MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntra7388190-1156-449d-a8f5-8e2125f08cfc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntra7388190-1156-449d-a8f5-8e2125f08cfc-415x250-IndiaHerald.jpgగత కొద్ది కాలంగా ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ఓ వార్త తెగ చక్కర్లు కొట్టేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ బుల్లితెరపై కనిపించబోతున్నాడు అని సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. మొదట ఇది కేవలం గాసిప్ మాత్రమే అని అందరూ అనుకున్నారు. కానీ.. జూనియర్ ఎన్టీఆర్ మరోసారి నిజంగానే బుల్లితెరపై సందడి చేయడం నిజమని తెలుస్తోందిntr;ntr;amitabh bachchan;jr ntr;suma;suma kanakala;telugu;star maa;nandamuri taraka rama rao;nijam;geminiఎన్టీఆర్ రూటే సెపరేటు.. 60 ఎపిసోడ్లు.. రూ. 18కోట్లు..ఎన్టీఆర్ రూటే సెపరేటు.. 60 ఎపిసోడ్లు.. రూ. 18కోట్లు..ntr;ntr;amitabh bachchan;jr ntr;suma;suma kanakala;telugu;star maa;nandamuri taraka rama rao;nijam;geminiThu, 17 Dec 2020 23:57:43 GMTజూనియర్ ఎన్టీఆర్ మళ్లీ బుల్లితెరపై కనిపించబోతున్నాడు అని సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. మొదట ఇది కేవలం గాసిప్ మాత్రమే అని అందరూ అనుకున్నారు. కానీ.. జూనియర్ ఎన్టీఆర్ మరోసారి నిజంగానే బుల్లితెరపై సందడి చేయడం నిజమని తెలుస్తోంది. ఇప్పటికే బిగ్‌బాస్ వంటి రియాల్టీ షోకు హోస్ట్‌గా నటించి జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరలోనూ తన సత్తాను చాటాడు.

 ఇప్పుడు మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు ఈ యంగ్ టైగర్ సుముఖత చూపుతున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఈసారి జూనియర్ ఎన్టీఆర్ స్టార్ మా కాకుండా జెమిని టీవీలో ఓ కార్యక్రమాన్ని హోస్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. జెమిని టీవీలో ఓ ప్రత్యేక టాక్ షోను ఎన్టీఆర్ నిర్వహించబోతున్నాడని అర్థమవుతోంది. కౌన్ బనేగా కరోడ్‌పతీ తరహాలో ఈ కార్యక్రమం ఉండబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హిందీలో ఈ కార్యక్రమాన్ని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే తెలుగులో ఇప్పటివరకు ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

 అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మరోసారి తన సత్తాను చాటనున్నాడని విశ్లేషకులు అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు ఏ అవకాశాన్ని ఇచ్చినా దానికి వందకు వంద శాతం శ్రమ పెట్టి పనిచేస్తాడు. బిగ్‌బాస్‌లో ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసి అందరి మన్ననలను పొందాడు. వెండితెరపైనే కాదు బుల్లితెరపైన కూడా జూనియర్ ఎన్టీఆర్‌ను మించే వారు లేరు అనే విధంగా బిగ్‌బాస్‌లో ఎన్టీఆర్ తన సత్తాను చాటాడు. ఇక ఇప్పుడు మరోసారి జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరపై మెరిసి తన ప్రతిభను మరోసారి ప్రేక్షకులకు చూపించనున్నారు. ఇక ఇదిలా ఉంటే.. యంగ్ టైగర్ నిర్వహించే ఈ కార్యక్రమంలో మొత్తం 60 ఎపిసోడ్లు ఉంటాయని తెలుస్తోంది. ఈ కార్యక్రమం కోసం జూనియర్ ఎన్టీఆర్ భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారట. మొత్తం 60 ఎపిసోడ్లు ఉండగా.. ఒక్కో ఎపిసోడ్‌కు రూ.30 లక్షల చొప్పున ఎన్టీయార్ అందుకోబోతున్నాడట. అంటే.. మొత్తం 60 ఎపిసోడ్లకు కలిపి తారక్ రూ.18 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఇదే అనుకుంటే మరో వార్త కూడా ఫిల్మ్‌నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ కార్యక్రమాన్ని జూనియర్ ఎన్టీయార్ తానే స్వయంగా నిర్మిస్తున్నాడని ఇందులో రెమ్యునరేషన్ అనే అంశమే లేదని టాక్ వినిపిస్తోంది. మరి అసలు మన యంగ్ టైగర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడా.. నిర్వహిస్తే రెమ్యునరేషన్ భారీగా తీసుకుంటున్నాడా లేక స్వయంగా నిర్మిస్తాడా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాలి.


ఊపిరితిత్తుల సమస్య రాకుండా ఉండాలంటే ఈ పద్ధతులు పాటించండి...

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>