PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdpa8ec283a-cb6a-4cf2-b02d-4baffeca96aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdpa8ec283a-cb6a-4cf2-b02d-4baffeca96aa-415x250-IndiaHerald.jpgగ‌త ఏడాది ఎన్నిక‌ల్లో మాత్రం ఆమె ప‌రాజ‌యం పాల‌య్యారు. అంటే... మొత్తంగా టీడీపీతో అను బంధం అఖిల ప్రియ‌కు ఐదేళ్లు మాత్ర‌మే. అయినప్ప‌టికీ.. ఆమె ఓ రేంజ్‌లో దూసుకువెళ్తున్నారు. నిరం తరం మీడియాలో ఉంటున్నారు. అంతేకాదు.. జిల్లా రాజ‌కీయాల్లో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌భు త్వ విధానాల‌ను ఎండ‌గ‌డుతున్నారు. టీడీపీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హిస్తున్నారు. ఎక్క‌డైనా ఏవిష‌య‌మైనా.. కూడా దూకుడుగానే ఉన్నారు. దీంతో పార్టీ ప‌రిస్థితిలో ఎలాంటి కుంగుబాటు క‌నిపిం చ‌డం లేదు. tdp;thirtha;district;bhuma akhila priya;minister;letter;tdp;ycp;father;dookudu;partyటీడీపీలో ఆ మ‌హిళా నేతే బెట‌రా... !టీడీపీలో ఆ మ‌హిళా నేతే బెట‌రా... !tdp;thirtha;district;bhuma akhila priya;minister;letter;tdp;ycp;father;dookudu;partyThu, 17 Dec 2020 13:17:26 GMTటీడీపీ నేత‌ల్లో ఆమే బెట‌రా..?  మిగిలిన ‌వారికంటే..కూడా ఆమే దూకుడుగా ఉన్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రాజ‌కీయంగా సుదీర్ఘ చ‌రిత్ర ఉన్న భూమా కుటుంబం నుంచి వ‌చ్చిన భూమా అఖిల ప్రియ‌.. దూకుడు మామూలుగా లేద‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆళ్లగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి.. ఓడిపోయారు అఖిల ప్రియ‌. 2014లో అనూహ్య‌రీతిలో రాజ‌కీయా ల్లోకి వ‌చ్చిన అఖిల ప్రియ‌.. ఆళ్ల‌గ‌డ్డ‌లో విజ‌యం సాధించారు. త‌ర్వాత తండ్రి బాట‌లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమెకు మంత్రి పీఠం కూడా దక్కింది.

అయితే.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో మాత్రం ఆమె ప‌రాజ‌యం పాల‌య్యారు. అంటే... మొత్తంగా టీడీపీతో అను బంధం అఖిల ప్రియ‌కు ఐదేళ్లు మాత్ర‌మే. అయినప్ప‌టికీ.. ఆమె ఓ రేంజ్‌లో దూసుకువెళ్తున్నారు. నిరం తరం మీడియాలో ఉంటున్నారు. అంతేకాదు.. జిల్లా రాజ‌కీయాల్లో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌భు త్వ విధానాల‌ను ఎండ‌గ‌డుతున్నారు. టీడీపీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హిస్తున్నారు. ఎక్క‌డైనా ఏవిష‌య‌మైనా.. కూడా దూకుడుగానే ఉన్నారు. దీంతో పార్టీ ప‌రిస్థితిలో ఎలాంటి కుంగుబాటు క‌నిపిం చ‌డం లేదు.

పైగా అఖిల ప్రియ చుట్టూనే.. రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. వాస్త‌వానికి జిల్లాకు చెందిన టీడీపీ నేత‌ల ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. చాలా మంది సీనియ‌ర్లు ఉన్నారు. అంతేకా దు... టీడీపీలో అనేక ప‌ద‌వులు కూడా అందిపుచ్చుకున్న‌వారు ఉన్నారు. కానీ, పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయే స‌రికి మాత్రం వారు ఎవ‌రికి వారుగా ఉన్నారు. త‌మ వ్యాపారాలు , వ్య‌వ‌హారాల్లో మునిగి తేలుతున్నారు. మ‌రికొంద‌రు కేసుల భ‌యంతో అల్లాడుతున్నారు.

దీంతో పార్టీని ప‌ట్టించుకునే నాయ‌కులు టీడీపీలో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఈ స‌మ‌యంలో అఖిల ప్రియ చేస్తున్న రాజ‌కీయాలు.. చాలా వ‌ర‌కు పార్టీలో బ‌లాన్ని పెంచ‌డ‌మే కాకుండా.. వైసీపీ నేత‌ల‌కు కూడా చుక్క‌లు చూపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఆమె స్ఫూర్తితో అయినా మిగిలిన టీడీపీ నేత‌ల్లో క‌ర‌కు వ‌స్తుందేమో ?  చూడాలి.




రజనీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. పార్టీ గుర్తు అది కాదా?

అనుపమ వెంట 8 మిలియన్ ఫాలోవర్స్.. అమ్మడు ఏం చేసిందో తెలుసా..?

టి కాంగ్రెస్ రాజకీయం: రేవంత్ రెడ్డి మరో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానున్నాడా...?

తెలంగాణ పై బీజేపీ ఫోకస్

120 దేశాలు.. మూడు భాషలు.. మొదటి టెస్ట్ అరుదైన రికార్డ్..?

జనాలను భయపెడుతున్న ఆటోలు.. అసలు కారణం ఇదే..?

మ‌త్స్య‌కారుల మ‌ధ్య చిచ్చు... చ‌లిమంట‌లు కాచుకుంటోన్న ప్ర‌కాశం ఫ్యాక్ష‌నిస్టు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>