PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-talangana12175bbc-19d9-4fa8-b346-17d852c67239-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-talangana12175bbc-19d9-4fa8-b346-17d852c67239-415x250-IndiaHerald.jpgఏపీ పోలీస్ విభాగానికి ఇప్పటికే పలు జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. తాజాగా ఏపీ పోలీస్, ఐసీజేఎస్ విభాగంలో దేశవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచింది. ఈమేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏపీ పోలీస్ కి అవార్డు అందించారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ వర్చువల్ విధానం ద్వారా ఈ అవార్డు అందుకున్నారు. ఇంటర్ అపరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌ (ఐసీజేఎస్‌)లో పోలీస్ డిపార్ట్ మెంట్ సహా, కోర్టులు, జైళ్లు, ఫోరెన్సిక్, తదితర విభాగాలుంటాయి. వీరందరితో కలసి బాధితులకు సత్వర న్యాయం అందేలా ఏపీ పోలీసులు కృషి చేసap talangana;amala akkineni;gautham new;gautham;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;sathwara;andhra pradesh;maharashtra - mumbai;telangana;g kishan reddy;police;court;minister;maharashtra;traffic police;central government;reddyఏపీ నెంబర్ 2, తెలంగాణ నెంబర్ 3ఏపీ నెంబర్ 2, తెలంగాణ నెంబర్ 3ap talangana;amala akkineni;gautham new;gautham;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;sathwara;andhra pradesh;maharashtra - mumbai;telangana;g kishan reddy;police;court;minister;maharashtra;traffic police;central government;reddyWed, 16 Dec 2020 07:00:00 GMTఏపీ పోలీస్ విభాగానికి ఇప్పటికే పలు జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. తాజాగా ఏపీ పోలీస్, ఐసీజేఎస్ విభాగంలో దేశవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచింది. ఈమేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏపీ పోలీస్ కి అవార్డు అందించారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ వర్చువల్ విధానం ద్వారా ఈ అవార్డు అందుకున్నారు. ఇంటర్ అపరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌ (ఐసీజేఎస్‌)లో పోలీస్ డిపార్ట్ మెంట్ సహా, కోర్టులు, జైళ్లు, ఫోరెన్సిక్, తదితర విభాగాలుంటాయి. వీరందరితో కలసి బాధితులకు సత్వర న్యాయం అందేలా ఏపీ పోలీసులు కృషి చేస్తున్నారని, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నారని కేంద్ర హోం శాఖ అభినందించింది.

ఐసీజేఎస్‌ అమలు, వినియోగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఏపీ పోలీసు శాఖ జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానాన్ని మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్ మెంట్ కైవసం చేసుకుంది. ఏపీ రెండో స్థానంలో ఉండగా.. తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఈ అవార్డులకు దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పోటీ పడ్డాయి. క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌లోని అన్ని విభాగాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, సమాచార మార్పిడి, విశ్లేషణలతో ఆన్‌ లైన్‌ ద్వారా సమన్వయ పరిచే విధానమే ఇంటర్‌ ఆపరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌ (ఐసీజేఎస్‌). బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ఈ విధానం తోడ్పడుతుంది. అన్ని విభాగాలూ ఆన్‌లైన్‌లో సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ, వివరాలు ఎప్పటికప్పుడు అందజేస్తుండటంతో కేసుల పరిష్కారం సులువవుతుంది.

టెక్నాలజీ వినియోగంలో ముందున్న ఏపీ పోలీస్.. ఐసీజేఎస్ విధానాన్ని సమర్ధంగా అమలు చేస్తోంది. విచారణ వేగవంతంగా పూర్తి చేయడం, అతి తక్కువ సమయంలో చార్జిషీట్లు దాఖలు చేయడం, కేసులను పరిష్కరించడంలో సాధించిన పురోగతితో ఏపీ పోలీసు శాఖ జాతీయ స్థాయిలో రెండవ స్థానాన్ని సాధించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ శాంతిభద్రతల పరిరక్షణకు చేస్తున్న కృషికి గాను ఏపీ పోలీసులు జాతీయ స్థాయిలో గతంలో ‘స్కోచ్‌’ అవార్డులు సాధించారు.


రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కు సాంకేతిక సమస్యలు

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>