PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exministerjoininbarateyajanathapartyc3044d11-9d4c-4ff0-89f2-df8a5739f8d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exministerjoininbarateyajanathapartyc3044d11-9d4c-4ff0-89f2-df8a5739f8d2-415x250-IndiaHerald.jpgఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రంలో మాత్రం అధ్వానంగా మారింది. కాంగ్రెస్ రెండుసార్లు అధికారాన్ని చేజార్చుకోవడంతో కాంగ్రెస్ లోని నేతలంతా ఇతర పార్టీలో వెళుతున్నారు. దీంతో ఆ పార్టీ రాష్ట్రంలో బలహీనంగా మారినట్లు కన్పిస్తోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కాంగ్రెస్ లోని కీలకమైన నేతలు ఆ పార్టీలోకి వెళ్లారు. ఇక ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో.. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. ఇదే సమయంలో బీజేపీ హవా కొనసాగింది. టీఆర్ఎస్bjp;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;minister;letter;thota chandrasekhar;josh;party;mantraబీజేపీలో చేరుతున్న మాజీ మంత్రి..!బీజేపీలో చేరుతున్న మాజీ మంత్రి..!bjp;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;minister;letter;thota chandrasekhar;josh;party;mantraThu, 17 Dec 2020 09:15:04 GMTబీజేపీలో చేరుతున్న మాజీ మంత్రి..!

ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రంలో మాత్రం అధ్వానంగా మారింది. కాంగ్రెస్ రెండుసార్లు అధికారాన్ని చేజార్చుకోవడంతో కాంగ్రెస్ లోని నేతలంతా ఇతర పార్టీలో వెళుతున్నారు. దీంతో ఆ పార్టీ రాష్ట్రంలో బలహీనంగా మారినట్లు కన్పిస్తోంది.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కాంగ్రెస్ లోని కీలకమైన నేతలు ఆ పార్టీలోకి వెళ్లారు. ఇక ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో.. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. ఇదే సమయంలో బీజేపీ హవా కొనసాగింది.

టీఆర్ఎస్ కు ధీటుగా రాష్ట్రంలో బీజేపీ ఎదగడంతో కాంగ్రెస్ లోని నేతలంతా బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కు చెందిన రాష్ట్ర స్థాయి నేతలు.. మాజీ మంత్రులు.. ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. రోజురోజుకు ఈ క్యూ భారీగా పెరిగిపోతుంది.

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈనెల 28న బీజేపీ చేరుతున్నట్లు చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ను వీడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆపార్టీని మరింత దిగజార్చేలా ఉన్నాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అయ్యే పరిస్థితి ఉందని.. ఆ పార్టీలో అన్ని కులాల వారికి న్యాయం జరగడం చంద్రశేఖర్ ఆరోపించారు. మరోవైపు బీజేపీకి ప్రజలంతా ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ ను వీడుతున్న ముఖ్య నేతలే ఆపార్టీని దిగజార్చేలా మాట్లాడుతుండటం బీజేపీలో జోష్ నింపుతున్నారు. మరోవైపు టీపీసీసీపై కాంగ్రెస్ నాన్చుడు ధోరణి అవలంభిస్తుండటం కూడా రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఎంతలా దిగజారిందో స్పష్టం చేస్తోంది




కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న బుట్ట బొమ్మ.. ఫొటో చూస్తే మంటలే..

కమల్ హాసన్‌కు షాకిచ్చిన ఈసీ.. ఊరుకోమంటున్న విశ్వనటుడు

ఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులు

నిర్భయ తల్లి సంచలన ప్రతిజ్ఞ

రకుల్‌కు ఇల్లు కొనిచ్చిన రాజకీయ నేత? దీనిపై రకుల్ స్పందన ఇదీ!

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>