PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/osmania-universityf05d0c3e-ebdc-48d7-a2b7-b06971b8aa39-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/osmania-universityf05d0c3e-ebdc-48d7-a2b7-b06971b8aa39-415x250-IndiaHerald.jpgఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్శిటీలో అలజడి రేగింది. విద్యార్థి నేత సురేష్ యాదవ్ పై జరిగిన దాడితో క్యాంపస్ నివురు గప్పిన నిప్పులా మారింది. దాడికి పాల్పడిన దుండగులను అరెస్ట్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఓయూ విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో క్యాంపస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొందిosmania university;kcr;suresh;suman;tiru;vedhika;telangana rashtra samithi trs;balka suman;telangana;university;mla;fire;arrest;traffic police;partyకేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూకేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూosmania university;kcr;suresh;suman;tiru;vedhika;telangana rashtra samithi trs;balka suman;telangana;university;mla;fire;arrest;traffic police;partyThu, 17 Dec 2020 19:27:42 GMTసురేష్ యాదవ్ పై జరిగిన దాడితో క్యాంపస్ నివురు గప్పిన నిప్పులా మారింది. దాడికి పాల్పడిన దుండగులను అరెస్ట్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఓయూ విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో క్యాంపస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. కేసీఆర్ సర్కార్ పై ఓయూ విద్యార్థులు తిరుగుబాటుకు సిద్దమవుతున్నారనే సమాచారం వస్తోంది. దీంతో ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంతో దద్దరిల్లిన ఉస్మానియా గడ్డ.. కేసీఆర్ సర్కార్ పై పోరాటానికి వేదిక కానుందని తెలుస్తోంది.

                   
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో బుధవారం అర్ధరాత్రి సురేష్ యాదవ్ అనే విద్యార్థి నాయకుడిపై దాడి జరగడంకలకలం రేపుతోంది. సురేష్ యాదవ్ రాత్రి భోజనం చేసి రూమ్‌లో పడుకునే సమయంలో  సుమారు 20 మంది మారణాయుధాలతో  అతనిపై దాడిచేశారు. వారి నుంచి తప్పించుకున్న సురేష్ యాదవ్.. ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనను కొట్టడానికి 20 మంది రావడంతో  రూమ్ నుంచి బయటకు వచ్చి రీసెర్చ్ సెంటర్ వద్ద చెట్లల్లో దాక్కున్నానని సురేష్ యాదవ్ చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఛానల్ డిబేట్‌లో మాట్లాడినందుకే అతనిపై దాడి చేశారని చెబుతున్నారు.  టీఆర్ఎస్ నేత , చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి.

విద్యార్ధి సమస్యలపై ప్రశ్నించినందుకే తనను టార్గెట్ చేశారని.. మా బాల్కసుమన్ అన్ననే కాదు.. టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే నిన్నే కాదు ఎవరినైనా చంపుతాం అనుకుంటూ  రూమ్‌లోకి బీర్ సీసాలు విసురుకుంటూ వెళ్లిపోయారని సురేష్ తెలిపారు. వారంతా వెళ్లిపోయిన తర్వాత ఉస్మానియా క్యాంపస్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి వారిపై ఫిర్యాదు చేశానని, తనకు ఎమ్మెల్యే బాల్క సుమన్ నుంచి ప్రాణ హాని ఉందని సురేష్ యాదవ్ వాపోయారు. తనపై దాడి చేసిన దుండగులను తక్షణమే  అరెస్టు చేసి తనకు న్యాయం చేయాలని  సురేష్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు.

విద్యార్థి నేత సురేష్ యాదవ్‌పై జరిగిన దాడి ఉస్మానియా యూనివర్శిటీలో ప్రకంపనలు రేపుతోంది. నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటూ కొంత కాలంగా సురేష్ యాదవ్ పోరాడుతున్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి వివిధ న్యూస్ చానెళ్లు నిర్వహిస్తున్న చర్చా కార్యాక్రమాల్లో పాల్గొంటూ కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తున్నారు. ఇదే అధికార పార్టీ నేతలకు కంటగింపుగా మారిందంటున్నారు. ప్రశ్నించే గొంతుకను నులిమివేయాలని ఉద్దేశ్యంతోనే అతనిపై దాడి చేశారని ఓయూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. తక్షణమే బాల్కసుమన్ అనుచరులను అరెస్టు చేయాలి అని ఆయన డిమాండు చేస్తున్నాయి.






చంద్రబాబు వె... గాలి... పిచ్చి కుక్కలా కనకదుర్గమ్మ మార్చింది: కొడాలీ నానీ వివాదాస్పద వ్యాఖ్యలు

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?

వాళ్ళు ఒప్పుకుంటే.. నేను రాజీనామా చేస్తా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>