Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/google-maps42e9bca7-18a7-46f7-82f3-29ae9920fcfa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/google-maps42e9bca7-18a7-46f7-82f3-29ae9920fcfa-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో గూగుల్ మ్యాప్స్ అత్యవసమైపోయాయి. ఎక్కడికి వెళ్లాలన్నా గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని ఎంచక్కా వెళ్లిపోతున్నారు. అయితే ఈ గూగుల్ మ్యాప్స్ కారణంగా రష్యాలో ఓ వ్యక్తి ప్రాణం పోయింది. 18 ఏళ్ల సర్జీ ఉస్తినోవ్, రష్యాలోని యుకుత్స్క్‌లో నివశిస్తున్నాడు. అయితే తన స్నేహితుడు వ్లాదిస్లావ్ ఇస్తోమిన్‌‌తో కలిసి ...google maps;jeevitha rajaseskhar;police;google;airనిండు ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్స్నిండు ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్స్google maps;jeevitha rajaseskhar;police;google;airWed, 16 Dec 2020 13:23:54 GMTఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో గూగుల్ మ్యాప్స్ అత్యవసమైపోయాయి. ఎక్కడికి వెళ్లాలన్నా గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని ఎంచక్కా వెళ్లిపోతున్నారు. అయితే ఈ గూగుల్ మ్యాప్స్ కారణంగా రష్యాలో ఓ వ్యక్తి ప్రాణం పోయింది. 18 ఏళ్ల సర్జీ ఉస్తినోవ్, రష్యాలోని యుకుత్స్క్‌లో నివశిస్తున్నాడు. అయితే తన స్నేహితుడు వ్లాదిస్లావ్ ఇస్తోమిన్‌‌తో కలిసి మగడాన్ ప్రాంతానికి వెళ్లాలనుకున్నాడు. దీనికోసం గూగుల్ మ్యాప్స్‌ను వినియోగించాడు. అయితే రష్యాకు చెందిన యాండెక్స్ మ్యాప్స్‌లో 1,900 కిలోమీటర్ల దూరం ఎక్కువ దూరం చూపించింది. అయితే వీరిద్దరూ గూగుల్ మ్యాప్స్ వినియోగించడం, ఆ మ్యాప్స్‌లో షార్ట్ కట్ చూపించడంతో వారు ఆ దారినే ఎంచుకున్నారు. అయితే అప్పటికే ఆ దారిలో దాదాపు -50 డిగ్రీల ఉష్ణోగ్రతతో భయంకరమైన చలి వాతావరణం ఉంది. కొంత దూరం వెళ్లేసమయానకి కారు రేడియేటర్‌లో చెట్టు కొమ్మ గుచ్చుకుంది. దీంతో కారు రేడియేటర్ పూర్తిగా చెడిపోయింది. కారు ఆగిపోయింది.

అంత చలి వాతావరణాన్ని వారు ఊహిచకపోవడంతో చలిని తట్టుకునేందుకు ఎలాంటి దుస్తులు తీసుకెళ్ళలేదు. దీంతో ఆ చలిలో చిక్కుకుపోయారు. కారు కూడా కదిలే పరిస్థితి లేకపోవడంతో చలికి తట్టుకోలేక ఇద్దరు స్నేహితులూ ఫ్రాస్ట్‌బైట్‌(చలివల్ల శరీరం కొరుక్కు తినడం)కు గురయ్యారు. కారు టైర్ తీసి మంట వేసుకునేందుకు ప్రయత్నించినా అది సరిపోలేదు. ఈ దుర్భర పరిస్థితుల్లో ఇద్దరు స్నేహితులూ అపస్మారక  స్థితిలోకి చేరుకున్నారు.

అదృష్ట వశాత్తూ వీరు ఈ దారిలో రావడం చూసిన కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారమివ్వడంతో వారు అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటికి వీరిని గుర్తించారు. అయితే అప్పటికే సర్జీ రాయిలా గడ్డకట్టుకుపోయి చనిపోయాడు. వ్లాదిస్లావ్ మాత్రం కొనఊపిరితో కొట్టుకుంటున్నాడు. దీంతో అతడిని పోలీసులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గూగుల్ మ్యాప్స్ ఆ దారిని తమ మ్యాప్స్‌లో బ్యాన్ చేసింది.         


వనస్థలిపురంలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభం

వీరిలో టాలీవుడ్ నెంబర్ 1 స్టార్ హీరోయిన్ ఎవరు

స్టైలిష్ స్టార్ ని టాప్ హీరోగా నిలబెట్టిన ఆ సినిమాని ఆ హీరో రిజెక్ట్ చేశాడట..

మాట నిలబెట్టుకున్న తెలంగాణా సర్కార్... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు సూపర్ సౌకర్యాలు

అమరావతి ఏకైక రాజధాని... జగన్ పప్పులు ఉడకవా..?

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>