MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/these-are-the-top-10-most-watched-movies-in-ottfc55d274-643f-4fdb-963e-226629b33a5a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/these-are-the-top-10-most-watched-movies-in-ottfc55d274-643f-4fdb-963e-226629b33a5a-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న సమయంలో థియెటర్లు మూతపడిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఎక్కువ మంది ఓటీటీ వేదిక‌గా ఎంట‌ర్‌టైన్‌మెంట్ కంటెంట్‌ను వీక్షించారు. గతేడాది వరకు సినిమా విడుదలైన రెండు నెలలకు కానీ ఒరిజినల్ ప్రింట్ డిజిటల్ మీడియాలో విడుదల అయ్యేది కాదు.ott;view;nani;rana;abhishek bachchan;akshay kumar;amitabh bachchan;kumaar;sushant singh;abhishek;akshay;jyothika;lakshmi;nayantara;sudha;sudigali sudheer;surya sivakumar;sushanth;vidya;janvi;cinema;telugu;amazon;sri venkateswara swamy;tamil;electricity;audience;blockbuster hit;remake;kanchana;wife;comedian;thief;ayushman khurana;research and analysis wing;lie;hafiz saeed;sudha k prasad;jhanvi kapoor;donga;v;dil;shakti;raccha;coronavirus;fidaaఓటిటిలో ఎక్కువగా చూసిన టాప్-10 సినిమాలు ఇవే..!?ఓటిటిలో ఎక్కువగా చూసిన టాప్-10 సినిమాలు ఇవే..!?ott;view;nani;rana;abhishek bachchan;akshay kumar;amitabh bachchan;kumaar;sushant singh;abhishek;akshay;jyothika;lakshmi;nayantara;sudha;sudigali sudheer;surya sivakumar;sushanth;vidya;janvi;cinema;telugu;amazon;sri venkateswara swamy;tamil;electricity;audience;blockbuster hit;remake;kanchana;wife;comedian;thief;ayushman khurana;research and analysis wing;lie;hafiz saeed;sudha k prasad;jhanvi kapoor;donga;v;dil;shakti;raccha;coronavirus;fidaaThu, 17 Dec 2020 11:00:00 GMTకరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న సమయంలో థియెటర్లు మూతపడిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఎక్కువ మంది ఓటీటీ వేదిక‌గా ఎంట‌ర్‌టైన్‌మెంట్ కంటెంట్‌ను వీక్షించారు.   గతేడాది వరకు సినిమా విడుదలైన రెండు నెలలకు కానీ   ఒరిజినల్ ప్రింట్ డిజిటల్ మీడియాలో విడుదల అయ్యేది కాదు. కానీ ఈ ఏడాది  కరోనా వ‌ల్ల‌  లాక్ డౌన్ విధించ‌డం,   దాంతో 7 నెలల పాటు థియేటర్లు మూత పడటంతో దర్శక నిర్మాతల ఆలోచనలు కూడా మారిపోయాయి. తమ సినిమాలను థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుద‌ల చేశారు.

ఇక దిల్ బేచారా సినిమా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన 40 రోజుల తర్వాత అంటే జులై 24న హాట్ స్టార్‌లో విడుదలైన ఈ సినిమాను దేశంలోనే అత్యంత ఎక్కువ మంది చూసారు.  సూర్య హీరోగా సుధ కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం ఆకాశం నీ హద్దురా. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సంచలన విజయం సాధించింది. అతి ఎక్కువ మంది చూసిన లిస్టులో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.

లూడో థియేటర్స్ లో విజయం లేని అభిషేక్ బచ్చన్.. ఓటిటిలో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అనురాగ్ బసు తెరకెక్కించిన లూడో సెన్సేషనల్ హిట్ అయింది. లక్ష్మి కాంచన రీమేక్ గా వచ్చిన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినా కూడా అక్షయ్ కుమార్ స్టార్ ఇమేజ్ తో ఓటిటిలో రచ్చ చేసింది. గుంజన్ సక్సేనా: యావరేజ్ టాక్ తోనే ఓపెన్ అయినా కూడా ఇండియాలో అత్యధిక మంది చూసిన లిస్టులో జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనా ఐదో స్థానంలో నిలిచింది.

ఖుదా హఫీజ్: శక్తి సినిమాలో విలన్ గా నటించిన విద్యుత్ జమాల్ గుర్తున్నాడు కదా.. ఈయన హీరోగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. గులాబో సితాబో: ఇండియాలో ఓటిటి ఫార్మాట్ లో విడుదలైన తొలి భారీ సినిమా ఇదే. అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన ఈ చిత్రాన్ని సుజీత్ సిర్కార్ తెరకెక్కించాడు. దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది.

మూకుతీ అమ్మాన్: నయనతార హీరోయిన్‌గా తమిళ స్టార్ కమెడియన్ ఆర్జే బాలాజీ దర్శకుడిగా మారి తెరకెక్కించాడు. దొంగ బాబాలపై సెటైరికల్‌గా వచ్చిన ఈ చిత్రానికి భారీ వ్యూస్ వచ్చాయి. v మూవీ: తెలుగులో ఓటిటిలో విడుదలైన తొలి భారీ సినిమా ఇదే. నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ చిత్రం   వ్యూస్ బాగానే వచ్చాయి. పొన్మగళ్ వందాల్: ఈ సినిమా విషయంలో తమిళనాట చాలా గొడవలు జరిగాయి. సూర్య భార్య జ్యోతిక హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఓటిటిలో విడుదల చేయకూడదని గోల చేసినా సూర్య మాత్రం తన నిర్ణయం తాను తీసుకున్నాడు.


ఎర్రచందనం స్మగ్లర్ల ప్లాన్

మ‌త్స్య‌కారుల మ‌ధ్య చిచ్చు... చ‌లిమంట‌లు కాచుకుంటోన్న ప్ర‌కాశం ఫ్యాక్ష‌నిస్టు..!

తెలుగులో బిజి అయిపోతున్న స‌ముద్ర‌ఖ‌ని... మ‌రో సినిమాకు ఒప్పేసుకున్నారుగా

ఒక కేసుకు రెండు కేసులు.. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తాం..?

అమరావతి ఉద్యమానికి ఏడాది

సలార్ కోసం మోహన్ లాల్ మరీ ఇంత బెట్టు చేయాలా..?

అమరావతి ఉద్యమం...అసలైన తీర్పు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>