PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/police-protection-for-amaravathi-sabha5c728b04-76ae-47d7-94e3-071beb5e8e9f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/police-protection-for-amaravathi-sabha5c728b04-76ae-47d7-94e3-071beb5e8e9f-415x250-IndiaHerald.jpgఅమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ‘అమరావతి రక్షణకై జనభేరి’ పేరుతో రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభకు 20 వేల మందికిపైగా హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. సభ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని అమరావతి పరిక్షణ సమితి నేతలు తెలిపారు. చంద్రబాబు సహా ఇతర పార్టీల ప్రతినిధులు ఈ జనభేరి సభకు వస్తారని అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం భారీగా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. amaravathi sabha;ram gopal varma;amaravati;police;capitalఅమరావతి సభలో అరాచక శక్తులా..?అమరావతి సభలో అరాచక శక్తులా..?amaravathi sabha;ram gopal varma;amaravati;police;capitalThu, 17 Dec 2020 09:00:00 GMTఅమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ‘అమరావతి రక్షణకై జనభేరి’ పేరుతో రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభకు 20 వేల మందికిపైగా హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. సభ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని అమరావతి పరిక్షణ సమితి నేతలు తెలిపారు. చంద్రబాబు సహా ఇతర పార్టీల ప్రతినిధులు ఈ జనభేరి సభకు వస్తారని అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం భారీగా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

సభ నిర్వహణకు పోలీసులు అనుమతులిచ్చినా.. శాంతి భద్రతల దృష్ట్యా పలు ఆంక్షలు విధించారు. అల్లర్లకు దూరంగా.. ప్రశాంత వాతావరణంలో సభ నిర్వహించాల్సిన పూర్తి బాధ్యతను నిర్వాహకులదేనని తేల్చిచెప్పారు గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ. శాంతియుతంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను రాజ్యంగం భారత పౌరులకు ఇచ్చిందని.. ఇతరులకు అసౌకర్యం, ఇబ్బందులు కలుగకుండా ఈ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సభకు పోలీస్‌ శాఖ నుంచి అన్ని సహకారాలు ఉంటాయన్నారు. ఉద్దేశపూర్వకంగా కొందరు అల్లర్లు, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్నట్టుగా తమకు ముందస్తు సమాచారం అందిందని చెప్పారు డీఐజీ. అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే నిర్వాహకులను బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అల్లర్లు జరిగే అవకాశమున్నట్టు తేలడంతో ఆయా ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు అదనపు బలగాలను సిద్ధంగా ఉంచారు అధికారులు. విధిగా ప్రతి ఒక్కరూ కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సభలో పాల్గొనాలని సూచించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే సభ, ర్యాలీ కార్యక్రమాలను అనుమతిస్తామన్నారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు ఎస్పీ విశాల్‌గున్నీ. కరకట్టపై ముఖ్య అధికారులు, జడ్జిలు, అత్యవసర సేవలకు వినియోగించే వాహనాలకు అనుమతి ఉంటుదన్నారు. ఇతర జిల్లాల నుంచి ఎక్కువ మందిని సమీకరించకుండా జాగ్రత్తలు పాటించేలా నిర్వహకులకు అనుమతులు ఇచ్చామన్నారు. 


అమరావతిలో భారీ బహిరంగ సభ...!

కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న బుట్ట బొమ్మ.. ఫొటో చూస్తే మంటలే..

కమల్ హాసన్‌కు షాకిచ్చిన ఈసీ.. ఊరుకోమంటున్న విశ్వనటుడు

ఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులు

నిర్భయ తల్లి సంచలన ప్రతిజ్ఞ

రకుల్‌కు ఇల్లు కొనిచ్చిన రాజకీయ నేత? దీనిపై రకుల్ స్పందన ఇదీ!

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>