Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpgప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలు అందరికీ కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలోనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కూడా పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణాన్ని శరవేగంగా చేపడుతుంది అన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఇప్పటికే కొharish;telangana;minister;partyడబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తాం.. అలా చేస్తే మళ్లీ తీసుకుంటాం : మంత్రి హరీష్డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తాం.. అలా చేస్తే మళ్లీ తీసుకుంటాం : మంత్రి హరీష్harish;telangana;minister;partyThu, 17 Dec 2020 15:00:00 GMTతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలు  అందరికీ కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలోనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టాలనే  ఉద్దేశంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కూడా పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణాన్ని శరవేగంగా చేపడుతుంది అన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.



 ఇక ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం భారీగానే నిధులను కేటాయించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. అయితే పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వగా కొంతమంది మాత్రం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తప్పుగా వాడుకుంటున్నారు అన్నది అర్థమవుతుంది. కొంతమంది తమకు అవసరం లేకున్నప్పటికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పొందినవారు ఆయా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వాడకుండా..  వాటిని అద్దెకు ఇవ్వడం లేదా అమ్మి  వేయడం లాంటివి చేస్తున్నారు...  లబ్ధిదారులు ఎంతో మంది ఇలా చేస్తున్నారు అని గుర్తించి ఇటీవలే మంత్రి హరీష్ రావు హెచ్చరికలు జారీ చేశారు.



 ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పొందిన వారు ఆ ఇళ్లను విక్రయించడం గాని లేదా అద్దెకు ఇవ్వడం గానీ చేయకూడదు అని సూచించారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు.  ఒకవేళ ప్రభుత్వం పెట్టిన నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ఇల్లు అద్దెకిచ్చిన లేదా అమ్మాలని  ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకుంటాము అంటూ హెచ్చరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు... ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా మళ్ళీ తిరిగి తీసుకుంటాము అంటూ మంత్రి హరీష్ రావు హెచ్చరిక జారీ చేశారు.


హైకోర్టులో జగన్ సర్కార్ పిటీషన్ పై ఎస్ఈసీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు!

"జనభేరి" సభకు భయపడుతున్న "జగన్ సర్కార్'.. !!

అనుపమ వెంట 8 మిలియన్ ఫాలోవర్స్.. అమ్మడు ఏం చేసిందో తెలుసా..?

టి కాంగ్రెస్ రాజకీయం: రేవంత్ రెడ్డి మరో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానున్నాడా...?

తెలంగాణ పై బీజేపీ ఫోకస్

120 దేశాలు.. మూడు భాషలు.. మొదటి టెస్ట్ అరుదైన రికార్డ్..?

జనాలను భయపెడుతున్న ఆటోలు.. అసలు కారణం ఇదే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>