపడ్డారు. కొంత మంది బీజేపీ నేతలు రైతులను దేశద్రోహులు అంటున్నారు. చాలా మంది మాజీ ఆర్మీ ఉద్యోగులు, గాయకులు, సెలబ్రిటీలు, డాక్లర్లు, ట్రైడర్లు వారికి మద్దతు ఇస్తున్నారు. వీళ్లు కూడా దేశద్రోహులేనా? జాగ్రత్త.. ప్రతి రైతు ఒక భగత్‌సింగ్‌లా తయారవుతున్నారు’’ అని కేజ్రీవాల్ అన్నారు.రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.రద్దు చేయకపోతే భాజపా ప్రభుత్వం రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించాడు.


చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?

వాళ్ళు ఒప్పుకుంటే.. నేను రాజీనామా చేస్తా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>