PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ck-kcr-planing-to-strength-congress-in-telangana1f918f8b-0c49-49ab-8655-0f43a0a41487-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ck-kcr-planing-to-strength-congress-in-telangana1f918f8b-0c49-49ab-8655-0f43a0a41487-415x250-IndiaHerald.jpg రాజకీయ వ్యూహాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను దిట్ట అంటుంటారు. కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు ఎవరికి అందకుండా ఉంటాయనే టాక్ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో తమకు ఇబ్బందిగా పరిస్థితులు ఉన్నాయని భావిస్తే.. వెంటనే కొత్త ఎత్తులు వేస్తుంటారు గులాబీ బాస్. దుబ్బాక ఓటమి, గ్రేటర్ లో బీజేపీ దూకుడుతో కేసీఆర్ కొత్త వ్యూహాలకు పదును పెట్టారని చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతమే కేసీఆర్ తాజా లక్ష్యమంటున్నారు.tirupathi;view;amit shah;kcr;nagarjuna akkineni;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;hosta;amith shah;congress;bank;chief minister;dookudu;partyకాంగ్రెస్ బలోపేతానికి కేసీఆర్ స్కెచ్? సాగర్ లో ఆ పార్టీదే విజయమా!కాంగ్రెస్ బలోపేతానికి కేసీఆర్ స్కెచ్? సాగర్ లో ఆ పార్టీదే విజయమా!tirupathi;view;amit shah;kcr;nagarjuna akkineni;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;hosta;amith shah;congress;bank;chief minister;dookudu;partyThu, 17 Dec 2020 08:35:59 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను దిట్ట అంటుంటారు. కేసీఆర్ రాజకీయ  ఎత్తుగడలు ఎవరికి అందకుండా ఉంటాయనే టాక్ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో  తమకు ఇబ్బందిగా పరిస్థితులు ఉన్నాయని భావిస్తే.. వెంటనే కొత్త ఎత్తులు వేస్తుంటారు గులాబీ బాస్. దుబ్బాక ఓటమి, గ్రేటర్ లో బీజేపీ దూకుడుతో కేసీఆర్ కొత్త వ్యూహాలకు పదును పెట్టారని చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతమే కేసీఆర్ తాజా లక్ష్యమంటున్నారు. బీజేపీ బలమైన శక్తిగా ఎదిగినందున కాంగ్రెస్ బలంగా ఉంటేనే తమకు కలిసి వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారట. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉండటం వల్లే బీజేపీకి ప్లస్ అయిందని టీఆర్ఎస్ నేతలు అంచనాకు వచ్చారట. కాంగ్రెస్ గెలిచే అవకాశం కనిపించక పోవడంతో కాంగ్రెస్ కేడర్ తో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా కమలానికి మళ్లినట్లు ఎన్నికల ఫలితాలు కూడా చెబుతున్నాయి.

                    తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కు 30 శాతానికి పైగానే సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఇది 20 శాతానికి పైగానే ఉంటుంది. అయితే దుబ్బాకలో పీసీసీ నేతలంతా శ్రమించినా కాంగ్రెస్ కు 21 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ ఎలాగూ గెలవలేదనే భావనతో హస్తం సానుభూతి పరులు, కేసీఆర్ పని తీరుపై కసిగా ఉన్న జనాలంతా కమలానికి జై కొట్టారని  తేలింది. దుబ్బాకలో దాదాపు 10 శాతం కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి మళ్లాయంటున్నారు. అలాగే గ్రేటర్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటు బ్యాంక్  బీజేపీ వైపు వెళ్లింది. అందుకే జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ కు కేవలం 6 శాతం ఓట్లు వచ్చాయని చెబుతున్నారు. కాంగ్రెస్ బలంగా ఉంటే దుబ్బాకతో పాటు గ్రేటర్ లో మంచి విజయం సాధించే వారమని గులాబీ నేతలు అంటున్నారు. ఈ లెక్కలన్ని బేరీజు వేసుకున్న కేసీఆర్.. ఇలా నరుక్కొస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

               ఢిల్లీలో కేసీఆర్..  అమిత్ షా సహా బీజేపీ పెద్దలను కలవడంతో కాంగ్రెస్ కు అస్త్రం దొరికినట్లైంది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు  గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయనే వాయిస్ ను కాంగ్రెస్ జనాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. కేసుల కేసుమే కేసీఆర్ బీజేపీతో రాజీ పడ్డారని, కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన బీజేపీ కూడా ఇప్పుడు ఆయనతో ఫ్రెండ్ షిప్ చేస్తుందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. ఇవన్ని కాంగ్రెస్ బలపడానికి పనికొచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ కూడా ఇదే కోరుకుంటున్నారని రాజకీయ వర్గాల అభిప్రాయం. కాంగ్రెస్ బలపడితే కారు పార్టీకే ప్రయోజనం ఉంటుందని వారు చెబుతున్నారు. అందుకే నోముల నర్సింహయ్య మరణంతో త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను కేసీఆరే గెలిపించినా అశ్చర్యం లేదంటున్నారు.సాగర్ లో కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ ఆ పార్టీ బలపడుతుంది. దీంతో బీజేపీ దూకుడు తగ్గి అధికార టీఆర్ఎస్ కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.






వీధుల్లో గొడవపడిన స్టార్ హీరోయిన్ జంట.. అసలు కారణం ఏంటీ..?

కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న బుట్ట బొమ్మ.. ఫొటో చూస్తే మంటలే..

కమల్ హాసన్‌కు షాకిచ్చిన ఈసీ.. ఊరుకోమంటున్న విశ్వనటుడు

ఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులు

నిర్భయ తల్లి సంచలన ప్రతిజ్ఞ

రకుల్‌కు ఇల్లు కొనిచ్చిన రాజకీయ నేత? దీనిపై రకుల్ స్పందన ఇదీ!

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>