WomenP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/farmersprotest726ae66d-3937-405f-8d0a-ba4caa32b1c6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/farmersprotest726ae66d-3937-405f-8d0a-ba4caa32b1c6-415x250-IndiaHerald.jpgరైతుల వద్దకే వ్యాపారులు నేరుగా వెళ్లి పంట కొనుగోలు చేసుకోవచ్చు అని రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార చట్టం చెబుతోంది. దేశంలో కొన్ని లక్షల మంది ఒంటరి మహిళలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. అసలు మన మార్కెట్‌ వ్యవస్థ మహిళా రైతులకు ఎన్నడూ అనుకూలంగా ఉన్న పరిస్థితి లేదు.farmersprotest;women;kavitha;tiru;delhi;narendra modi;woman;central governmentరైతుల ఉద్యమం వెనుక కీలక పాత్ర పోషిస్తున్న మహిళలురైతుల ఉద్యమం వెనుక కీలక పాత్ర పోషిస్తున్న మహిళలుfarmersprotest;women;kavitha;tiru;delhi;narendra modi;woman;central governmentWed, 16 Dec 2020 15:53:53 GMTకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా లక్షలాది రైతులతో ఢిల్లీ సరిహద్దులు కుంభమేళాను తలపిస్తున్నాయి. భారతదేశ చరిత్రలోనే ఇదొక కనీవినీ ఎరుగని రైతాంగ పోరాటం అని ఇటు భారతీయులతో పాటు అటు ప్రపంచదేశాలు కూడా చెబుతున్నాయి. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా రైతులు ఉద్యమిస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి కేంద్రం నుంచి అనుకూల స్పందన రానప్పటికి అనుకున్నది సాధించి తీరుతామనే దృఢ విశ్వాసం ప్రతి ఒక్క రైతులో ఇప్పటికీ కనిపిస్తుండటం విశేషం. పంజాబ్‌లో మెజారిటీ కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నాయి. వ్యవసాయ చట్టాలు తమకు వ్యతిరేంగా ఉండటంతో.. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయించాకే ఇంటికి తిరుగు ప్రయాణమవుతామని ప్రతినపూని వచ్చి ఇప్పటికి ఇంటికి వెళ్లకుండా ఉద్యమించేవారు ఇందులో చాలామందే ఉన్నారు. ఇక ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇప్పటికే వందలాది రైతు సంఘాలు ఈ ఉద్యమంలో పాల్గొన్నాయి. ఆ సంఘాల్లో మహిళలు అత్యధికంగా ఉన్నారు. ఉద్యమంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వీరంతా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించడంలో తమవంత కృషి అందిస్తున్నారు. రైతుల వద్దకే వ్యాపారులు నేరుగా వెళ్లి పంట కొనుగోలు చేసుకోవచ్చు అని రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార చట్టం చెబుతోంది. దేశంలో కొన్ని లక్షల మంది ఒంటరి మహిళలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. అసలు మన మార్కెట్‌ వ్యవస్థ మహిళా రైతులకు ఎన్నడూ అనుకూలంగా ఉన్న పరిస్థితి లేదు. కొత్త చట్టంలో భాగంగా వారు నేరుగా వెళ్లి ఉత్పత్తులను అమ్ముకోవడం సులువైన పని కాదు. దీనికి సంబంధించి గతంలోనే యూపీఏ ప్రభుత్వం ఓ కమిటీని కూడా వేసింది. ఆ కమిటీలో కవిత కురుగంటి అనే మహిళ కూడా సభ్యురాలిగా ఉన్నారు.

2015లో మోదీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించినా.. ఆ మార్గదర్శకాలను ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమె చెబుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులతో పాటు పాలు, కూరగాయలు, అటవీ ఉత్పత్తులు తదితర వస్తువులపై రైతులు పెట్టే పెట్టుబడికి అదనంగా యాభై శాతం కలిపి కనీస మద్దతు ధరగా ప్రకటిస్తూ కేంద్రం చట్టం చేయాలని రైతు సంఘాలన్నీ దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాయని ఆమె వివరించారు. ప్రస్తుతం తమ రెండో ప్రధాన డిమాండ్‌ కూడా అదేనని ఆమె తెలిపారు.




బెంగాల్ లో టీఎంసీకి షాక్! బీజేపీలోకి కీలక నేత

రోజుకు 100మందికే కరోనా వ్యాక్సిన్?.. కేంద్రం ప్రకటన!

మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్.. F3 కోసం అనీల్ రావిపుడికి అంత ఇస్తున్నారా..?

ఆ నెలలో సాగర్ ఉపఎన్నిక ఉంటుందట..

సీఎంల ఢిల్లీ పర్యటనపై రాజకీయాల్లో ఉత్కంఠ..!

ఇటు ఎస్ఈసీ...అటు సర్కార్ నడుమ స్థానిక సమరం

20 నిమిషాల రోల్.. 20 కోట్ల రెమ్యునరేషన్.. సలార్ అంటే ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>