PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/acb6ce734b6-f54b-4f27-8a7e-15ff60e3430a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/acb6ce734b6-f54b-4f27-8a7e-15ff60e3430a-415x250-IndiaHerald.jpgఅవినీతికి అలవాటు పడిన అధికారులు అడ్డదారులు తొక్కుతూ కోట్లాది రూపాయాలు కూడబెట్టుకుంటున్నారు. అవినీతి చేపల ఆటకట్టించడానికి ఏసీబీ అధికారులు కొరడా ఝలిపిస్తున్నా ఏ మాత్రం భయపడటం లేదు. వీరి అక్రమాలకు అడ్డుఅదుపే లేకుండా పోతోంది. తాజాగా, మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి నివాసంపై ఏసీబీ జరిపిన దాడుల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి.acb;auto;patti;police;silver;pollution;anti-corruption bureauఏసీబీ కి చిక్కిన అవినీతి తిమింగలంఏసీబీ కి చిక్కిన అవినీతి తిమింగలంacb;auto;patti;police;silver;pollution;anti-corruption bureauWed, 16 Dec 2020 13:16:01 GMTఏసీబీ కి చిక్కిన అవినీతి తిమింగలం

అవినీతికి అలవాటు పడిన అధికారులు అడ్డదారులు తొక్కుతూ కోట్లాది రూపాయాలు కూడబెట్టుకుంటున్నారు. అవినీతి చేపల ఆటకట్టించడానికి ఏసీబీ అధికారులు కొరడా ఝలిపిస్తున్నా ఏ మాత్రం భయపడటం లేదు. వీరి అక్రమాలకు అడ్డుఅదుపే లేకుండా పోతోంది. తాజాగా, మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి నివాసంపై ఏసీబీ జరిపిన దాడుల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. కిలోల కొద్దీ బంగారం, వెండి, నోట్ల కట్టలు చూసి అధికారులు అవాక్కయ్యారు. చెన్నైలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి పాండ్యన్ నివాసంలో ఏసీబీ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించారు

పరిశ్రమలకు పొల్యూషన్ అనుమతులు ఇవ్వడానికి పలువురు నుంచి పాండ్యన్ భారీగా నగదు తీసుకున్నట్టు సమాచారం అందడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. సైదాపేట్‌లోని పాండ్యన్ ఇంట్లో దాడులు చేసిన అధికారులు.. లెక్కలు చూపని నగదు, బంగారం, ఆస్తులను భారీగా గుర్తించారు. విలువైన వజ్రాలు, మూడు కిలోల బంగారం, మూడున్నర కిలోల వెండి అభరణాలతోపాటు రూ.1.37 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. వీటితోపాటు మొత్తం 18 చోట్ల రూ.50 కోట్ల విలువైన స్థిర ఆస్తులున్నట్టు పత్రాలు బయటపడ్డాయి.
వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. పాండ్యన్ నివాసంలో లభ్యమైన ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు.. కేసు నమోదుచేశారు. పాండ్యన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. లాకర్‌ కీ, పలు భూపత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఆస్తుల విలువ రూ.వందల కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు.



వనస్థలిపురంలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభం

వీరిలో టాలీవుడ్ నెంబర్ 1 స్టార్ హీరోయిన్ ఎవరు

స్టైలిష్ స్టార్ ని టాప్ హీరోగా నిలబెట్టిన ఆ సినిమాని ఆ హీరో రిజెక్ట్ చేశాడట..

మాట నిలబెట్టుకున్న తెలంగాణా సర్కార్... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు సూపర్ సౌకర్యాలు

అమరావతి ఏకైక రాజధాని... జగన్ పప్పులు ఉడకవా..?

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>