EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/amitshah-bjp-jagan-ycp-amaravati-vizag-highcourtedeb9980-1d6c-4c75-8726-12a07dbfd76f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/amitshah-bjp-jagan-ycp-amaravati-vizag-highcourtedeb9980-1d6c-4c75-8726-12a07dbfd76f-415x250-IndiaHerald.jpgఇంతకీ విషయం ఏమిటంటే కర్నూలుకు న్యాయ రాజధాని అనే ప్రతిపాదనను వివరించారట. కాబట్టి హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వాలంటూ అమిత్ ను జగన్ విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ బీజేపీ మ్యానిఫెస్టోను జగన్ కేంద్రమంత్రికి గుర్తు చేశారు. 2019 ఎన్నికల సందర్భంగా బీజేపీ రిలీజ్ చేసిన మ్యానిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హీమీనే ఇపుడు జగన్ గుర్తుచేశారట. 2019 ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీని తాను అమలుచేస్తున్న విషయాన్ని జగన్ ప్రత్యేకంగా అమిత్ తో ప్amitshah bjp jagan ycp amaravati vizag highcourt;view;amit shah;amala akkineni;delhi;visakhapatnam;bharatiya janata party;telugu desam party;jagan;amaravati;amith shah;2019;high court;telugu;kurnool;vishakapatnam;lotus;capital;court;minister;central government;ycp;u turn;reddy;partyహెరాల్డ్ ఎడిటోరియల్ : అమిత్ నే జగన్ ఇంతలా ఇరుకున పెట్టాడా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : అమిత్ నే జగన్ ఇంతలా ఇరుకున పెట్టాడా ?amitshah bjp jagan ycp amaravati vizag highcourt;view;amit shah;amala akkineni;delhi;visakhapatnam;bharatiya janata party;telugu desam party;jagan;amaravati;amith shah;2019;high court;telugu;kurnool;vishakapatnam;lotus;capital;court;minister;central government;ycp;u turn;reddy;partyThu, 17 Dec 2020 03:00:00 GMTఢిల్లీ టూరులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నే  జగన్మోహన్ రెడ్డి ఇరుకున పెట్టేశారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదన అమలుకు జగన్ గట్టిగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో అధికార పార్టీ ఒకవైపుంటే మిగిలిన ప్రతిపక్షాలన్నీ మరోవైపున్నాయి.  అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ ప్రతిపక్షాలన్నీ పట్టుబడుతున్న విషయం అందరు చూస్తున్నదే. జగన్ ప్రతిపాదన ప్రకారం వైజాగ్ లో పరిపాలనా రాజధాని, అమరావతిలో శాసనరాజధాని, కర్నూలులో న్యాయరాజధాని అనే కాన్సెప్టు జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. సరే ఇదే విషయమై ప్రస్తుతం హై కోర్టులో కేసుల విచారణ జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీకి వెళ్ళిన జగన్ అమిత్ షా తో దాదాపు 45 నిముషాలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన చర్చలో జగన్ హోంమంత్రిని ఇరుకున పెట్టేశారని అంటున్నారు.




ఇంతకీ విషయం ఏమిటంటే కర్నూలుకు న్యాయ రాజధాని అనే ప్రతిపాదనను వివరించారట. కాబట్టి హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వాలంటూ అమిత్ ను జగన్ విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ బీజేపీ మ్యానిఫెస్టోను జగన్ కేంద్రమంత్రికి గుర్తు చేశారు. 2019 ఎన్నికల సందర్భంగా బీజేపీ రిలీజ్ చేసిన మ్యానిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హీమీనే ఇపుడు జగన్ గుర్తుచేశారట. 2019 ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీని తాను అమలుచేస్తున్న విషయాన్ని జగన్ ప్రత్యేకంగా అమిత్ తో ప్రస్తావించారు. కాబట్టి ఇపుడు జగన్ ప్రతిపాదనకు అమిత్ ప్రత్యేకంగా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు.





మొత్తానికి జగన్ పక్కా వ్యూహంతోనే అమిత్ దగ్గర పావులు కదిపినట్లే అర్ధమవుతోంది. జగన్ ప్రతిపాదనను కాదంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై  తామిచ్చిన హామీని  తామే తుంగలో తొక్కినట్లవుతుంది. అలాని జగన్ ప్రతిపాదన ప్రకారం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేస్తే మొత్తం క్రెడిట్ అంతా జగన్ కు వెళుతుందే కానీ బీజేపీకేమీ రాదు. పైగా ప్రతిపక్షాలు భవిష్యత్తులో నోరెత్తేందుకే ఉండదు. ప్రతిపక్షాల్లో ముందుగా దెబ్బతినేది బీజేపీనే. తెలుగుదేశంపార్టీ మొదటినుండి జగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తునే ఉంది. అయితే ఇన్నిరోజులు జగన్ ప్రతిపాదనకు మద్దతిచ్చి తాజాగా యూటర్న్ తీసుకుని అడ్డం తిరిగింది బీజేపీ మాత్రమే. అంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు జగన్ అడిగినట్లు కేంద్రం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేస్తే ఇక రాష్ట్ర బీజేపీ మళ్ళీ నోరెత్తేందుకుండదు. అందరిముందు కమలంపార్టీ అబాసుపాలవ్వటం ఇంకేమీలేదు. మొత్తంమీద జగన్ తాజా ప్రతిపాదనతో అమిత్ ఇరుకున పడినట్లే ఉంది చూస్తుంటే.




కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న బుట్ట బొమ్మ.. ఫొటో చూస్తే మంటలే..

కమల్ హాసన్‌కు షాకిచ్చిన ఈసీ.. ఊరుకోమంటున్న విశ్వనటుడు

ఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులు

నిర్భయ తల్లి సంచలన ప్రతిజ్ఞ

రకుల్‌కు ఇల్లు కొనిచ్చిన రాజకీయ నేత? దీనిపై రకుల్ స్పందన ఇదీ!

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>