PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/donors-steel-will-formers-in-delhia753b314-cc7d-48b0-9b23-0b2ba4c33109-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/donors-steel-will-formers-in-delhia753b314-cc7d-48b0-9b23-0b2ba4c33109-415x250-IndiaHerald.jpgఅన్నదాతల నిరసనలతో దేశ రాజధాని ఢిల్లీ, ఢిల్లీ సరిహద్దులు మార్మోగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల ఉక్కు సంకల్పం చెక్కుచెదరటం లేదు. దేశంలో రైతాంగ ఉద్యమాలలో సరి కొత్త చరిత్రను లిఖిస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం లక్షలాది మంది రైతులు ట్రాక్టర్లు, ట్రాలీలు, ఎడ్లబండ్లతో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రహదారులపై సాగిస్తున్న బైఠాయింపు 21 రోజు కొనసాగుతోంది. donors steel will formers in delhi;modi;delhi;bharatiya janata party;hisar;gujarat - gandhinagar;haryana - chandigarh;police;capital;prime minister;job;cheque;central government;punjab;mantraఅన్నదాతల ఉక్కు సంకల్పం..!అన్నదాతల ఉక్కు సంకల్పం..!donors steel will formers in delhi;modi;delhi;bharatiya janata party;hisar;gujarat - gandhinagar;haryana - chandigarh;police;capital;prime minister;job;cheque;central government;punjab;mantraWed, 16 Dec 2020 14:00:00 GMTరాజధాని ఢిల్లీ, ఢిల్లీ సరిహద్దులు మార్మోగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల ఉక్కు సంకల్పం చెక్కుచెదరటం లేదు. దేశంలో రైతాంగ ఉద్యమాలలో సరి కొత్త చరిత్రను లిఖిస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం లక్షలాది మంది రైతులు ట్రాక్టర్లు, ట్రాలీలు, ఎడ్లబండ్లతో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రహదారులపై సాగిస్తున్న బైఠాయింపు 21 రోజు కొనసాగుతోంది.  

కేంద్రం మొండిగా వ్యవహరించినా, రైతులను సంఘవిద్రోహ శక్తులని విమర్శించినా, ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా  పోరాటం రోజు రోజుకూ మరింత ఉధృతంగా, విస్తృతంగా మారుతోంది.  రైతుల పోరాటానికి వందలాది రైతు సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు, ఎన్నో ప్రజాసంఘాలు, మేధావుల విశాల మద్దతు, సంఘీభావం లభిస్తోంది.

జాతికి అన్నం పెట్టే రైతుల చేతులను నరికేయొద్దని రైతుల పోరాటం నినదిస్తోంది. మొదట పంజాబ్ రైతులకే ఉద్యమం పరిమితమని బిజెపి భావించింది. కానీ, ఢిల్లీ ముట్టడి రైతు ఉద్యమ అసలు స్వరూపాన్ని ప్రచంచానికి చాటింది. ఈ స్థాయిలో వ్యతిరేకిస్తున్నా, చట్టాల సమూల రద్దు కాకుండా కొన్ని సవరణలు చేస్తామని మోడీ సర్కారు చెబుతోంది.  

అటు ఢిల్లీ సరిహద్దుల్లో రోజు రోజుకు నిరసనకారుల సంఖ్య పెరుగుతున్నారు. ఒకరు వెనక్కు వెళితే ఇద్దరు ముగ్గురు వస్తున్నారు. దీంతో ఉద్యమం మరింత తీవ్రంగా మారుతోంది. విపరీతంగా తరలివస్తున్న రైతులను నియంత్రించడం కోసం పోలీసులు పంజాబ్, హర్యానా సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుండి అంబాల , ఢిల్లీ నుండి హిసార్ రోడ్స్ రైతుల ఆందోళనతో మూతపడ్డాయి. ఎవరైనా ఢిల్లీ లోకి ప్రవేశించాలి అనుకుంటే  గ్రామాల లింకు రోడ్ల ద్వారా సుదూర ప్రయాణాలు చేయాల్సిందే..

వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే తాము వెళ్లేది లేదని రైతులు తేల్చి చెప్తున్నారు. 6 నెలల రేషన్ కూడా తెచ్చుకున్నామని, శిబిరాల వద్ద సౌకర్యాల కొరత ఉన్నప్పటికీ ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్తున్నారు. అటు ఢిల్లీ పోలీసులు  రాజధాని సరిహద్దుల్లో సెక్యూరిటీ పెంచారు. సింఘు బార్డర్లో మల్లీలేయర్డ్ సిమెంట్ బారియర్లు, ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను మోహరించారు. రెండో వరుసలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పారామిలటరీ ఫోర్స్ మోహరించారు. ప్రయాణికులు ఆల్టర్నేటివ్ రూట్లలో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

అయితే గుజరాత్ పర్యటనలో ప్రధాని మోడీ మరోసారి సాగు సంస్కరణలను సమర్థించారు. రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు.  ప్రతిపక్షాలు అన్నదాతలను తప్పుదోవ పట్టిస్తున్నాయని దుయ్యబట్టారు.  కొత్త చట్టాలు అమలైతే మీ భూములను లాక్కుంటారని అన్నదాతలను భయపెడుతున్నారని.,  ఇదంతా పత్రిపక్షాల కుట్రలో భాగమేనన్నారు.  గతంలో విపక్షాలు కోరిన అంశాలనే చట్టాలుగా తీసుకొచ్చామని, రైతు సంఘాలు కూడా ఈ సంస్కరణలు తీసుకురావాలని కోరాయని మోడీ వివరించారు.

రైతులతో మరోసారి చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొత్త చట్టాలను అన్నదాతలు అర్థం చేసుకోవాలని, సమస్యలుంటే అందుకు అనుగుణంగా సూచనలు చేయాలని పలువురు కేంద్ర మంత్రులు విజ్ఞప్తి చేశారు.  




బి బి 4: ఇంటి సభ్యుల పై కీలక వ్యాఖ్యలు చేసిన సింగర్ గీతా మాధురి...!

వీరిలో టాలీవుడ్ నెంబర్ 1 స్టార్ హీరోయిన్ ఎవరు

స్టైలిష్ స్టార్ ని టాప్ హీరోగా నిలబెట్టిన ఆ సినిమాని ఆ హీరో రిజెక్ట్ చేశాడట..

మాట నిలబెట్టుకున్న తెలంగాణా సర్కార్... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు సూపర్ సౌకర్యాలు

అమరావతి ఏకైక రాజధాని... జగన్ పప్పులు ఉడకవా..?

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>